జల శక్తి మంత్రిత్వ శాఖ
స్వచ్ఛ భారత్ మిషన్ విజయ గాథ: కర్ణాటకలోని గడగ్ జిల్లాలోని 32 గ్రామ పంచాయతీలలో పింక్ టాయిలెట్లు
Posted On:
18 APR 2022 2:26PM by PIB Hyderabad
పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరిచి, యుక్తవయస్సులో ఉన్న బాలికలు రుతుక్రమం సమయంలో ఎదుర్కొంటున్న సమస్యలు తొలగించి వారికి సురక్షిత, సౌకర్యవంతమైన సౌకర్యాలను కల్పించేందుకు కర్ణాటక లోని గడగ్ జిల్లా యంత్రాంగం జిల్లావ్యాప్తంగా 32-గ్రామ పంచాయతీలలో (జీపీ ) పింక్ టాయిలెట్ల ను నిర్మిస్తోంది.
వీటిలో 20 యూనిట్ల నిర్మాణం పూర్తయింది. మిగిలిన 12 యూనిట్ల నిర్మాణం ఉంది. ఒకో యూనిట్ ను ఆరు లక్షల రూపాయల ఖర్చుతో చేపట్టారు. మొత్తం ఖర్చులో మూడు లక్షల రూపాయలను మహాత్మ గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి సమకూరుస్తున్నారు. 1.8 లక్షల రూపాయలను స్వచ్ఛ భారత్ మిషన్-గ్రామీణ నుంచి మిగిలిన 1.2 లక్షల రూపాయలను గ్రామ పంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి సమకూర్చడం జరిగింది.
ఇటువంటి సౌకర్యాన్ని మొదట కెహెచ్ పాటిల్ బాలికల సీనియర్ ప్రైమరీ పాఠశాలలో కల్పించారు. సౌకర్యం వల్ల ఆశించిన ఫలితం రావడంతో ఇతర గ్రామాలలో కూడా వీటి నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది.
స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ కింద చేపట్టిన ఈ పింక్ మరుగుదొడ్లకు తగినంత నీటి సరఫరా, వెలుతురు అయ్యేలా నిర్మించారు. కౌమారదశలో ఉన్న బాలికలు మరియు మహిళల కోసం వాష్ రూమ్, , దుస్తులు మార్చుకునే గది మరియు ఇతర సౌకర్యాలను వీటిలో కల్పించారు. ప్రతి యూనిట్‌లో సానిటరీ ప్యాడ్‌లు మరియు రుతుక్రమ వ్యర్థాలను సురక్షితంగా పారవేయడానికి ఒక ఇన్సినరేటర్ ఏర్పాటు చేశారు.
స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణలో అమలు చేస్తున్న వ్యర్థాల నిర్వహణ కారక్రమంలో రుతు పరిశుభ్రత అంశానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ అంశం ఆరోగ్యం మరియు శ్రేయస్సు అంశాలనుమాత్రమే కాకుండా విద్య మరియు బాలికలు, మహిళల సమగ్ర అభివృద్ధి సాధనలో ప్రభావం చూపే అంశాల్లో కీలకంగా ఉంటుంది. దేశంలో కౌమారదశలో ఉన్న బాలికలు మరియు మహిళలందరికీ సహకారం అందించే అంశంలో ఇవ్వడానికి కేంద్ర తాగునీరు మరియు పారిశుద్ధ్య శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. వీటిలో రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగం , ఇంజనీర్లు మరియు వివిధ శాఖలకు చెందిన సాంకేతిక నిపుణులతో సహా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు నిర్వర్తించాల్సిన బాధ్యతలను స్పష్టంగా పేర్కొనడం జరిగింది.
తమకు కల్పిస్తున్న సౌకర్యాల పట్ల బాలికలు మరియు మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. , బహిష్టు సమయంలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోతాయని వారు అంటున్నారు.
స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, 15వ ఎఫ్సి, జిపి నిధులతో మరుగుదొడ్లు నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ప్రత్యేక కార్యక్రమంతో స్వచ్ఛ గ్రామాలను నిర్మించాలన్న కల సాకారమవుతోంది.
పింక్ టాయిలెట్లలో కల్పించిన సౌకర్యాలను సక్రమంగా సరైన విధంగా వినియోగించుకుని, వాటిని సరైన విధంగా నిర్వహించే అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి మరియు మానిటరింగ్ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు మరియు గ్రామ పంచాయతీ సభ్యులకు పాఠశాల స్థాయిలో శిక్షణ నిర్వహించబడింది. ఇన్సినరేటర్ల వినియోగంపై ప్రత్యేక శిక్షణ అందించారు.
గ్రామంలోని మహిళలకు శానిటరీ ప్యాడ్‌లను తయారు చేసేందుకు ఎన్‌ఆర్‌ఎల్‌ఎం స్వయం సహాయక బృందాల ద్వారా శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈలోగా, పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి, గోడలపై నినాదాలు, కరపత్రాల పంపిణీ ద్వారా బహిరంగ ప్రదేశాల్లో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల వల్ల అన్ని వర్గాలు చైతన్యవంతం అవుతాయని ఆశిస్తున్నారు. సామాజిక మాధ్యమాలు మరియు డాక్యుమెంటరీల ద్వారా సురక్షితమైన పారిశుధ్యం మరియు పరిశుభ్రత సందేశాలు కూడా ప్రసారం చేస్తున్నారు.
(Release ID: 1817846)
Visitor Counter : 210