ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కోవిడ్-19 సహా ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో ‘బీఏపీఎస్’ సేవలకు ప్రధానమంత్రి అభినందన

Posted On: 16 APR 2022 6:35PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘బీఏపీఎస్’కు చెందిన సీనియర్ సాధువులు.. స్వామి ఈశ్వరచరణ్, స్వామి బ్రహ్మవిహారిలతో సమావేశమయ్యారు. కోవిడ్-19 సమయంలోనే కాకుండా ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో ‘బీఏపీఎస్‘ అందించిన సహాయ సహకారాలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. మాననీయులైన హెచ్‌హెచ్ ప్రముఖ్ స్వామి మహరాజ్ రాబోయే శతజయంతి ఉత్సవాల గురించి కూడా శ్రీ మోదీ వారితో చర్చించారు.

ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:

   ‘‘బీఏపీఎస్’కు చెందిన సీనియర్ సాధువులు.. స్వామి ఈశ్వరచరణ్, స్వామి బ్రహ్మవిహారిలను నేను కలుసుకున్నాను. కోవిడ్-19 సమయంలోనే కాకుండా ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలోనూ ‘బీఏపీఎస్’ ఆదర్శప్రాయం.. అభినందనీయం. ఈ సమావేశం సందర్భంగా మాననీయులైన ప్రముఖ్ స్వామి మహారాజ్ రాబోయే శతజయంతి వేడుకల గురించి కూడా వారితో చర్చించాను. సమాజానికి ఆయన తనవంతుగా చేసిన గొప్ప సేవను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాను’’ అని ప్రధాని పేర్కొన్నారు.’’

Met senior BAPS Sadhus, Ishwarcharan Swami and Brahmavihari Swami. Appreciated BAPS relief work in the time of COVID-19 and during the Ukraine crisis. Discussed the upcoming birth centenary celebrations of HH Pramukh Swami Maharaj Ji and recalled his rich contribution to society. pic.twitter.com/Y4se8vkwM3

— Narendra Modi (@narendramodi) April 16, 2022
 
*****
DS/ST

(Release ID: 1817548) Visitor Counter : 146


Read this release in: Malayalam , English , Urdu , Marathi , Hindi , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada