ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘పిఎమ్ ఆవాస్ యోజన’ లబ్ధిదారుల లో ఒకరి కి లేఖ ను వ్రాసిన ప్రధాన మంత్రి శ్రీనరేంద్ర మోదీ;  పక్కా ఇల్లు మెరుగైన రేపటి రోజు కుపునాది గా ఉంటుంది అని పేర్కొన్నారు


‘‘లబ్ధిదారుల జీవనం లో ఎదురైన ఈ జ్ఞాపకం ఉంచుకోదగ్గ క్షణాలే దేశ ప్రజల సేవ లోఅలుపెరుగక, నిరంతరాయం గా కృషి చేస్తుండడాని కి ప్రేరణ ను మరియు శక్తి ని ఇస్తాయి’’

Posted On: 12 APR 2022 10:53AM by PIB Hyderabad

‘‘ఇల్లు అంటే అది ఇటుకల తో, సిమెంటు తో కట్టినటువంటి ఒక నిర్మాణం మాత్రమే కాదు, అది ఆ గృహం తో పెనవేసుకొన్న మన మనోభావాలు, మన ఆకాంక్ష లు కూడాను అని చెప్పాలి. ఇంటి నాలుగు సరిహద్దు ల గోడ లు మనకు సురక్ష ను అందించడం ఒక్కటే కాక మెరుగైన రేపటి రోజు కు సంబంధించినటువంటి మనలో విశ్వాసాన్ని కూడా మేలుకొలుపుతాయి.’’ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మధ్య ప్రదేశ్ లోని సాగర్ జిల్లా కు చెందిన శ్రీ సుధీర్ కుమార్ జైన్ కు తాను వ్రాసిన ఒక లేఖ లో ఈ మాటలు పొందుపరచారు. సుధీర్ కుమార్ జైన్ గారు ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ లో భాగం గా ఒక పక్కా ఇంటి ని అందుకొన్నారు. ఈ సందర్భం లో శ్రీ సుధీర్ కుమార్ జైన్ ను ప్రధాన మంత్రి అభినందిస్తూ ఆయన కు ఒక ఉత్తరం వ్రాశారు. ‘మీరు మీ కంటూ ఒక ఇంటి ని పొందడం తాలూకు సంతోషం వెలకట్టలేనిది’ అని ప్రధాన మంత్రి తన లేఖ లో పేర్కొన్నారు.

శ్రీ సుధీర్ కు వ్రాసిన లేఖ లో ప్రధాన మంత్రి తన అభిప్రాయాల ను ఇంకా ఇలా వ్యక్తం చేశారు.. ‘‘సొంత ఇల్లు కోసం మీరు కన్న కల ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ ద్వారా నిజం అయింది. ఈ కార్యసాధన విషయం లో మీకు కలిగిన సంతృప్తి ఎటువంటిది అనేది లేఖ లో మీరు పొందుపరచిన భావాల ను బట్టి చూస్తే ఇట్టే అర్థం అవుతున్నది. ఈ గృహం మీ కుటుంబం యొక్క గౌరవ ప్రదమైనటువంటి జీవనాని కి, మరి అలాగే మీ పిల్లలిద్దరి మెరుగైన భవిష్యత్తు కు ఒక సరికొత్త పునాది వంటిది.’’

ఇంతవరకు పిఎం ఆవాస్ యోజన లో భాగం గా కోట్ల కొద్దీ లబ్ధిదారులు వారికంటూ పక్కా ఇళ్ళ ను అందుకొన్నారు అని కూడా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. అవసరం ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాని కి ఇళ్ళ ను అందజేయాలన్న లక్ష్యం వైపు పయనించేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకొంది అని ఆయన అన్నారు. వివిధ సార్వజనిక సంక్షేమ పథకాల ద్వారా దేశ ప్రజల జీవితాల లో సకారాత్మకమైనటువంటి మార్పుల ను తీసుకు రావడం కోసం ప్రభుత్వం నిజాయతీ తో కూడిన ప్రయాస లు చేస్తోంది అని ప్రధాన మంత్రి అన్నారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తాను శ్రీ సుధీర్ కు వ్రాసిన లేఖ లో.. ‘సుధీర్ గారు వంటి లబ్ధిదారుల జీవనం లో ఇవి గుర్తు పెట్టుకోదగ్గ క్షణాలు. ఇటువంటి సందర్భాలే దేశ ప్రజల కు సేవ చేయడం లో అలుపు ఎరుగనటువంటి మరియు నిరంతరాయమైనటువంటి కృషి ని కొనసాగించేందుకు ప్రేరణ ను, శక్తి ని ఇస్తాయి’ అని పేర్కొన్నారు.

నిజాని కి, సుధీర్ గారు ఇటీవల పిఎమ్ ఆవాస్ యోజన లో భాగం గా తనకంటూ ఒక పక్కా ఇంటి ని పొంది, అందుకు కృతజ్ఞత సూచకం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి ఒక లేఖ ను వ్రాశారు. ప్రధాన మంత్రి కి వ్రాసిన ఉత్తరం లో ‘పిఎమ్ ఆవాస్ యోజన’ అనేది ఇళ్ళు లేని పేద కుటుంబాల కు ఒక వరం గా ఉంది అంటూ శ్రీ సుధీర్ అభివర్ణించారు. తాను ఒక బాడుగ ఇంట్లో నివసిస్తున్నట్లు శ్రీ సుధీర్ వెల్లడిస్తూ, ఆరు- ఏడు సార్లు ఇల్లు మారినట్లు తెలిపారు. తరచు గా ఇల్లు మారవలసివచ్చి అందుకు తాను ఎంత బాధపడ్డదీ కూడా ఆయన తన లేఖ లో వెల్లడి చేశారు.

 

***

 


(Release ID: 1815973) Visitor Counter : 179