ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్ లోని అదాలజ్ లోశ్రీ అన్నపూర్ణధామ్ ట్రస్ట్ వసతి గృహం మరియు విద్య భవన సముదాయాన్నిఏప్రిల్ 12న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి


జన్సహాయక్ ట్రస్ట్ కు చెందిన హీరామణి ఆరోగ్యధామ్ కు భూమిపూజ ను కూడా చేయనున్న ప్రధానమంత్రి

Posted On: 11 APR 2022 6:13PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గుజరాత్ లోని అదాలజ్ లో శ్రీ అన్నపూర్ణధామ్ ట్రస్ట్ ఆధ్వర్యం లోని వసతి గృహం మరియు విద్య భవన సముదాయాన్ని ఏప్రిల్ 12న ఉదయం 11 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. అదే కార్యక్రమం లో ప్ర‌ధాన మంత్రి జన్ సహాయక్ ట్రస్ట్ కు చెందిన హీరామణి ఆరోగ్యధామ్ కు భూమిపూజ ను కూడా చేయనున్నారు.

 

వసతి గృహం మరియు విద్య భవన సముదాయం లో 600 మంది విద్యార్థుల కు బస మరియు భోజనం వగైరా సదుపాయాలను కల్పించడం కోసం 150 గదులు ఉన్నాయి. ఇతర సదుపాయాల లో జిపిఎస్ సి, యుపిఎస్ సి పరీక్షల కోసం శిక్షణ కేంద్రం, ఇ-లైబ్రరీ, సమావేశాల నిర్వహణ కు ఉద్దేశించిన ఒక గది, క్రీడల కు ఉద్దేశించిన ఒక గది, టీవీ గది తో పాటు ప్రాథమిక ఆరోగ్య సదుపాయాలు వంటివి ఉన్నాయి.

 

హీరామణి ఆరోగ్య ధామ్ ను జన్ సహాయక్ ట్రస్టు అభివృద్ధిపరచనుంది. దీనిలో అత్యంత ఆధునికమైనటువంటి వైద్య సదుపాయాలు ఉంటాయి. వాటి లో ఒకే సారి 14 మంది కి రక్తశుద్ధి చికిత్స చేసే సదుపాయం, 24 గంటల పాటు రక్తాన్ని అందుబాటులో ఉంచేటటువంటి సౌకర్యం తో బ్లడ్ బ్యాంక్, 24 గంటలూ అందుబాటు లో ఉండేటటువంటి మెడికల్ఆ స్టోర్, ఆధునిక పరీక్ష ప్రధానమైనటువంటి ప్రయోగశాల మరియు ఆరోగ్య పరీక్షల కు సంబంధించినటువంటి అగ్ర శ్రేణి పరికరాలు కూడా ఉంటాయి. ఇది ఆయుర్వేదం, హోమియోపథి, ఏక్యూపంక్చర్, యోగ చికిత్సల వంటి వాటి కి సంబంధించిన ఆధునిక సౌకర్యాల తో కూడినటువంటి డే- కేర్ సెంటర్ గా సేవల ను అందించనుంది. అందులో ప్రథమ చికిత్స సంబంధి శిక్షణ, టెక్నిశియన్ల లకు ఉద్దేశించిన శిక్షణ, ఇంకా వైద్యుల కు సంబంధించిన శిక్షణ సదుపాయాలు కూడా లభించనున్నాయి.

 

***


(Release ID: 1815970) Visitor Counter : 166