నీతి ఆయోగ్
azadi ka amrit mahotsav

విద్యుత్, వాతావరణంపై రాష్ట్రాలకు నీతీ ఆయోగ్ సూచిక! ఎస్.ఇ.సి.ఐ. తొలి రౌండ్ 11న విడుదల

నాడు పోస్టు చేయడమైనది: 08 APR 2022 12:50PM by PIB Hyderabad

  రాష్ట్రాల ఇంధన (విద్యుత్), వాతావరణ మార్పులకు సంబంధించిన తొలిదశ సూచిక (ఎస్.ఇ.సి.ఐ. రౌండ్-1)ను నీతీ ఆయోగ్ 2022, ఏప్రిల్ 11న విడుదల చేస్తుంది. నీతీ ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ కుమార్ ఈ సూచికను విడుదల చేస్తారు. నీతీ ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. సారస్వత్, ముఖ్య కార్యనిర్వహణాధికారి (సి.ఇ.ఒ.) అమితాబ్ కాంత్, ఇంధన శాఖకు సంబంధించిన వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, భాగస్వామ్య వర్గాల ప్రతినిధుల సమక్షంలో ఈ సూచికను విడుదల అవుతుంది.

  దేశంలోని వివిధ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆరు ప్రమాణాలు, కొలబద్దలు ప్రాతిపదికగా ర్యాంకులను ప్రకటించేందుకు ఇంధన, వాతావరణ మార్పుల తొలిదశ సూచికకు రూపలక్పన చేశారు.: (1) విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరు (2) విద్యుత్ అనుసంధానం, అందుబాటు యోగ్యం, విశ్వసనీయత (3) స్వచ్ఛ ఇంధనం లక్ష్యంగా చర్యలు (4) ఇంధన సామర్థ్యం (5) పర్యావరణ సుస్థిరత (6) కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలు, కార్యక్రమాలు.. ఈ ఆరు ప్రమాణాలను ర్యాంకులకు ప్రాతిపదికగా తీసుకుంటారు. ఈ ప్రమాణాలన్నీ మొత్తం 27 సూచికలతో కూడి ఉంటాయి. ఎస్.ఇ.సి.ఐ. రౌండ్-1 ఫలితాల్లో సాధించిన స్కోర్లు, పాయింట్ల ఆధారంగా, రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను 3 సమూహాలు (గ్రూపులు)గా వర్గీకరించారు. 

: ‘అగ్రగాములు’, ‘లక్ష్య సాధించినవి’,  ‘ఆశావహం అంటూ 3 గ్రూపులుగా ఈ వర్గీకరణ జరిపారు.

   ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ పనితీరును తోటి రాష్ట్రాలతో పోల్చుకునేందుకు ప్రమాణ బద్ధంగా ఈ సూచికను వినియోగించుకోవచ్చు. తమకు ఎదురయ్యే సవాళ్లను విశ్లేషించుకుని, మరింత మెరుగైన యంత్రాగాలను రూపొందించుకునేందుకు, తమ విద్యుత్ వనరులను సమర్థంగా నిర్వహించుకునేందుకు కూడా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ సూచికను వినియోగించుకోవచ్చు.

 

****


(రిలీజ్ ఐడి: 1814939) సందర్శకుల సూచీ సంఖ్య : : 252
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Punjabi , Tamil , Malayalam