ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం కిందసేవలు అందించే వారికి చెల్లింపులు ధరల నిర్ణయం పై విడుదల చేసిన పత్రంపై అభిప్రాయాలు కోరిన జాతీయ ఆరోగ్య సంస్థ (ఎన్ హెచ్ ఏ)

Posted On: 01 APR 2022 11:24AM by PIB Hyderabad

 ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం(.ఏ బి పీఎం జే) కింద సేవలు అందిస్తున్న వారికి చెల్లింపులు మరియు ధరలను నిర్ణయిస్తూ జాతీయ ఆరోగ్య సంస్థ ఒక సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. ఈ పత్రంలో ప్రపంచవ్యాప్తంగా బీమా సంస్థలు వివిధ సేవలకు గాను చేస్తున్న చెల్లింపు విధానాన్ని సమగ్రంగా వివరించడం జరిగింది. దీనితోపాటు సేవలు అందించిన సంస్థలకు చేస్తున్న చెల్లింపుల విధానాలు కూడా వివరించడం జరిగింది. ఈ పత్రంలో పీఎంజే ఖర్చు వివరాలు లోతుగా చర్చించి పొందుపరచబడ్డాయి. వివిధ ఆసుపత్రుల్లో లభిస్తున్న సౌకర్యాల ఆధారంగా ఆరోగ్య సేవలను అందించేందుకు అయ్యే ఖర్చు వివరాలు దీనిలో పొందుపరిచారు. కేసుల వారీగా అందించిన సేవలకు గాను ఆసుపత్రులకు  తిరిగి చెల్లించే మొత్తం వివరాలు  కూడా పత్రంలో  జరిగింది.  అయిదు రాష్ట్రాలలో పైలట్ ప్రాజెక్టుగా జాతీయ ఆరోగ్య సంస్థ అమలు చేయతలపెట్టిన  వ్యాధి నిర్ధారణ-సంబంధిత సమూహం (డిఆర్జీ ) ప్రాజెక్టు వివరాలను కూడా పత్రంలో వివరించడం జరిగింది. ఈ ప్రాజెక్టు కింద  రోగి లక్షణాల ప్రకారం వ్యాధి నిర్ధారణ  మరియు రోగి వ్యాధి  స్థాయి ఆధారంగా చికిత్సకు అయ్యే ఖర్చు వివరాలను కూడా పత్రంలో  వివరించడం జరిగింది.  ఆరోగ్య ప్రయోజనాల ప్యాకేజీ మరియు దాని ధరలలో కొత్త అంశాలను చేర్చే అంశంలో వినియోగించ తలపెట్టిన హెల్త్ టెక్నాలజీ అసెస్‌మెంట్ (హెచ్ టీఏ వ్యవస్థ స్వరూపాన్ని కూడా పత్రం  వివరిస్తుంది.  ద్రవ్యోల్బణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని  వార్షిక ప్రాతిపదికన ధరలను నిరంతరం సవరించేందుకు అమలు చేసే విధానాన్ని అధ్యయన పత్రం వివరిస్తుంది.

సేవలు అందించిన వారికి చేసే చెల్లింపులు, ధరలు, ధరలు నిర్ణయించేందుకు అనుసరించాల్సిన విధానం, డీ ఆర్ జీ ఆధారిత విధానంలో ఖర్చులను నిర్ధారించి తిరిగి చెల్లింపులు చేయడం, ప్రతిపాదిత  హెచ్ టీఏ  సమాచార వ్యవస్థలో ధరల  విలువకు సంబంధించిన విభిన్న సమస్యలపై జాతీయ ఆరోగ్య సంస్థ ఆరోగ్య రంగం తో సంబంధం ఉన్న వారి నుంచి అభిప్రాయాలను ఆహ్వానించింది. 

అధ్యయన పత్రంపై మాట్లాడిన జాతీయ ఆరోగ్య సంస్థ సీఈఓ డాక్టర్ ఆర్ఎస్ శర్మ  ఆరోగ్య పరిరక్షణ ప్రయోజనాల  కింద అందిస్తున్న  వివిధ విధానాలకు ధరలను నిర్ణయించే ప్రామాణిక పద్ధతిని రూపొందిస్తున్నామని అన్నారు. పీఎంజేకోసం భారతీయ ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థలో సమర్థతఆమోదయోగ్యతనాణ్యత మరియు స్థిరత్వాన్ని నిర్ధారించే ప్రామాణిక మరియు పారదర్శక ధరల విధానాన్ని అభివృద్ధి చేయడంలో అధ్యయనం  సహాయపడుతుందని అన్నారు. అధ్యయన పత్రాన్ని పరిశీలించి ఆరోగ్య రంగంతో సంబంధం ఉన్న వారందరూ తమ  విలువైన అభిప్రాయాన్ని పంపాలని ఆయన కోరారు. 

ధరల నిర్ణయం అధ్యయన పత్రంపై ఒక వెబినార్ నిర్వహించాలన్న ప్రతిపాదనను జాతీయ ఆరోగ్య సంస్థ పరిశీలిస్తోంది. దీని ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు అవకాశం కలుగుతుంది. పీఎంజే  వెబ్‌సైట్‌లో లింక్‌లు పొందుపరచబడతాయి. . అధ్యయన నివేదిక  పూర్తి పాఠం  పీఎంజే    వెబ్‌సైట్‌లో ప్రచురణల విభాగంలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది (హైపర్‌లింక్:  https://pmjay.gov. in/sites/default/files/2022- 03/AB%20PM-JAY%20Price% 20Consultation%20Paper_25 .03. 2022.pdf ). వ్యాఖ్యలు మరియు అభిప్రాయాలను  hpqa.pricing@nha.gov.in కు పంపవచ్చురాబోయే నెలల్లో సంబంధిత అంశాలపై తదుపరి సంప్రదింపు పత్రాలు విడుదల చేయబడతాయి.


(Release ID: 1812572) Visitor Counter : 201