సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
చారిత్రాత్మక ఎర్రకోటలో ఏడాది పొడవునా భారతదేశ వివిధ కోణాలను ప్రదర్శించే విధంగా రూపొందిన మాతృభూమి షో ప్రదర్శన
Posted On:
30 MAR 2022 10:40AM by PIB Hyderabad
పది రోజుల ఎర్రకోట ఉత్సవం – భారత భాగ్య విధాత లో భాగంగా ప్రదర్శిస్తున్న 'మాతృభూమి' సాంస్కృతిక కార్యక్రమం ప్రజల నుంచి అద్భుతమైన స్పందన, ఆదరణ లభిస్తున్నాయి. ఎర్రకోట ఉత్సవం ఐదో రోజు కార్యక్రమాలు నిన్నటితో పూర్తి అయ్యాయి. ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ ను దృష్టిలో ఉంచుకుని ' మాతృభూమి' ప్రదర్శన చారిత్రాత్మక ఎర్రకోటలో శాశ్వతంగా ఏడాది పొడవునా కొనసాగించాలని నిర్ణయించారు.
ప్రొజెక్షన్ మ్యాపింగ్ షో 'మాతృభూమి' కాంతి, ధ్వని మరియు సంగీతాన్ని ఉపయోగించి 'స్టార్-ఆఫ్-ది-ఆర్ట్ టెక్నాలజీతో అద్భుతమైన ప్రదర్శన గా రూపొందింది. భారతదేశ సుసంపన్నమైన మరియు వైవిధ్యమైన సంస్కృతి ప్రబింబించే విధంగా దీనిని రూపొందించారు. కలకాలం నిలిచే విధంగా దేశ సుదీర్ఘమైన, అద్భుతమైన చరిత్ర ను ప్రదర్శన గుర్తు చేస్తుంది. దేశ చరిత్రను తెలుసుకుని ప్రజలు గర్వపడేలా చేసి వారిలో భావోద్వేగాలను రేకెత్తించే విధంగా ప్రదర్శన రూపొందింది.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా జరుగుతున్న భారత్ భాగ్య విధాత కార్యక్రమం ఇప్పటికే దేశంలోనే గొప్ప సాంస్కృతిక సమ్మేళనంగా గుర్తింపు పొందింది. ఎర్రకోటలో ప్రదర్శింపబడే ఇంటరాక్టివ్ సీక్వెన్స్‌ల ద్వారా మాన్యుమెంట్ మిత్ర, దాల్మియా భారత్ లిమిటెడ్ సహకారంతో సాంస్కృతిక పర్యాటక మంత్రిత్వ శాఖ భారతదేశం ఘన చరిత్ర , వారసత్వాన్ని భావి తరాలకు పరిచయం చేయాలన్న లక్ష్యంతో 'మాతృభూమి' ప్రదర్శనను నిర్వహిస్తోంది.
ఇప్పటికే దేశం వివిధ ప్రాంతాలకు చెందిన అనేకమంది ప్రముఖులు ఈ ఉత్సవాన్ని సందర్శించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి. స్మృతి ఇరానీ, మరియు పోలీస్ కమిషనర్ శ్రీ రాకేష్ ఆస్థానా ఎర్రకోటలో ప్రొజెక్షన్ మ్యాపింగ్ షో ను ప్రారంభించారు.
30-నిమిషాల పాటు ప్రదర్శన ఉంటుంది. దీనిని సుందరంగా అందంగా అందరికీ అర్థమయ్యే విధంగా రూపొందించారు. ఇది దృశ్య శ్రవణ రూపంలో కనులకు వీనులకు విందు అందిస్తుంది. రెడ్ ఫోర్ట్ ఫెస్టివల్‌లో ప్రొజెక్షన్ - భారత్ భాగ్య విధాత ఏప్రిల్ 3 వ తేదీ వరకు జరుగుతుంది. అందరికీ ఉచిత ప్రవేశం కల్పించారు.
ప్రదర్శన వేళలు క్రింది విధంగా ఉన్నాయి:
మార్చి 29 - మార్చి 31 - రాత్రి 7:30 నుంచి - 8:00 వరకు
ఏప్రిల్ 1 ఏప్రిల్ 2 -రాత్రి 8:30 నుంచి - 9:00వరకు
ఏప్రిల్ 3 -రాత్రి 7:30 నుంచి - 8:00వరకు
ఎర్రకోట ఉత్సవంలో ప్రధాన ఆకర్షణగా నిలిచి అద్భుతమైన స్పందన పొందిన 'మాతృభూమి' ఇప్పుడు ఎర్రకోటలో శాశ్వత ప్రదర్శనగా మార్చబడింది, 10 రోజుల ఎర్రకోట ఉత్సవాలు ఏప్రిల్ 3న ముగిసిన తర్వాత కూడా సంవత్సరం పొడవునా 'మాతృభూమి' ప్రదర్శన కొనసాగుతుంది.
***
(Release ID: 1811331)
Visitor Counter : 189