రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

నేషనల్ వార్ మెమోరియల్‌ని సందర్శించిన 2022 పద్మ అవార్డు గ్రహీతల రెండవ బృందం


- భారతదేశ అమర వీరులకు నివాళులు అర్పించిన అవార్డు గ్ర‌హీత‌లు

- ప్రజలు ముఖ్యంగా యువత ఎన్‌డ‌బ్ల్యుఎంని సందర్శించి, సాయుధ దళాల సాహసోపేత చర్యల గురించి తెలుసుకోవాలని కోరిన అవార్డు గ్ర‌హీత‌లు

Posted On: 29 MAR 2022 1:43PM by PIB Hyderabad

 

పద్మ అవార్డులు-2022  గ్రహీతల రెండవ బ్యాచ్, మార్చి 29, 2022న న్యూఢిల్లీలో గ‌ల‌ .జాతీయ‌ వార్ మెమోరియల్ (ఎన్‌డ‌బ్ల్యుఎం)ని సందర్శించారు. రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ ఈ సంవత్సరానికి రెండు పద్మవిభూషణ్, తొమ్మిది పద్మభూషణ్ మరియు 54 పద్మశ్రీ అవార్డులను ప్రదానం చేశారు. 2022 మార్చి 28, 2022న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన సివిల్ ఇన్వెస్టిచర్ వేడుక-IIలో అవార్డుల ప్ర‌దానం జ‌రిగింది.
ఎన్‌డ‌బ్ల్యుఎంను సందర్శించిన వారిలో.. పద్మవిభూషణ్ గ్రహీత డాక్టర్ ప్రభా ఆత్రే ఎన్‌డ‌బ్ల్యుఎం వద్ద, దేశం కోసం అమ‌రులైన‌ వీరులకు పుష్పగుచ్ఛం అందించి నివాళులర్పించారు. నివాళుల‌ర్పించిన వారిలో పద్మశ్రీ అవార్డు విజేతలు పోలాండ్‌కు చెందిన ప్రొఫెసర్ (డా) మరియా క్రిజ్టోఫ్ బైర్స్కీ, థాయ్‌లాండ్‌కు చెందిన డాక్టర్ చిర్పత్ ప్రపాండ్విద్య, శ్రీమతి బసంతీ దేవి, శ్రీ ధనేశ్వర్ ఎంగ్టీ, గురు తుల్కు రింపోచే, డాక్టర్ (ప్రొఫె) హర్మోహిందర్ సింగ్ బేడీ, సద్గురు బ్రహ్మేశానంద్ ఆచార్య ఇమాకత్ ఇమాకత్ ఇమాత్ అబ్దుల్ నఖాదర్ స్వామీజీలు కూడా ఉన్నారు.  అవార్డు గ్రహీతలు ఎన్‌డ‌బ్ల్యుఎం చుట్టూ తిరిగినప్పుడు, సేవా సిబ్బంది ద్వారా సాయుధ బలగాల సాహసోపేతమైన పనుల గురించి వారికి తెలియజేయబడింది. ఈ స్మారక చిహ్నం దేశభక్తి, విధి పట్ల భక్తి, సైనికుల ధైర్యం మరియు త్యాగం యొక్క విలువలను ప్రసరింపజేస్తుందని, ఎన్‌డ‌బ్ల్యుఎం సందర్శనను నిర్వహించే ప్రభుత్వ చొరవను అవార్డు గ్రహీతలు ప్రశంసించారు. ప్రజలు, ముఖ్యంగా యువత స్మారక చిహ్నాన్ని సందర్శించి సైనికుల వీరోచిత గాథలను తెలుసుకోవాలని వారు కోరారు. “ఇక్కడికి వచ్చి  సైనికులకు నివాళులర్పించడం మాకు గొప్ప గౌరవం... వారు మనల్ని రక్షిస్తూ, మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నందున మేము నిజంగా వారి గురించి గర్విస్తున్నాము, ”అని ప్రఖ్యాత భారతీయ శాస్త్రీయ గాయకుడు పద్మవిభూషణ్ విజేత డాక్టర్ ప్రభా ఆత్రే అన్నారు. పద్మభూషణ్ విజేతలు శ్రీ దేవేంద్ర ఝఝరియా & శ్రీ సచ్చిదానంద స్వామి మరియు పద్మశ్రీ విజేతలు సర్దార్ జగ్జిత్ సింగ్ దార్ది, శ్రీ కాజీ సింగ్ & పండిత్ రామ్ దయాళ్ శర్మతో సహా 2022 పద్మ అవార్డు గ్రహీతల మొదటి బ్యాచ్ మార్చి 22, 2022న ఐకానిక్ స్మారక చిహ్నాన్ని సందర్శించారు.

                                                                 ***



(Release ID: 1811321) Visitor Counter : 101