వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

2022 మే 1 నుంచి భారత్-యూఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలు... శ్రీ పీయూష్ గోయల్


ఒప్పందంతో రెండు దేశాల మధ్య వర్తక, వాణిజ్య సంబంధాల్లో సమూల మార్పులు ... శ్రీ గోయల్

నూతన అంశాలకు మరిన్ని అవకాశాల ద్వారా రెండు దేశాల మధ్య మరింత పటిష్ట సంబంధాలు

యూఏఈ ద్వారా ప్రపంచ మార్కెట్ చేరుకోవడానికి ఎదురు చూస్తున్నాం .. శ్రీ గోయల్

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అనుసరిస్తున్న 'సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్ కా విశ్వాస్ ఔర్ సబ్కా ప్రయాస్' విధానం ఆధారంగా యూఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న భారతదేశం .. శ్రీ గోయల్

Posted On: 29 MAR 2022 12:49PM by PIB Hyderabad

2022 మే 1 నుంచి భారత్-యూఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలులోకి వస్తుందని కేంద్ర వాణిజ్యం పరిశ్రమలువినియోగదారుల వ్యవహారాలు మరియు ఆహారం  ప్రజా పంపిణీ మరియు జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ప్రకటించారు. సోమవారం దుబాయ్ లో భారత్-యూఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా   వ్యాపారం నుంచి వ్యాపారం (B2B)  సమావేశంలో శ్రీ గోయల్ పాల్గొని ప్రసంగించారు. ఈ ఒప్పందంతో రెండు దేశాల మధ్య వర్తక వాణిజ్య సంబంధాలు మరింత పటిష్టమవుతాయని ఆయన అన్నారు. ఈ ఒప్పందాన్ని చరిత్రాత్మక ఒప్పందంగా వర్ణించిన శ్రీ గోయల్ దీని వల్ల మరిన్ని నూతన అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. 

ఆఫ్రికా తో పాటు ఇతర జీసీసీ దేశాలుమధ్య ప్రాచ్య దేశాలుసీఐఎస్  దేశాలు మరియు కొన్ని యూరోపియన్ దేశాలకు చేరుకోవడానికి యూఏఈ ని  భారతదేశం  గేట్‌వేగా చూస్తోందని మంత్రి అన్నారు. 

ఈ ఒప్పందం వల్ల ప్రపంచ మార్కెట్ లోకి చేరుకోవడానికి భారతదేశానికి అవకాశం కలుగుతుందని శ్రీ గోయల్ వివరించారు. ఈ ఒప్పందం యూఏఈ కి చెందిన 10 మిలియన్ ప్రజలకు మాత్రమే కాకుండా భారతదేశానికి చెందిన ప్రజలకు ప్రయోజనం కలిగిస్తుందని పేర్కొన్నారు. ఇది రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం రెండు దేశాలకు ప్రయోజనం కలిగిస్తుందని అన్నారు. 

భారతదేశం-యుఎఇ సిఇపిఎ వాణిజ్య సేవల రంగాలలో అమలవుతుందని శ్రీ గోయల్ ప్రకటించారు. 88 రోజుల రికార్డు స్వల్పకాల వ్యవధిలో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం తో రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగు పడతాయని అన్నారు. ' ఈ ఒప్పందం వాణిజ్య రంగానికి మాత్రమే పరిమితం కాదు. సేవల రంగంలో కూడా అమలవుతుంది. దీనివల్ల అనేక రాజకీయ, ఆర్థిక, భౌగోళిక ప్రయోజనాలు కలుగుతాయి. యూఏఈ లో పెద్ద సంఖ్యలో భారతీయులు నివసిస్తున్నారు. ఈ విధంగా చూస్తే రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం మానవతా దృక్పథం కూడా కలిగి వుంది.' అని  శ్రీ గోయల్ చెప్పారు.

 భారతదేశం-యుఎఇ మధ్య కుదిరిన భాగస్వామ్య ఒప్పందాన్ని  "21వ శతాబ్దపు వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంగా శ్రీ గోయల్ వర్ణించారు. ఈ ఒప్పందం  రెండు దేశాల మధ్య సంబంధాలను పటిష్టం చేసి నూతన  దిశను అందుబాటులోకి తెచ్చి , ఒక నమూనా మార్పు తెస్తుందని ఆయన అన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అనుసరిస్తున్న  'సబ్కా సాత్సబ్కా వికాస్సబ్ కా విశ్వాస్ ఔర్ సబ్కా ప్రయాస్విధానం ఆధారంగా యూఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదిరిందని శ్రీ గోయల్ అన్నారు. 2030 నాటికి ట్రిలియన్ అమెరికా డాల్లర్ల విలువ చేసే ఎగుమతులు సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న భారతదేశం యూఏఈ మార్కెట్ కు ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి అన్నారు. 

భారతదేశంలో మౌలిక సదుపాయాలుఉత్పత్తిరవాణా రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు యూఏఈ ఆసక్తి కనబరిచిందని శ్రీ గోయల్ తెలిపారు. యూఏఈ కి చెందిన అనేక మంది పారిశ్రామికవేత్తలు ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో పర్యటించిందని అన్నారు. సమావేశంలో యూఏఈ  విదేశీ వాణిజ్య శాఖ సహాయ మంత్రి థానీ అల్ జియోడీ కూడా పాల్గొన్నారు. 

 

***



(Release ID: 1811317) Visitor Counter : 154