మంత్రిమండలి

ప్రధాన మంత్రి గరీబ్ క ళ్యాణ్ అన్న యోజ న (పిఎమ్-జికెఎవై) ను మరో 6 నెలల పాటు (ఏప్రిల్-సెప్టెంబ ర్, 2022) పొడిగించడానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం


పేదలు , నిస్సహాయులకు ప్రయోజనం చేకూర్చే చర్య

పీఎంజీకేఏవై కింద 1,000 ఎల్ఎంటీలకు పైగా ఉచిత ఆహార ధాన్యాలు: దాదాపు రూ.3.4 లక్షల కోట్ల ఆర్థిక వ్యయం:

Posted On: 26 MAR 2022 7:27PM by PIB Hyderabad

పేద, నిస్సహాయ వర్గాలకు ఊరట నిచ్చే విధంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పిఎమ్-జికెఎవై) పథకాన్ని మరో ఆరు నెలల పాటు అంటే సెప్టెంబర్ 2022 (ఫేజ్ 6) వరకు పొడిగించింది.

 

పీఎం-జీకేఏవై పథకం ఐదో దశ 2022 మార్చిలో ముగియనుంది. 2020 ఏప్రిల్ నుంచి పీఎం-జీకేఏవై ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రత కార్యక్రమంగా అమలవుతున్న సంగతి తెలిసిందే.

 

ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు రూ.2.60

లక్షల కోట్లు ఖర్చు చేయగా, 2022 సెప్టెంబర్

వరకు వచ్చే ఆరు నెలల్లో మరో రూ.80,000 కోట్లు ఖర్చు చేస్తారు. ప్రధాన మంత్రి- జికెఎవై కింద మొత్తం వ్యయాన్ని దాదాపు రూ.3.40

లక్షల కోట్లకు పెంచుతారు.

 

ఇది భారతదేశం అంతటా దాదాపు 80 కోట్ల మంది లబ్ధిదారులకు వర్తిస్తుంది.  మునుపటిలానే భారత ప్రభుత్వం ఇందుకు పూర్తిగా నిధులు సమకూరుస్తుంది.

 

కోవిడ్-19 మహమ్మారి గణనీయంగా తగ్గినప్పటికీ, ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటున్నప్పటికీ, ఈ పిఎం-జికెఎవై పొడిగింపు ఈ రికవరీ సమయంలో ఏ పేద కుటుంబం కూడా పస్తు పడుకోకుండా చూస్తుంది.

 

పొడిగించిన పిఎమ్-జికెఎవై కింద ప్రతి ప్రతి లబ్ధిదారుడు ఎన్ఎఫ్ఎస్ఎ కింద తన సాధారణ ఆహార ధాన్యాల కోటాకు అదనంగా నెలకు 5 కిలోల ఉచిత రేషన్ పొందుతాడు. అంటే ప్రతి పేద కుటుంబానికి సాధారణ రేషన్ కంటే దాదాపు రెట్టింపు రేషన్ లభిస్తుంది.

 

పీఎం-జీకేఏవై కింద ఐదో దశ వరకు 759 ఎల్ఎంటీల ఉచిత ఆహారధాన్యాలను ప్రభుత్వం కేటాయించడం గమనార్హం. ఈ పొడిగింపు (ఫేజ్ 6) కింద మరో 244 ఎల్ఎమ్ టి ఉచిత ఆహార ధాన్యాలతో, పిఎం-జికెఎవై కింద ఉచిత ఆహార ధాన్యాల మొత్తం కేటాయింపు ఇప్పుడు 1,003 ఎల్ ఎమ్ టి ఆహార ధాన్యాలకు చేరుకుంది.

 

దేశవ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల రేషన్ దుకాణాల నుంచి వన్ నేషన్ వన్ రేషన్ కార్డు (ఓఎన్ఓఆర్సీ) పథకం కింద ఎవరైనా వలస కార్మికులు లేదా లబ్ధిదారులు పోర్టబిలిటీ ద్వారా ఉచిత రేషన్ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇప్పటివరకు, 61 కోట్లకు పైగా పోర్టబిలిటీ లావాదేవీలు లబ్ధిదారులకు వారి ఇళ్లకు దూరంగా ప్రయోజనం చేకూర్చాయి.

 

ఈ శతాబ్దపు  అధ్వాన్న మహమ్మారి సమయం లోనూ ప్రభుత్వం రైతులకు అత్యధిక చెల్లింపుతో అత్యధిక సేకరణ కారణంగా ఇది సాధ్యమైంది. వ్యవసాయ క్షేత్రాలలో ఈ రికార్డు ఉత్పత్తికి గాను భారతీయ రైతుల  -'అన్నదాత'ను అభినందించవలసిన అవసరం ఉంది.

 

***



(Release ID: 1810505) Visitor Counter : 264