సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
సిజిహెచ్ఎస్ లేదా ఫిక్స్‌డ్ మెడికల్ అలవెన్స్ కింద ఓపీడీ సదుపాయాన్ని పొందడం కోసం పెన్షనర్లు/ఫ్యామిలీ పెన్షనర్లు ఆప్షన్‌ను మార్చుకునే విధానాన్ని మరియు వ్యవధిని నిర్దేశిస్తూ సూచనలను జారీ చేసిన పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ
Posted On:
24 MAR 2022 11:46AM by PIB Hyderabad
సిజిహెచ్ఎస్ పరిధిలోకి రాని ప్రాంతంలో నివసిస్తున్న పెన్షనర్లు/ఫ్యామిలీ పెన్షనర్లు ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ఫిక్స్‌డ్ మెడికల్ అలవెన్స్ (ఎఫ్ఎమ్ఏ) సిజిహెచ్ఎస్ కింద ఓపీడీ సదుపాయానికి బదులుగా నెలకు 1000/-. పెన్షనర్లు/కుటుంబ పింఛనుదారులు పొందుతున్నారు. సిజిహెచ్ఎస్ కింద ఎఫ్ఎమ్ఏ నుంచి ఓపీడీ సదుపాయాన్ని మార్చుకోవచ్చు. జీవితకాలంలో ఒకసారి వారు ఎఫ్ఎమ్ఏ నుంచి ఓపీడీ సదుపాయాన్ని ప్రస్తుత నిబంధనల ప్రకారం మార్చుకోవచ్చు. సిజిహెచ్ఎస్ కింద ఫిక్స్‌డ్ మెడికల్ భత్యం లేదా ఓపీడీ సదుపాయాన్ని పొందడం కోసం పెన్షనర్లు/కుటుంబ పెన్షనర్లు ఆప్షన్‌ను మార్చుకునే విధానాన్ని సవరిస్తూ మరియు కాలవ్యవధిని నిర్దేశిస్తూ కేంద్ర పెన్షన్ పెన్షనర్ల సంక్షేమ శాఖ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ మంత్రిత్వ శాఖ సూచనలు జారీ చేసింది.
నూతనంగా విడుదల అయిన సూచనల ప్రకారం, సిజిహెచ్ఎస్ క్రింద ఓపీడీ సౌకర్యాన్ని పొందాలని భావిస్తే ఎఫ్ఎమ్ఏ పొందుతున్న ఒక పెన్షనర్/కుటుంబ పెన్షనర్ అతను/ఆమె ఎఫ్ఎమ్ఏ ను నిలిపివేయాలని కోరుతూ కోసం పెన్షన్ పంపిణీ చేస్తున్న సంబంధిత బ్యాంకు కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పెన్షన్ పంపిణీ చేస్తున్న బ్యాంకు ఎఫ్ఎమ్ఏ చెల్లింపును నిలిపివేసి మరియు దరఖాస్తును స్వీకరించిన తేదీ నుంచి మూడు పని రోజులలోపు దీనికి సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని జారీ చేస్తుంది. ఆ తర్వాత, పెన్షనర్ అంతకు ముందు చెల్లించకుండా ఉంటే అవసరమైన సిజిహెచ్ఎస్ కంట్రిబ్యూషన్‌లను చెల్లించిన తర్వాత సిజిహెచ్ఎస్ కార్డు జారీ కోసం సంబంధిత సిజిహెచ్ఎస్ అధికారులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు అందిన తేదీ నుంచి నాలుగు పని రోజులలోపు పెన్షనర్/ఫ్యామిలీ పెన్షనర్‌కు తాత్కాలిక సిజిహెచ్ఎస్ కార్డును సిజిహెచ్ఎస్ అధికారులు జారీ చేస్తారు. సాధారణ సిజిహెచ్ఎస్ కార్డు జారీ అయ్యే వరకు పెన్షనర్/ఫ్యామిలీ పెన్షనర్ అవసరమైన అన్ని చర్యలను పూర్తి చేసి కంట్రిబ్యూషన్‌లను డిపాజిట్ చేయడం జరుగుతుంది.
ఐపీడీ మరియు ఓపీడీ రెండింటికీ సిజిహెచ్ఎస్ /వైద్య సౌకర్యాన్ని పొందుతున్న ఒక పెన్షనర్/కుటుంబ పెన్షనర్ సిజిహెచ్ఎస్ పరిధిలోకి రాని ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు లేదా సిజిహెచ్ఎస్ ప్రాంతం నుంచి నాన్- సిజిహెచ్ఎస్ ప్రాంతానికి నివాసం మారినప్పుడు ఎఫ్ఎమ్ఏ ని పొందాలని భావిస్తే సిజిహెచ్ఎస్ కింద ఓపీడీ సౌకర్యాన్ని వదులుకునేందుకు సంబంధిత సిజిహెచ్ఎస్ అధికారులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. సిజిహెచ్ఎస్ అధికారులు సిజిహెచ్ఎస్ కార్డ్‌పై అవసరమైన ఎండార్స్‌మెంట్ చేసి పింఛనుదారు/కుటుంబ పెన్షనర్ ఓపీడీ సదుపాయాన్ని పొందడం లేదని దరఖాస్తు అందిన తేదీ నుంచి నాలుగు పని దినాలలో సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఆ తర్వాత, పెన్షనర్/ఫ్యామిలీ పెన్షనర్ ఎఫ్ఎమ్ఏ చెల్లింపు కోసం సవరించిన పెన్షన్ మొత్తం పొందేందుకు సరెండర్ సర్టిఫికెట్ కాపీతో పాటు కేంద్ర కార్యాలయానికి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. పెన్షనర్/కుటుంబ పింఛనుదారు దరఖాస్తును సమర్పించిన తేదీ నుంచి రెండు నెలల లోపు సవరించిన పెన్షన్ చెల్లింపు అథారిటీ జారీ చేయబడుతుంది. అటువంటి సందర్భాలలో సిజిహెచ్ఎస్ అధికారులు సరెండర్ సర్టిఫికెట్ జారీ అయిన తేదీ నుంచి ఎఫ్ఎమ్ఏ చెల్లింపులు చేయడం జరుగుతుంది.
***
(Release ID: 1809097)
Visitor Counter : 219