యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
భారత స్వాతంత్ర్య పోరాటంలో విప్లవాత్మక అమరవీరుల జ్ఞాపకార్థం "విప్లవకారులకు నివాళి" అనే అంశంపై 623 జిల్లాలలో షహీద్ దివస్‌ను నిర్వహించనున్న నెహ్రూ యువ కేంద్ర సంఘటన్
- ఎన్‌వైకేఎస్‌తో అనుబంధించబడిన యువ వాలంటీర్లు ఎనిమిది రాష్ట్రాలు మరియు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలోని 14 ప్రదేశాలలో నిర్వహించబడుతున్న ప్రత్యేక కార్యక్రమాలలో పాల్గొంటారు
Posted On:
22 MAR 2022 12:26PM by PIB Hyderabad
"'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్"లో భాగంగా నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (ఎన్‌వైకేఎస్) దేశవ్యాప్తంగా మొత్తం 623 జిల్లాలలో
షహీద్ దివాస్‌ను నిర్వహించనుంది. ఎన్‌వైకేఎస్‌లలో 23 మార్చి 2022న పెద్ద సంఖ్యలో యూత్ వాలంటీర్లు మరియు ఎన్‌వైకే అనుబంధ యూత్ క్లబ్‌ల సభ్యులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 1931 మార్చి 23న భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్ దేవ్‌లను ఉరితీసిన విషయం తెలిసిందే. మన దేశంలోని వీర యువ విప్లవకారులు మరియు గొప్ప పుత్రులు చేసిన త్యాగాలను గుర్తుచేసుకుంటూ భారతదేశం ప్రతి సంవత్సరం మార్చి 23న షహీద్ దివస్‌ను జరుపుకుంటుంది. ఈ సందర్భాన్ని అమరుల త్యాగాలను పురస్కరించుకుని ఈ ఏడాది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా, 'విప్లవకారులకు నివాళి' అనే అంశంపై
ఎన్‌వైకేఎస్ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే షహీద్ దివస్‌ను నిర్వహిస్తోంది. షహీద్ దివాస్ 2022 సందర్భంగా, నెహ్రూ యువ కేంద్ర సంగటన్ దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 623 జిల్లా ఎన్‌వైకేలలో విప్లవ స్వాతంత్ర్య సమరయోధులు అందించిన సేవలను స్మరించుకొంటూ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలలో దేశ స్వాతంత్ర్య సమరయోధుల జీవితం, రచనలు మరియు తత్వశాస్త్రాన్ని తెలియపరచడం ద్వారా నేటి యువతరంలో వారి పట్ల కృతజ్ఞత, దేశభక్తితో కూడి గర్వం, గౌరవం మరియు కర్తవ్య భావాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. వారి కథలు యువతకు దేశభక్తి మరియు జాతీయవాద స్ఫూర్తిని సృష్టించేందుకు స్ఫూర్తినిస్తాయి.జాతీయ నిర్మాణ కార్యకలాపాల్లో మరింతగా పాల్గొనేలా వారిని ప్రేరేపిస్తాయి. భారత స్వాతంత్ర్య పోరాటంలో విప్లవాత్మక అమరవీరుల జ్ఞాపకార్థం, జిల్లా ఎన్‌వైకేలచే నిర్వహించబడే ముఖ్య కార్యక్రమాలలో.. చిత్రపటాలకు పూలమాలలు వేయడం, దీపం వెలిగించడం, భగత్ సింగ్, రాజ్‌గురు & సుఖ్‌దేవ్‌ల జీవితంపై సెమినార్లు / ఉపన్యాసాలు, ప్రతిజ్ఞ తీసుకోవడం, స్పోర్ట్స్ మీట్, స్కిట్స్, స్పాట్ ఏర్పాటు చేయడం వంటి వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. క్విజ్, గూడీస్ పంపిణీ, ప్లాగ్ రన్, నాలెడ్జ్ పోటీలు మొదలైనవి కూడా ఏర్పాటు చేయనున్నారు.
అంతేకాకుండా, ఒకవైపు అమరవీరులకు నివాళులు అర్పించడంతోపాటు యువతలో జాతీయవాదం మరియు దేశభక్తి స్ఫూర్తిని పెంపొందిస్తుంది. విద్యా సంస్థలు, ఎన్ఎస్ఎస్, ఎన్‌సీసీ మరియు భారత్ స్కౌట్స్ మరియు గైడ్ వంటి ఇతర యువజన సంస్థలు కూడా ఇందులో పాల్గొననున్నాయి. ఎన్‌వైకేఎస్ వివిధ కార్యక్రమాలలో స్వాతంత్ర్య సమరయోధులు, విద్యావేత్తలు, కళాకారులు, దిగ్గజ వ్యక్తులు, రాష్ట్ర/ జిల్లాలలో పరిపాలన వ్యవస్థను కూడా కలిగి ఉంది. ఎన్‌వైకేతో అనుబంధించబడిన యూత్ వాలంటీర్లు భారతదేశ స్వాతంత్ర్య పోరాట చరిత్రతో అనుబంధించబడిన సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా ఎనిమిది రాష్ట్రాలు మరియు 02 కేంద్రపాలిత ప్రాంతాలలోని 14 ప్రదేశాలలో నిర్వహించబడుతున్న ప్రత్యేక కార్యక్రమాలలో పాల్గొంటారు.
*******
(Release ID: 1808421)
Visitor Counter : 410