భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం
ఆక్వామ్యాప్ వాటర్ మేనేజ్‌మెంట్, పాలసీ సెంటర్‌ను ప్రారంభించిన భారత ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ కె. విజయరాఘవన్ మరియు మద్రాస్ ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి
Posted On:
21 MAR 2022 11:41AM by PIB Hyderabad
భారత ప్రభుత్వ ప్రధాన సైంటిఫిక్ అడ్వైజర్, ఐఐటీ మద్రాస్‌లో కొత్త నీటి నిర్వహణ మరియు విధాన కేంద్రమైన ఆక్వామ్యాప్ ని ఈ నెల 19 ప్రారంభించారు. అలాగే https://aquamap.iitm.ac.in/ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి, ఆక్వామ్యాప్ ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ లిగీ ఫిలిప్, థీమ్ వర్క్ అనలిటిక్స్ సీఈఓ డాక్టర్ పి.బాలసుబ్రమణియన్ మరియు ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థుల ఇతిహాసా రీసెర్చ్ అండ్ డిజిటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణన్ నారాయణన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆక్వామ్యాప్ స్థాపించడానికి గల నేపధ్యంపై ప్రొ. విజయ్ రాఘవన్ మాట్లాడుతూ, “మన ప్రపంచం వాతావరణ మార్పుల పరిణామాలను మరియు జీవవైవిధ్యంపై ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అందువల్ల, మన గాలి, నీరు మరియు భూమిని పునరుద్ధరించడం మరియు స్థిరమైన అభివృద్ధి సాధించడం ముఖ్యం" అని అన్నారు. వ్యవసాయ రంగంలో నీటి వినియోగం అన్ని అవసరాలలో గరిష్టంగా ఉంది, అందువల్ల వ్యవసాయ నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టడం ఆక్వామ్యాప్ ప్రధాన లక్ష్యమని ప్రొ. కామకోటి అన్నారు.
ఆక్వామ్యాప్- సంక్లిష్టమైన, సవాలుగా ఉన్న నీటి సమస్యలకు పరిష్కారాలను అందిస్తుందని అన్నారు. దీని ద్వారా స్మార్ట్ నీటి నిర్వహణ పద్ధతులను రూపొందించడం మరియు అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టవచ్చు. ఆక్వామ్యాప్ ఒక జాతీయ నీటి కేంద్రం మరియు ఐఐటీ, మద్రాస్, ఐఐటీ ధార్వాడ్‌తో కలిసి ‘డేటా సైన్స్ ఫర్ వాటర్ సెక్యూరిటీ అండ్ అగ్రికల్చర్ సస్టనెన్స్’ అనే విస్తృత ఇతివృత్తంతో కలిసి పని చేస్తుంది.
క్షేత్ర స్థాయిలో (గ్రామాలు మరియు పట్టణాలలో) నీటి సాంకేతికతలు మరియు నిర్వహణ పద్ధతుల అమలు, నీరు/మురుగునీటి నిర్వహణలో పెద్ద సవాళ్లను గుర్తించడం, అత్యాధునిక హైడ్రో-ఇన్ఫర్మేటిక్స్ లాబొరేటరీని ఏర్పాటు చేయడం ఆక్వామ్యాప్ ముఖ్య కార్యకలాపాలు.
నీరు మరియు నేల నాణ్యత విశ్లేషణ: పర్యావరణ నిర్వహణ కోసం గ్రామానికి సంబంధించి డిజిటల్ అవసరాలను గుర్తిస్తారు. అలాగే శుభ్రమైన ఆరోగ్యకరమైన గ్రామీణ వ్యవస్థ, వ్యర్థాల నిర్వహణపై దృష్టి సారిస్తారు.
డాక్టర్ బాలసుబ్రమణియన్ మాట్లాడుతూ, “ఆక్వామ్యాప్ ద్వారా సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇచ్చే అవకాశాన్ని ఇచ్చినందుకు మద్రాస్ ఐఐటికి కృతజ్ఞతలు తెలిపారు.
ఆక్వామ్యాప్ వెబ్ సైట్: https://aquamap.iitm.ac.in/
https://dev-aquamap.pantheonsite.io/management/
***
(Release ID: 1807599)
Visitor Counter : 188