వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
జిఐ ట్యాగ్ చేసిన స్థానిక వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడంపై కేంద్రం దృష్టి
జిఐ-ట్యాగ్ చేసిన భారతదేశ ఉత్పత్తులకు బ్రిటన్, దక్షిణ కొరియా , బహ్రయిన్ లలో కొత్త మార్కెట్ల అన్వేషణ
మార్కెట్ యాక్సెస్ ని మెరుగుపరచడానికి కీలకమైన ఫ్లాట్ ఫారాలుగా వర్చువల్ కొనుగోలుదారు- అమ్మకందార్ల సమావేశాలు
Posted On:
17 MAR 2022 11:08AM by PIB Hyderabad
స్థానికంగా లభించే భౌగోళిక సూచికలు (జిఐ) ట్యాగ్ చేయబడిన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించే ప్రయత్నంలో, కేంద్రం కొత్త ఉత్పత్తులు , కొత్త ఎగుమతి ప్రాంతాలను గుర్తించడానికి ప్రయత్నిస్తోంది.
డార్జిలింగ్ టీ , బాస్మతి రైస్ లు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే మార్కెట్లను కలిగి ఉన్న భారతదేశం యొక్క రెండు ప్రముఖ జిఐ-ట్యాగ్ డ్ వ్యవసాయ ఉత్పత్తులు, కాగా, దేశం నలుమూలల్లో జిఐ-ట్యాగ్ చేయబడ్డ ప్రొడక్ట్ లు ఇంకా అనేకం ఉన్నాయి, అయితే ఇవి మరింత సంభావ్య కొనుగోలుదారులను చేరుకోవడానికి నమ్మకమైన కస్టమర్ లు అవసరం.
ప్రధాన మంత్రి ఇచ్చిన 'వోకల్ ఫర్ లోకల్', ' ఆత్మనిర్భర్ భారత్' పిలుపుకు అనుగుణంగా, కేంద్రం, అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్స్ పోర్ట్ డెవలప్ మెంట్ అథారిటీ (ఎపిఇడిఎ) ద్వారా, కాలా నమక్ రైస్, నాగ మిర్చా, అస్సాం కాజీ నెము, బెంగళూరు రోజ్ ఆనియన్, నాగ్ పూర్ ఆరెంజ్, జిఐ రకాల మామిడి పండ్లు , జిఐ ట్యాగ్ చేయబడిన షాహి లిచ్చి, భాలియా గోధుమ, మదురై మల్లి, బర్ధమాన్ మిహిదానా , సీతాభోగ్, దహను ఘోల్వాడ్ సపోటా, జల్గావ్ అరటి, వఝకుళం పైనాపిల్, మరాయూర్ బెల్లం వంటి ఉత్పత్తుల కు ప్రపంచవ్యాప్తంగా కొత్త మార్కెట్లలోకి ట్రయల్ షిప్ మెంట్ లను సులభతరం చేసింది.
2021 లో జిఐ ఉత్పత్తుల రవాణాలో నాగా మిర్చా (కింగ్ మిర్చి) నాగాలాండ్ నుండి యుకెకు, మణిపూర్, అస్సాం నుండి బ్రిటన్ కు కు బ్లాక్ రైస్, బ్రిటన్, ఇటలీకి అస్సాం లెమన్, పశ్చిమ బెంగాల్ నుండి మూడు జిఐ మామిడి (ఫజ్లీ, ఖిర్సాపతి, లక్ష్మణ్ భోగ్) రకాలు ,బీహార్ నుండి బహ్రయిన్ , ఖతార్ కు మామిడి జిఐ(జర్దాలు) రకం ప్రముఖ మైనవి. పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ 24 పరగణ జిల్లాకు నుంచి రుచికరమైన స్వీట్ మీట్ జాయ్ నగర్ మోవా 30 కిలోలను కోల్ కతా విమానాశ్రయం ద్వారా బహ్రయిన్ కు ప్ సా పంపారు.
బీహార్ నుండి జిఐ-ట్యాగ్ ఉత్పత్తుల ఎగుమతులకు పెద్ద ప్రేరణగా, 524 కిలోల జిఐ ట్యాగ్ షాహి లిట్చిని మొదటి సారి మే 2021 లో బీహార్ లోని ముజఫర్ పూర్ జిల్లా నుండి లండన్ కు ఎగుమతి చేశారు. ఈ సంవత్సరం కూడా జిఐ ట్యాగ్ చేసిన బనగానపల్లె మామిడిని ఆంధ్రప్రదేశ్ నుండి దక్షిణ కొరియాకు ఎగుమతి చేశారు.
జిఐ-ట్యాగ్ చేసిన వ్యవసాయ ఉత్పత్తులకు వారణాసిలో ఎగుమతి కేంద్రాన్ని ముఖ్యంగా జిఐ-ట్యాగ్ చేసిన వ్యవసాయ ఉత్పత్తుల కోసం ఏర్పాటు చేయడానికి రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్ పిఒలు), ఆహార ఉత్పత్తిదారు కంపెనీలు (ఎఫ్ పిసిలు) ఎగుమతిదారులను అంతర్జాతీయ వ్యాపార వర్గాలతో అనుసంధానించడానికి, ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది.
జిఐ ట్యాగ్ చేసిన ఉత్పత్తుల ప్రోత్సాహానికి వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం డిపార్చర్ ప్రాంతంలో ఒక ప్రధాన ప్రదేశాన్ని గుర్తించారు. లొకేషన్ గుర్తించబడింది. జూన్ 2021లో, సీజన్ మొదటి షిప్ మెంట్ కింద 1048 కిలోల జిఐ ట్యాగ్ డ్ మాలిహబాది దస్సేరి మామిడిని లక్నో నుండి బ్రిటన్ కు , యుఎఇ కి ఎగుమతి చేశారు.
మణిపూర్ బ్లాక్ రైస్ (చక్-హావో), మణిపూర్ కాచాయ్ లెమన్, మిజో చిల్లీ, అరుణాచల్ ఆరెంజ్, మేఘాలయ ఖాసీ మాండరిన్, అస్సాం కాజీ నెము, కర్బీ అంగ్లాంగ్ జింజర్, జోహా రైస్, త్రిపుర క్వీన్ పైనాపిల్ వంటి ఈశాన్య ప్రాంత ప్రత్యేక జిఐ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఎపిఇడిఎ ద్వారా కేంద్రం కొనుగోలుదారు- అమ్మకం దారుల సమావేశాలను లను నిర్వహిస్తోంది, ఎన్ ఈఆర్ రాష్ట్రాలు, ఎఫ్ పిఒలు/ఎఫ్ పిసిలు, ఎగుమతిదారులు, అసోసియేషన్ లు, భారతీయ రైల్వేలు, ఎఐసిఎల్ ఎస్, నాఫెడ్, డిజిఎఫ్ టి, ఐఐఎఫ్ పిటి మొదలైన ప్రభుత్వ విభాగాల ప్రతినిధులతో అవగాహన, సామర్థ్య పెంపుదల వర్క్ షాప్ లను నిర్వహిస్తోంది.
ఇతర ప్రాంతాల నుండి జిఐ ఉత్పత్తులలో సాంగ్లీ ఎండుద్రాక్ష, నాగపూర్ ఆరెంజ్, దహను ఘోల్వాడ చికూ, మరాఠ్వాడా కేసర్ మామిడి, మహారాష్ట్ర నుండి జల్గావ్ అరటి, ఒడిశా నుండి కందమాల్ పసుపు ,కర్ణాటక నుండి బెంగళూరు రోజ్ ఆనియన్, అలహాబాద్ సుర్ఖా జామ, ఉత్తరప్రదేశ్ నుండి కలనమక్ రైస్, తమిళనాడు నుండి మదురై మల్లి మొదలైనవి ఉన్నాయి.
2020లో, అబుదాబిలోని ఎంబసీ ఆఫ్ ఇండియా , వాషింగ్టన్ డిసిలోని ఎంబసీ ఆఫ్ ఇండియా సహకారంతో, ఎపిఇడిఎ షెడ్యూల్ ఉత్పత్తులకు రెండు అతిపెద్ద ఎగుమతి మార్కెట్లయిన యుఎఇ , యుఎస్ఎతో వర్చువల్ బయర్- సెల్లర్ సమావేశాలు నిర్వహించారు.
జిఐ ఉత్పత్తులపై ఈ సమావేశం భారతీయ ఎగుమతిదారులు -యుఎస్ఎ ,యుఎఇ దిగుమతిదారుల మధ్య అనుసంధానానికి ఒక వేదికను అందించాయి. బాస్మతి రైస్, మామిడి, దానిమ్మ, బెంగళూరు రోజ్ ఆనియన్స్, సాంగ్లీగ్రేప్స్/రైసిన్, అరటి ,ఈశాన్య ప్రాంత ఉత్పత్తులైన అస్సాం జోహా రైస్, బ్లాక్ రైస్ (చక్-హావో), నాగా మిర్చా, ,వాటి ద్వారా వచ్చిన ప్రాసెస్ చేసిన జిఐ ఉత్పత్తుల ఎగుమతుల అవకాశాలు గురించి ఎగుమతిదారులకు సమాచారం అందించారు. ఎపిఇడిఎ షెడ్యూల్డ్ ఉత్పత్తుల ప్రమోషన్ కోసం ఏప్రిల్ 2020 నుంచి మార్చి 2021 వరకు యుఎఇ, ఇండోనేషియా, కువైట్ ఇరాన్, థాయ్ లాండ్, భూటాన్, బెల్జియం, స్విట్జర్లాండ్, జర్మనీ, సౌదీ అరేబియా, ఉజ్బెకిస్తాన్ మొదలైన దిగుమతి అవకాశాలు ఉన్న దేశాలతో వర్చువల్ బయర్- సెల్లర్ (విబిఎస్ఎమ్) లు నిర్వహించారు. జిఐ ట్యాగ్ డ్ ఉత్పత్తుల ఎగుమతిపై ప్రత్యేక దృష్టి సారించారు.
బహ్రయిన్ కు చెందిన అల్-జజీరా గ్రూప్, ఖతార్ లోని దోహాకు చెందిన ఫ్యామిలీ ఫుడ్ సెంటర్ వంటి విదేశీ రిటైలర్ల సహకారంతో దిగుమతి చేసుకునే దేశాల్లో అపెడా ఇన్-స్టోర్ ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహించింది. జిఐ ట్యాగ్ చేసిన నంజన్ గూడ్ బనానా నమూనాలను కర్ణాటక నుండి లులూ గ్రూప్, యుఎఇకి పంపడం కూడా ఎగుమతులను పెంచడానికి దోహదపడింది.
నేటి వరకు 417 రిజిస్టర్డ్ జిఐ ఉత్పత్తులు ఉండగా, వాటిలో సుమారు 150 వరకు జిఐ ట్యాగ్ డ్ ఉత్పత్తులు వ్యవసాయ , ఆహార సంబంధ మైనవి. వీటిలో 100 కు పైగా రిజిస్టర్డ్ జిఐ ఉత్పత్తులు ఎపిఇడిఎ షెడ్యూల్ ఉత్పత్తుల కేటగిరీ (తృణధాన్యాలు, తాజా పండ్లు ,కూరగాయలు, ప్రాసెస్ చేయబడ్డ ఉత్పత్తులు మొదలైనవి) కిందకు వస్తాయి.
*****
(Release ID: 1807015)
Visitor Counter : 242