ప్రధాన మంత్రి కార్యాలయం
భారతీయల ను యూక్రేన్ నుంచి ఖాళీ చేయించడం కోసం మొదలు పెట్టిన ఆపరేశన్ గంగ లోపాలుపంచుకొన్న వర్గాల తో వర్చువల్ పద్ధతి న భేటీ అయిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ
Posted On:
15 MAR 2022 8:09PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ఆపరేషన్ గంగ’ లో పాలుపంచుకొన్న స్టేక్ హోల్డర్స్ తో ఈ రోజు న మాట్లాడారు. యూక్రేన్ నుంచి దాదాపు గా 23,000 మంది భారతీయ పౌరుల ను, మరి అదే విధం గా 18 దేశాల కు చెందినటువంటి 147 మంది విదేశీయుల ను ఆపరేశన్ గంగ ద్వారా సురక్షితం గా ఖాళీ చేయించడమైంది.
సంభాషణ సాగిన క్రమం లో, యూక్రేన్, పోలండ్, స్లొవాకియా, రొమానియా, ఇంకా హంగరీ లలో భారతీయ సముదాయం మరియు ప్రైవేటు రంగం యొక్క ప్రతినిధులు ఆపరేశన్ గంగ లో పాలుపంచుకొన్న తాలు తమ అనుభవాల ను గురించి, తమకు ఎదురైనటువంటి సవాళ్ళ ను గురించి వెల్లడించారు. ఈ తరహా ఒక జటిలమైనటువంటి మానవీయ ఆపరేశన్ లో వారి వంతు తోడ్పాటు ను అందించినందుకు సంతోషం తో పాటు ఒక గౌరవపూర్వకమైన భావన ను కూడా వారు వ్యక్తపరచారు.
ఈ విన్యాసాన్ని ఫలప్రదం కావడం లో అవిశ్రాంతం గా పాటుపడినందుకు భారతదేశ సముదాయం నేతల ను, స్వయంసేవ సమూహాల ను, కంపెనీల ను, వ్యక్తుల ను మరియు ప్రభుత్వ అధికారుల ను ప్రధాన మంత్రి స్నేహపూర్ణం గా ప్రశంసించారు. ఆపరేశన్ గంగ లో పాలుపంచుకొన్న స్టేక్ హోల్డర్స్ అందరు చాటిన దేశ భక్తి యుక్త ఉత్సాహాన్ని, సామాజిక సేవపూర్వకమైన భావన ను, జట్టు స్ఫూర్తి ని ఆయన మెచ్చుకొన్నారు. మరీ ముఖ్యం గా, వివిధ సాముదాయిక సంస్థ లను ప్రధాన మంత్రి అభినందిస్తూ, అవి కనబరచినటువంటి నిస్వార్థ సేవ అనేది భారతదేశం యొక్క నాగరకత విలువల కు ఉదాహరణ గా నిలచినట్లు, ఈ విలువల ను ఆయా సంస్థ లు విదేశీ గడ్డ మీద కూడాను అనుసరిస్తున్నాయన్నారు.
సంక్షోభ కాలం లో, భారతీయ పౌరులు సురక్షితం గా ఉండేందుకు పూచీపడడం కోసం ప్రభుత్వం చేసిన ప్రయాసల ను గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, యూక్రేన్, ఇంకా దాని ఇరుగు పొరుగు దేశాల నేతల తో తాను వ్యక్తిగతం గా జరిపినటువంటి సంభాషణ ను గుర్తు కు తెచ్చుకొన్నారు. విదేశీ ప్రభుత్వాలు అన్నిటి వద్ద నుంచి అందిన సమర్ధన కు గాను ఆయన తన కృతజ్ఞత ను వ్యక్తం చేశారు.
విదేశాల లో భారతీయుల సురక్షత కు ప్రభుత్వం పెద్ద పీట ను వేస్తోందని ప్రధాన మంత్రి పునరుద్ఘాటిస్తూ, భారతదేశం ఏదైనా అంతర్జాతీయ సంకటం తలెత్తిన సందర్భం లో తన పౌరుల కు సాయపడడాని కి ఎల్లప్పుడు తత్పరత తో వ్యవహరించింది అని గుర్తు చేశారు. భారతదేశం యుగ యుగాల నుంచి వసుధైవ కుటుంబకమ్ తత్త్వం ద్వారా ప్రేరణ ను పొందుతూ, అత్యవసర స్థితుల లో అన్య దేశాల పౌరుల కు కూడాను మానవీయ సహాయాన్ని అందించింది అని ఆయన అన్నారు.
***
(Release ID: 1806585)
Visitor Counter : 218
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam