పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఉత్పత్తితో ముడిపడిన ప్రోత్సాహక పథకం కోసం డ్రోన్ పరిశ్రమ రంగం నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన ప్రభుత్వం


దరఖాస్తు సమర్పణకు ఆఖరి తేదీ 2022 మార్చి 31:

Posted On: 11 MAR 2022 10:57AM by PIB Hyderabad

ఉత్పత్తితో ముడిపడిన ప్రోత్సాహక పథకం (పిఎల్ఐ కోసం డ్రోన్ పరిశ్రమ నుంచి ప్రభుత్వం దరఖాస్తులు  ఆహ్వానించింది.2021 సెప్టెంబర్ 30వ తేదీన ప్రభుత్వం ఉత్పత్తితో ముడిపడిన ప్రోత్సాహక పథకం(పిఎల్ఐ )ని ప్రకటించింది. ఈ పథకం కింద మూడు ఆర్థిక సంవత్సరాల కాలంలో 120 కోట్ల రూపాయలను ప్రోత్సాహకాలుగా అందిస్తారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో స్వదేశీ డ్రోన్ ఉత్పత్తి రంగం సాధించిన మొత్తం ఉత్పత్తి తో పోల్చి చూస్తే ప్రభుత్వం ప్రకటించిన మొత్తం రెండింతలు ఎక్కువగా ఉంది. విలువ జోడించిన మొత్తానికి 20% మొత్తాన్ని పిఎల్ఐ గా అందించడం జరుగుతుంది. ప్రస్తుతం అమలులో ఉన్న పిఎల్ఐ పథకాల్లో ఇదే అత్యధిక శాతం.  డ్రోన్ మరియు డ్రోన్ భాగాల కొనుగోలు ధర ( నికర జీఎస్టీ   ) నుంచి  డ్రోన్‌లు మరియు డ్రోన్ భాగాల అమ్మకాల ద్వారా వచ్చే వార్షిక ఆదాయం  (నికర జీఎస్టీ  ) గా లెక్కించబడుతుంది.  డ్రోన్‌లకు అసాధారణమైన ప్రోత్సాహం అందించాలన్న లక్ష్యంతో  మూడు సంవత్సరాల పాటు   పిఎల్ఐ   రేటు 20% వద్ద స్థిరంగా ఉంటుంది. 

ప్రభుత్వం ప్రకటించిన పథకం ప్రకారం  డ్రోన్ల రంగానికి కనీస విలువ జోడింపు ప్రమాణాన్ని  డ్రోన్‌లు మరియు డ్రోన్ భాగాల నికర అమ్మకాలలో 40%గా నిర్ణయించారు. ఇతర రంగాలకు ఈ ప్రమాణం 50%గా ఉంది. డ్రోన్ల ఉత్పత్తి రంగానికి అత్యధిక ప్రోత్సాహం అందించాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఎంఎస్ఎంఈ మరియు అంకుర సంస్థలకు అర్హత సాధారణ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది. 

పథకం డ్రోన్లకు అవసరమైన సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేస్తున్న సంస్థలకు కూడా వర్తిస్తుంది. ఉత్పత్తిదారుల వార్షిక వ్యయంలో  పిఎల్ఐ  మొత్తం   25%కి పరిమితం చేయబడింది.  దీనివల్ల సంబంధిత ఆర్థిక సంవత్సరంలో ప్రమాణాల మేరకు ఉత్పత్తి సాధించడంలో వెనుకబడిన ఉత్పత్తిదారులకు ప్రయోజనం కలుగుతుంది. తదుపరి సంవత్సరంలో ఉత్పత్తిని పెంచి అంతకు ముందు సంవత్సరం లోటును భర్తీ చేసుకుని పిఎల్ఐ పొందేందుకు ఈ నిబంధన అవకాశం కలిగిస్తుంది. 

దరఖాస్తు ఫారమ్ ఒక పేజీ లోనే ఉంటుంది. దీనితోపాటు సంస్థ అధిపతి మరియు చట్టబద్ధమైన ఆడిటర్ జారీ చేసిన  సర్టిఫికేట్‌ ను జత చేయాల్సి ఉంటుంది. కంపెనీల సమూహంలోని ఒకటి కంటే ఎక్కువ కంపెనీలు ఈ PLI పథకం కింద వేర్వేరు దరఖాస్తులు అందించవచ్చు.  పిఎల్ఐ పథకం కింద అందే ప్రతి దరఖాస్తు విడిగా పరిశీలించబడుతుంది. అయితేపిఎల్ఐ పథకం కింద అటువంటి దరఖాస్తుదారులకు చెల్లించే  పిఎల్ఐ మొత్తం  ఆర్థిక వ్యయంలో 25%కి పరిమితం చేయబడుతుంది. దరఖాస్తులను  సమర్పించడానికి చివరి తేదీ  31 మార్చి 20222359 గంటలు) . 

 పిఎల్ఐ ప్రభుత్వ ఉత్తర్వులు   –  https://www.civilaviation. gov.in/sites/default/files/ Application_for_PLI_scheme_ for_drones_and_drone_ components.pdf .  పిఎల్ఐ   దరఖాస్తు ఫారం  - https://www.civilaviation.gov. in/application-pli-scheme లో అందుబాటులో ఉన్నాయి. 

దేశంలో అభివృద్ధి చెందుతున్న   డ్రోన్ పరిశ్రమను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టిందిఅవి:

·         సరళీకృత డ్రోన్ నియమాలు, 2021 25  ఆగస్టు 2021 న ప్రకటించబడ్డాయి. 

·         డ్రోన్ ఎయిర్‌స్పేస్ మ్యాప్ 24 సెప్టెంబర్ 2021 ప్రచురించబడింది .  దీనితో 400 అడుగుల ఎత్తు వరకు ఎగిరేందుకు  దాదాపు 90%భారత గగనతలం అందుబాటులోకి వచ్చింది. 

·         డ్రోన్‌ల కోసం ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ ( పిఎల్ఐ  పథకం 30  సెప్టెంబర్ 2021 న ప్రభుత్వం ప్రకటించింది. 

·        యూఏఎస్ UAS ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ (యూటీఎం విధానం  24  అక్టోబర్ 2021 న వెలువడింది. 

·         వ్యవసాయ డ్రోన్‌ల కొనుగోలు కోసం ఆర్థిక సహకారం అందించే పథకాన్ని  22  జనవరి 2022 న కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది .

·          డ్రోన్ రూల్స్, 2021 కింద మొత్తం ఐదు దరఖాస్తు ఫారంలు  26 జనవరి 2022 న డిజిటల్‌స్కై ప్లాట్‌ఫారమ్‌లో ఆన్‌లైన్‌లో పొందుపరచబడ్డాయి .

·         .   డ్రోన్ తయారీదారుల ద్వారా టైప్ సర్టిఫికెట్ పొందడం సులభతరం చేస్తూ డ్రోన్ సర్టిఫికేషన్ స్కీమ్ 26 జనవరి 2022న నోటిఫై చేయబడింది 

·          1 ఫిబ్రవరి 2022  కేంద్ర బడ్జెట్‌లో భాగంగా డ్రోన్ అంకుర సంస్థలకు సహకారం అందించడం మరియు డ్రోన్-యాజ్-ఎ-సర్వీస్ (DrAAS)ని ప్రోత్సహించడం కోసం మిషన్ 'డ్రోన్ శక్తిప్రకటించబడింది.

·         విదేశీ డ్రోన్‌ల  దిగుమతిని నిషేధిస్తూ మరియు డ్రోన్ విడిభాగాల దిగుమతికి అనుమతి మంజూరు చేస్తూ డ్రోన్ దిగుమతి విధానం ఫిబ్రవరి 2022న నోటిఫై చేయబడింది 

·           డ్రోన్ పైలట్ లైసెన్స్ అవసరాన్ని రద్దు చేస్తూ 11 ఫిబ్రవరి 2022   .డ్రోన్ (సవరణ) రూల్స్, 2022  వెలువడ్డాయి. 

·          28  ఫిబ్రవరి 2022 నాటికి దేశవ్యాప్తంగా 15 డ్రోన్ పాఠశాలలు డీజీసీఏ అనుమతులతో పనిచేస్తున్నాయి. . మరిన్ని సంస్థలు త్వరలో ప్రారంభం కానున్నాయి. 


(Release ID: 1805048) Visitor Counter : 242