రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నాన్ టెక్నిక‌ల్ పాపుల‌ర్ విభాగాల‌లోని అభ్య‌ర్థుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి రైల్వే క‌మిటీ


నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీల (CEN 01/2019) కోసం 2వ దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) కు పే లెవెల్ వారీగా 20 రెట్లు ప్రత్యేక అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.

అన్ని పే స్థాయిల‌లో స‌వరించిన ఫ‌లితాల‌ను 2022 ఏప్రిల్ మొద‌టి వారంలో వెల్ల‌డిస్తారు.

ఆర్ ఆర్ సి-01 (లెవ‌ల్ -1), మొద‌టి ద‌శ ప‌రీక్ష‌ను నిర్వ‌హించ‌నున్నారు.

Posted On: 10 MAR 2022 4:11PM by PIB Hyderabad

రైల్వే మంత్రిత్వ‌శాఖ ఇఆర్ బి-1/2022/23/06 తేదీ 26-01-2022 ప్ర‌కారం సిఇఎన్ 01/2019 ( నాన్ టెక్నిక‌ల్ పాపుల‌ర్ కేట‌గిరీల‌కు చెందిన‌) అలాగే సిఇఎన్ ఆర్ ఆర్‌సి 01/2019 (లెవ‌ల్ -1) అభ్య‌ర్థుల స‌మ‌స్య‌ల ను ప‌రిశీలించేందుకు ఒక క‌మిటిని నియ‌మించింది. దీని ప్ర‌కారం ఈ కింద తెలిపిన విధంగా నిర్ణయాలు తీసుకున్నారు.

● పేలెవ‌ల్ వారిగా రెండోద‌శ కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష (సిబిటి)సిఇఎన్ 01-2019 (నాన్ టెక్నిక‌ల్ పాపుల‌ర్ కేట‌గిరీ కోసం 20 రెట్లు ప్రత్యేక అభ్య‌ర్థుల‌ను షార్ట్ లిస్ట్ చేస్తారు.
● అర్హ‌త సాధించిన‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టింప‌బ‌డిన అభ్య‌ర్థులు , అర్హులుగానే ఉంటారు.
● షార్ట్ లిస్ట్ కానున్న అద‌న‌పు అభ్య‌ర్థుల వివ‌రాల‌ను పే లెవ‌ల్ వారీగా నోటిఫై చేయ‌డం జ‌రుగుతుంది.
 
● ఆర్ ఆర్ బి వారీగా 2వ దశ సిబిటిలో ప్రతి పే స్థాయికి ఒక ఆర్ ఆర్ బి కి చెందిన‌  అభ్యర్థులందరికి ఒకే షిఫ్ట్‌లో ప‌రీక్ష‌కు అవ‌కాశం కల్పిస్తారు.ఇది  నార్మ‌లైజేష‌న్ ను తొలగిస్తుంది. సామర్థ్య పరిమితులు లేదా ఇతర కారణాల వల్ల ఒకే షిఫ్ట్ సాధ్యం కాని చోట, పర్సంటైల్ ఆధారిత నార్మ‌లైజేష‌న్ ను చేప‌డ‌తారు.

 ●  సిఇఎన్ ఆర్ ఆర్ సి -01/2019  (లెవ‌ల్ -1) ఒకే ప‌రీక్ష‌గా ఉంటుంది. రెండో ద‌శ సిబిటి ఉండ‌దు.
 ● ఆర్ ఆర్ సి వారీగా సిబిటి ని లెవ‌ల్ -1కి నిర్వ‌హిస్తారు. అలాగే గ‌రిష్ఠ స్థాయిలో అందుబాటులో ఉన్న సామ‌ర్ధ్యాన్ని వినియోగించ‌నున్నారు. ప్ర‌తి ఆర్ ఆర్‌సి విష‌యంలో పరీక్ష షిఫ్ట్‌ల‌ను గ‌ణ‌నీయంగా త‌గ్గించేందుకు , ప‌రీక్ష ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేసేందుకు దీనిని చేప‌డ‌తారు.
● ప‌ర్సెంటైల్ ఆధారిత నార్మ‌లైజేష‌న్‌,  ఇది అత్యంత సులువైన‌ది, దీనిని అర్థం చేసుకోవ‌డం సుల‌భం, ఒక షిఫ్ట్ కంటే ఎక్కువ ఉన్న సంద‌ర్భంలో దీనిని ఉప‌యోగిస్తారు.
●  ఇండియ‌న్ రైల్వే మెడిక‌ల్ మాన్యువ‌ల్ (ఐఆర్ ఎంఎం) ప్ర‌కారం నిర్దేశించిన వైద్య ప్ర‌మాణాల‌ను లెవ‌ల్ -1 స్థాయిలోని వివిధ పోస్టుల‌కు అనుస‌రిస్తారు.


 ●  ఆర్థికంగా బ‌ల‌హీన వ‌ర్గాల‌కు (ఇడ‌బ్ల్యుఎస్‌) కింద ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల విష‌యంలో అందుబాటులో ఉన్న ఏదైనా ఆదాయ‌, ఆస్తి స‌ర్టిఫికేట్‌ను చెల్లుబాటు అయ్యేదిగా ప‌రిగ‌ణిస్తారు.
సిఇఎన్ 01/2019 ( నాన్ టెక్నిక‌ల్ పాపుల‌ర్ కేట‌గిరీ),సిఇఎన్ ఆర్ ఆర్ సి-01/2019 (లెవ‌ల్ -1) షెడ్యూలు (తాత్కాలిక‌)
● అన్ని పే స్థాయిల‌లో స‌వ‌రించిన ఫ‌లితాల‌ను 2022 ఏప్రిల్ మొద‌టివారంలో విడుద‌ల చేస్తారు.
● పేలెవ‌ల్ 6 కి సంబంధించి రెండో ద‌శ సిబిటి మే 2022 న జ‌రుగుతుంది.
 ● ఇత‌ర పే స్థాయిల‌కు సంబంధించి రెండో ద‌శ సిబిటిని త‌గినంత స‌మ‌యం ఇచ్చిన త‌ర్వాత నిర్వ‌హిస్తారు.
 ● 2వ దశ సిబిటి త‌దిత‌రాల‌ను తొలగించడం వలన లెవెల్-1 కోసం సిబిటిని నిర్వహించడానికి ప్రత్యేక షరతులతో సవరించబడిన విధానాన్ని అనుసరించాలని నిర్ణయించారు.


 ● ప్రతి షిఫ్ట్ కి గ‌ల అవసరాల‌లో గణనీయమైన పెరుగుదలతో లెవెల్-1 కోసం సిబిటిని నిర్వహించడానికి అదనపు మౌలిక సదుపాయాలు , లాజిస్టిక్‌లను సమీకరిస్తారు. లెవెల్-1 కోసం సిబిటిని వీలైనంత త్వరగా నిర్వహించేందుకు ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ (ECA)ని సిద్దంగా ఉంచుతారు.
● దీనితో లెవ‌ల్ -1 సిబిటిని  జూలై 22 త‌ర్వాత నిర్వ‌హించాల‌ని తాత్కాలికంగా నిర్ణ‌యించారు.

***


(Release ID: 1805006) Visitor Counter : 194