భారత పోటీ ప్రోత్సాహక సంఘం
azadi ka amrit mahotsav

హెచ్ఎస్‌బీసీ అసెట్ మేనేజ్‌మెంట్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఎల్ &టీ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ యొక్క 100% వాటా మూలధనాన్ని కొనుగోలు చేయడానికి సీసీఐ ఆమోదం

Posted On: 10 MAR 2022 11:08AM by PIB Hyderabad

హెచ్ఎస్‌బీసీ అసెట్ మేనేజ్‌మెంట్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ (హెచ్ఎస్‌బీసీ ఏఎంసీ /అక్వైరర్) ద్వారా ఎల్ &టీ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (ఎల్‌&టీ ఏఎంసీ/టార్గెట్) యొక్క 100% షేర్ క్యాపిటల్‌ను కొనుగోలు చేయడాన్ని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది.  ప్రతిపాదిత కలయిక ఎల్‌&టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ (ఎల్‌&టీ స్పాన్సర్/సెల్లర్) మరియు దాని నామినీల నుండి హెచ్ఎస్‌బీసీ ఏఎంసీ ద్వారా ఎల్‌&టీ ఏఎంసీ యొక్క 100% ఈక్విటీ షేర్ క్యాపిటల్‌ను కొనుగోలు చేయడానికి సంబంధించినది. టార్గెట్ యొక్క ఈక్విటీ షేర్ల కొనుగోలు అనేది పోటీ చట్టం, 2002లోని సెక్షన్ 5(a) కిందకు వస్తుంది.
హెచ్ఎస్‌బీసీ ఏఎంసీ /అక్వైరర్
హెచ్ఎస్‌బీసీ ఏఎంసీ అనేది హెచ్ఎస్‌బీసీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ల (హెచ్ఎస్‌బీసీ ఎంఎఫ్‌) యొక్క రోజువారీ పనితీరును నిర్వహించే ఆస్తి నిర్వహణ సంస్థ. హెచ్ఎస్‌బీసీ ఎంఎఫ్‌లో పెట్టుబడుల ద్వారా పూల్ చేయబడిన డబ్బు పెట్టుబడుల నిర్వహణ బాధ్యతను చేప‌డుతుంది.  హెచ్ఎస్‌బీసీ ఏఎంసీ అనేది  హెచ్ఎస్‌బీసీ హోల్డింగ్స్ పీఎల్‌సీ  ( హెచ్ఎస్‌బీసీ గ్రూప్) యొక్క పూర్తి యాజమాన్యంలోని పరోక్ష అనుబంధ సంస్థ. ఇది  హెచ్ఎస్‌బీసీ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందినది.
ఎల్‌&టీ ఏఎంసీ/ టార్గెట్‌
ఎల్‌&టీ ఏఎంసీ అనేది ఎల్‌&టీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ల (ఎల్‌&టీ ఎంఎఫ్‌) యొక్క రోజువారీ పనితీరును నిర్వహించే ఒక‌ ఆస్తి నిర్వహణ సంస్థ. ఎల్‌&టీ ఎంఎఫ్‌లో చేసిన పెట్టుబడుల ద్వారా పూల్ చేయబడిన డబ్బు పెట్టుబడిని నిర్వహించడానికి ఇది బాధ్యత వహిస్తుంది. ఎల్‌&టీ ఏఎంసీ అనేది ఎల్‌&టీ స్పాన్సర్ యొక్క పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ.
దీనికి సంబంధించిన స‌వివ‌ర‌మైన అర్డ‌రు వెలువ‌డాల్సి ఉంది.

 

****


(Release ID: 1804880) Visitor Counter : 135