యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మార్చి 11వ తేదీన నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ (ఎన్వైపీఎఫ్) 3వ ఎడిషన్ వేడుకలో ప్రసంగించనున్నారు.


కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ రేపు ఎన్వైపీఎఫ్ జాతీయ రౌండ్ ప్రారంభ సెషన్‌లో ప్రసంగించనున్నారు

ఫెస్టివల్‌లో ముగ్గురు జాతీయ విజేతలు ఈసందర్భంగా తమ అభిప్రాయాలను తెలియజేస్తారు.

Posted On: 09 MAR 2022 3:32PM by PIB Hyderabad

కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రి  అనురాగ్ ఠాకూర్ ఎన్వైపీఎఫ్ 2022 జాతీయ రౌండ్ ప్రారంభ సెషన్‌లో 10 మార్చి 2022న ప్రసంగిస్తారు. లోక్‌సభ స్పీకర్,  ఓం బిర్లా నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ (ఎన్వైపీఎఫ్) 3వ ఎడిషన్ వేడుకలో మాట్లాడుతారు. 11 మార్చి, 2022న  ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో కార్యక్రమం జరుగుతుంది. కేంద్ర యువజన వ్యవహారాలు  క్రీడల శాఖ మంత్రి  నిసిత్ ప్రమాణిక్ పాల్గొనే వారికి సర్టిఫికేట్‌లను పంపిణీ చేస్తారు. జాతీయ స్థాయిలో మొదటి ముగ్గురు విజేతలకు కూడా లోక్‌సభ స్పీకర్‌ ముందు ప్రసంగించే అవకాశం ఉంటుంది.

 

నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్

 

నేషనల్ యూత్ పార్లమెంటరీ ఫెస్టివల్ (ఎన్వైపీఎఫ్)  లక్ష్యం రాబోయే సంవత్సరాల్లో ప్రజా సేవలతో సహా వివిధ కెరీర్‌లలో చేరబోయే యువత  వాణిని వినిపించడం. ఎన్వైపీఎఫ్ అనేది డిసెంబర్ 31, 2017న ప్రధాన మంత్రి తన మన్ కీ బాత్ ప్రసంగంలో చెప్పిన ఆలోచన ఆధారంగా రూపొందించడం జరిగింది. ఈ ఆలోచన నుండి ప్రేరణ పొంది, ఎన్వైపీఎఫ్  1వ ఎడిషన్ను జనవరి 12 నుండి ఫిబ్రవరి 27, 2019 వరకు “బీ ద వాయిస్ ఆఫ్ న్యూ ఇండియా..  పరిష్కారాలను కనుగొనండి.  విధానానికి సహకరించండి” థీమ్తో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 88,000 మంది యువత పాల్గొన్నారు.

 

జాతీయ యువజన పార్లమెంట్  లక్ష్యాలు ఏమిటంటే.. యువత తమ ఆలోచనలను  దేశం కోసం  చెప్పడానికి వేదికను అందించడం.  యువత తమ సమస్యలను  స్థానిక సమస్యలను ఒక వేదికపై వినిపించేలా చేయడం. అలాగే, ప్రభుత్వం  వివిధ పథకాలు  కార్యకలాపాలను యువతకు ఆకర్షణీయమైన ఇంటరాక్టివ్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రచారం చేయడం. ప్రజాచర్చలు, సంభాషణల ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంపొందించడం మొదలైనవి. యువత ప్రజా సమస్యలతో నిమగ్నమవ్వడానికి, సామాన్యుల దృక్కోణాన్ని అర్థం చేసుకోవడానికి, అభిప్రాయాలను ఏర్పరచడానికి,  సమర్ధవంతంగా వ్యక్తీకరించడానికి,  యువతలో సమాచారం , డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచడాన్ని ఎన్వైపీ ప్రోత్సహిస్తుంది. దీనితో పాటుగా యువతలో వారి స్వంత నమ్మకాల నుండి భిన్నమైన దృక్కోణాల పట్ల గౌరవం,  సహనాన్ని పెంపొందించడం,  ఏదైనా చర్చను క్రమపద్ధతిలో  ప్రభావవంతంగా నిర్వహించడానికి నియమాలను గౌరవించడం తప్పనిసరి అనే అవగాహనను యువతలో పెంపొందించడం కూడా ఎన్వైపీ  మరొక లక్ష్యం. 2022లో విజన్ ఆఫ్ న్యూ ఇండియాపై యువత అభిప్రాయాలను పొందడం,  డాక్యుమెంట్ చేయడం  దానిని ముందుకు తీసుకెళ్లడానికి విధాన రూపకర్తలకు చర్చల నుండి ఉత్పన్నమయ్యే ప్రముఖ అభిప్రాయాలను అందుబాటులో ఉంచడం కూడా వీటిలో భాగం.

 

ఎన్వైపీఎఫ్  2వ ఎడిషన్ను 23 డిసెంబర్, 2020 నుండి జనవరి 12, 2022 వరకు “యువా- ఉత్సాహ్ నయే భారత్ కా” అనే థీమ్‌తో వర్చువల్ మోడ్ ద్వారా నిర్వహించడం జరిగింది. దీనిని దేశవ్యాప్తంగా జిల్లా, రాష్ట్ర  జాతీయ స్థాయిలో 23 లక్షల మందికి పైగా యువత వీక్షించారు. ఎన్వైపీఎఫ్  3వ ఎడిషన్ 14 ఫిబ్రవరి 2022న జిల్లా స్థాయిలో వర్చువల్ మోడ్ ద్వారా ప్రారంభమయింది. 2022 ఫిబ్రవరి 23 నుండి 27 వరకు వర్చువల్ మోడ్ ద్వారా దేశవ్యాప్తంగా 2.44 లక్షల మంది యువత జిల్లా యూత్ పార్లమెంట్ల తర్వాత రాష్ట్ర యూత్ పార్లమెంట్‌లలో పాల్గొన్నారు. ఎన్వైపీఎఫ్ 3వ ఎడిషన్ ఫైనల్స్ 10,11వ తేదీల్లో పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరుగుతాయి.   రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎనభై ఏడు (87) మంది విజేతలు (62 మంది మహిళలు  25 మంది పురుషులు)  కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడల  మంత్రితోపాటు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. కేంద్ర యూత్ పార్లమెంట్ (ఎస్వైపీ)లో ఇరవై తొమ్మిది మంది (29) విజేతలతో కూడిన జాతీయ జ్యూరీ ముందు మాట్లాడే అవకాశాన్ని పొందుతారు. ఈ జ్యూరీలో భర్తృహరి మహతాబ్, పార్లమెంట్ లోక్ సభ సభ్యుడు, డాక్టర్ సత్య పాల్ సింగ్, పార్లమెంట్ సభ్యుడు మతి. అను  సింగ్, ఐఆర్ఎస్ (రిటైర్డ్.)  కంచన్ గుప్తా, సీనియర్ అడ్వైజర్ మినిస్ట్రీ ఇన్ఫర్మేషన్ & బ్రాడ్‌కాస్టింగ్.. ఉంటారు. మొదటి ముగ్గురు జాతీయ విజేతలు కూడా 11 మార్చి 2022న జరిగే వైభవోత్సవ కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ముందు మాట్లాడే అవకాశాన్ని పొందుతారు.

 

***



(Release ID: 1804761) Visitor Counter : 142