పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

ఉక్రెయిన్ పొరుగుదేశాల నుంచి ప్ర‌త్యేక విమానాల ద్వారా 3000 మంది భార‌తీయుల త‌ర‌లింపు


13 వేల 7మందిక‌న్నా ఎక్కువమంది భార‌తీయుల‌ను వెన‌క్కి తీసుకువ‌చ్చిన ప్రత్యేక విమానాలు

Posted On: 05 MAR 2022 5:52PM by PIB Hyderabad

భార‌తీయ పౌరుల‌ను  ర‌క్షించ‌డానికి ఉద్దేశించిన‌ ఆప‌రేష‌న్ గంగ ప‌థ‌కం కింద‌,  15 ప్ర‌త్యేక విమానాలు యుక్రైన్ పొరుగుదేశాల నుంచి  3000మంది భార‌తీయుల‌ను తీసుకుని శ‌నివారం బ‌య‌లుదేరాయి. ఇందులో ప్ర‌త్యేక పౌర విమానాలు, 3 భార‌తీయ వైమానిక ద‌ళ (ఐఎఎఫ్‌) విమానాలు ఉన్నాయి. దీనితో, 22 ఫిబ్ర‌వ‌రి, 2022 నుంచి ప్రారంభ‌మైన ప్ర‌త్యేక విమానాల ద్వారా 13వేల 7వంద‌ల‌మంది భార‌తీయుల‌ను ర‌వాణా చేశాయి. నేటితో 55 ప్ర‌త్యేక పౌర విమానాల ద్వారా తీసుకువ‌చ్చిన భార‌తీయుల సంఖ్య 11728కి చేరింది. ఆప‌రేష‌న్ గంగ‌లో భాగంగా, ఇప్ప‌టి వ‌ర‌కు 2056 ప్ర‌యాణీకుల‌ను  వెన‌క్కి తీసుకు రావ‌డ‌మే కాక  26 ట‌న్నుల స‌హాయ సామాగ్రిని ఈ దేశాల‌కు చేర‌వేసేందుకు భార‌తీయ వైమానిక ద‌ళ విమానాలు 10 సార్టీలు చేశాయి. 
నిన్న సాయంత్రం హింద‌న్ ఎయిర్ బేస్ నుంచి బ‌య‌లుదేరిన మూడు సి-17 భారీ బ‌ర‌వులు మోయ‌గ‌ల ర‌వాణా విమానాలు నేటి ఉద‌యం తిరిగి  హింద‌న్‌లో దిగాయి. ఈ విమానాలు రొమేనియా, స్లొవేకియా, పోలాండ్‌ల నుంచి 629మంది భార‌తీయుల‌ను త‌ర‌లించారు. ఈ విమానాలు 16.5 ట‌న్నుల స‌హాయ‌క సామాగ్రిని ఈ దేశానికి మోసుకువెళ్ళాయి. ఒక్క‌టి మిన‌హా అన్ని పౌర విమానాలూ ఈ రోజు ఉద‌యం దిగగా, కొసైస్ నుంచి న్యూఢిల్లీకి వ‌చ్చే విమానం మాత్రం సాయంత్రం ఆల‌శ్యంగా దిగే అవ‌కాశ‌ముంది. నేడు తిరిగి వ‌చ్చిన విమానాల‌లో 5 బుడాపెస్ట్ నుంచి, 4 సుకేవా నుంచి, 1 కొసైస్ నుంచి 2 ర్జెజోస్జోవ్ నుంచి వ‌చ్చిన‌వి ఉన్నాయి. 
రేపు 11 ప్ర‌త్యేక విమానాలు బుడాపెస్ట్‌, కొసైస్‌, రెజోస్జోవ్‌, బుకారెస్ట‌లలో చిక్కుబ‌డిన 2200మంది భార‌తీయుల‌ను స్వ‌దేశానికి తీసుకురావ‌డానికి బ‌య‌ల‌దేర‌నున్న‌ట్టు అంచ‌నా. 

 

***
 



(Release ID: 1803257) Visitor Counter : 122