ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆప‌రేష‌న్ గంగా కార్య‌క్ర‌మ ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష‌కు అధ్య‌త వ‌హించిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

Posted On: 28 FEB 2022 10:17PM by PIB Hyderabad

ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భార‌తీయుల‌ను స్వ‌దేశానికి తీసుకువ‌చ్చేందుకు జ‌రుగుతున్న కృషిని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఈ రోజు రెండో రోజు త‌న  అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఉన్న‌త‌స్థాయి స‌మావేశంలో స‌మీక్షించారు. ఉక్రెయిన్ లోని భార‌తీయులంద‌రూ క్షేమంగా, సుర‌క్షితంగా ఉండేలా చూసేందుకు ప్ర‌భుత్వ యంత్రాంగం మొత్తం నిరంత‌రాయంగా కృషి చేస్తున్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు.

 త‌న త‌రఫున ప్ర‌త్యేక ప్ర‌తినిధులుగా  వివిధ దేశాల‌కు న‌లుగురు సీనియ‌ర్ మం్ర‌తులు వెళ్ల‌డం, ఉక్రెయిన్ లో చిక్కుకున్న భార‌తీయుల‌ను తిరిగి తీసుకువ‌చ్చే ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేస్తుంద‌న్నారు. దీనిని బ‌ట్టి ఈ అంశానికి ప్ర‌భుత్వం ఎంత ప్రాధాన్య‌త ఇస్తుందో తెలియ‌జెబుతున్న‌ద‌ని ఆయ‌న అన్నారు.
ఉక్రెయిన్‌లో నెల‌కొన్న ప‌రిస్థితుల దృష్ట్యా మాన‌వ‌తా స‌హాయం కింద ఉక్రెయిన్ స‌రిహ‌ద్దుల‌కు రేపు తొలివిడ‌త స‌హాయ సామ‌గ్రిని పంప‌డం జ‌రుగుతుంద‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. 

వ‌సుదైక కుటుంబ‌క‌మ్ అన్న భారతీయ విధానం స్ఫూర్తి వెలుగులో , ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన పొరుగుదేశాల వారు, అభివృద్ధి చెందుతున్న దేశాల‌వారికి ఇండియా స‌హాయం చేస్తుంద‌ని, అలాంటివారు స‌హాయం పొంద‌వ‌చ్చ‌ని తెలిపారు.

***


(Release ID: 1802002) Visitor Counter : 181