ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
నిర్దిష్ట రంగాలవారీగా కాకుండా అందరికీ వర్తించే విధంగా ఉండే ఏకగవాక్ష ఈ-వేలం వేదిక ద్వారా బొగ్గు ఉత్పత్తి సంస్థలు బొగ్గు సరఫరా చేసేందుకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం
Posted On:
26 FEB 2022 2:02PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఈ కింది అంశాలకు ఆమోదం తెలిపింది.
i) బొగ్గు ఉత్పత్తి చేస్తున్న సంస్థలు సిఐఎల్ / సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్( ఎస్‌సిసిఎల్)ల ఇ-వేలం విండో ద్వారా అన్ని నాన్-లింకేజ్ బొగ్గును అందిస్తాయి. ఈ-వేలం నిర్ణయం అన్ని వర్గాలు అంటే వ్యాపారులతో సహా విద్యుత్ రంగం మరియు నాన్ రెగ్యులేటెడ్ సెక్టార్ (ఎన్‌ఆర్‌ఎస్) రంగాలకు వర్తిస్తుంది. ప్రస్తుత రంగ నిర్దిష్ట వేలం వ్యవస్థ స్థానంలో బొగ్గు ఈ వేలం అమల్లోకి వస్తుంది.
ii ) ఇప్పటికే బొగ్గు సరఫరా చేసేందుకు సిఐఎల్/ఎస్‌సిసిఎల్‌కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం బొగ్గు సరఫరా చేయవలసి ఉంటుంది. కాంట్రాక్టు ధరపై విధ్యుత్, ఇంధనేతర రంగాలకు కుదిరిన ఒప్పందాలకు నూతన విధానం వర్తించదు.
iii ) సింగిల్ విండో ఈ -వేలం ద్వారా పొందిన బొగ్గును రైలు మార్గంలో తరలించాల్సి ఉంటుంది. ఇతర ప్రత్యామ్నాయ అనుమతించడం జరుగుతుంది. తమకు అనుకూలంగా ఉండే మార్గాల ద్వారా రవాణా చేసుకునేందుకు వినియోగదారులకు స్వేచ్ఛ ఉంటుంది. అయితే, దీని కోసం బొగ్గు ఉత్పత్తి సంస్థలకు అదనపు మొత్తాలను చెల్లించడం గాని డిస్కౌంట్ అందించడం గాని చేయనవసరం ఉండదు.
iv ) ఉత్పత్తి సంస్థలు నిర్ణయించే ధరలకు బొగ్గు సరఫరా చేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందాలకు భంగం కలిగించకుండా తమ బొగ్గు ఉత్పత్తి కేంద్రాలకు దీర్ఘ కాలంలో బొగ్గును సరఫరా చేసేందుకు సంస్థలకు అనుమతి ఇవ్వడం జరుగుతుంది. అయితే, ఇంధన రంగానికి సరఫరా చేసే బొగ్గుపై విధించే పన్నులు, సుంకాలు,రాయల్టీ మొదలైనవి చెల్లించాల్సి ఉంటుంది.
ప్రధాన ప్రయోజనాలు, ఉపాధి కల్పన అవకాశాలు :
ఈ-వేలం మార్కెట్ విధానం వల్ల మార్కెట్ అవరోధాలు తొలగిపోయి వినియోగదారులందరికీ ఒకే ధరపై బొగ్గు లభిస్తుంది. దీనివల్ల నిర్వహణ సామర్థ్యం పెరిగి స్వదేశీ మార్కెట్లో బొగ్గుకు డిమాండ్ పెరుగుతుంది. ఇంతేకాకుండా,విచక్షణాధికారాలు ఉపయోగించి తమ ఇష్టం మేరకు వినియోగదారులకు బొగ్గు సరఫరా చేసేందుకు ఉత్పత్తి సంస్థలు అనుసరిస్తున్న విధానానికి తెరపడుతుంది. తమ సొంత గనుల్లో లభిస్తున్న బొగ్గు ఆధారంగా పనిచేసే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పేందుకు ఉత్పత్తి సంస్థలకు అవకాశం కలుగుతుంది. దేశంలో క్లీన్ కోల్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో ఇది దోహదపడుతుంది.
ఏకగవాక్ష ఇ-వేలం విండో ద్వారా బొగ్గును ఆర్థిక వ్యవస్థలోని వినియోగదారులందరికీ అందుబాటులోకి రావడం వల్ల మార్కెట్ అవకతవకలను తొలగించడానికి వీలవుతుంది. దేశీయ బొగ్గును ఉపయోగించేందుకు ఎక్కువ మంది వినియోగదారులను మొగ్గు చూపుతారు. దీనివల్ల దేశంలో ఉత్పత్తి అవుతున్న బొగ్గుకు డిమాండ్ పెరుగుతుంది. బొగ్గు ఉత్పత్తిని ఎక్కువ చేసేందుకు సిఐఎల్ భారీ ప్రణాళికలను రూపొందించింది. 2023-24 నాటికి ఒక బీటీ ( బిలియన్ టన్నులు) బొగ్గు ఉత్పత్తి చేయాలని సిఐఎల్ లక్ష్యంగా నిర్ణయించుకుంది. నాణ్యమైన బొగ్గును అవసరాల మేరకు అందుబాటులోకి తెచ్చి స్థిరమైన ధరలకు సరఫరా చేయడం ద్వారా సిఐఎల్ తన లక్ష్యాలను సాధించగలుగుతుంది. విదేశాల నుంచి బొగ్గు దిగుమతులు గణనీయంగా తగ్గుతాయి. దిగుమతి చేసుకున్న బొగ్గు అవసరాలు తగ్గడంతో ఆత్మ నిర్భర్ భారత్ సాధన సాధ్యమవుతుంది.
బొగ్గు గ్యాసిఫికేషన్ సాంకేతికత స్థిరత్వం మరియు అభివృద్ధి కి ఈ విధానం దోహదపడుతుంది.. కోల్ గ్యాసిఫికేషన్ వంటి క్లీన్ కోల్ సాంకేతిక వినియోగం వల్ల బొగ్గు ఉపయోగించడం వల్ల కలుగుతున్న పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు.
ఆర్థిక పరమైన అంశాలు :
ఇ-వేలం విండోలను విలీనం చేయడం వల్ల బొగ్గు కంపెనీలపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం ఉండదు.
నేపధ్యం:
బొగ్గు మార్కెట్ విభజించబడి, నియంత్రణలో ఉంది. దీనివల్ల మార్కెట్‌లోని ప్రతి విభాగంలో ఒకే గ్రేడ్ బొగ్గు కోసం అనేక రకాల మార్కెట్ రేట్లు అమలులో ఉన్నాయి. రంగాల వారీగా వివిధ ధరలు అమలులో ఉండడంతో బొగ్గు మార్కెట్ వక్రీకరణలు జరుగుతాయి. బొగ్గు మార్కెట్‌లో అమలు చేయనున్న ఈ సంస్కరణల ద్వారా ఏదైనా నిర్దిష్ట గ్రేడ్‌కు చెందిన బొగ్గును మార్కెట్‌లో ఒక రేటుకు (ఒక గ్రేడ్, ఒక రేటు) విక్రయించవచ్చు, బొగ్గును రైలు మార్గం ద్వారా మాత్రమే రవాణా చేయవలసి ఉంటుంది. ఈ -వేలం విధానం పారదర్శకంగా అమలు జరుగుతుంది. నిర్దిష్ట లక్ష్యాలతో ఈ విధానం అమల్లోకి వస్తుంది. మార్కెట్ లో అమలులో ఉండే ధరకు ఈ-వేలం ద్వారా వినియోగదారులందరికీ బొగ్గును విక్రయించడానికి బొగ్గు కంపెనీలను అనుమతిస్తుంది. సాంప్రదాయ బొగ్గు వినియోగాన్ని తగ్గించేందుకు శుద్ధి చేసిన బొగ్గును వినియోగించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాల్సిన అవసరం ఉంది. బొగ్గు గ్యాసిఫికేషన్ మార్గం ద్వారా తమ వ్యాపారాన్ని విస్తరించాలని బొగ్గుఉత్పత్తి సంస్థలు భావిస్తున్నాయి. బొగ్గు బ్లాక్ కేటాయింపు, ఆదాయ వాటాలో రాయితీ వంటి ప్రోత్సాహకాల ద్వారా బొగ్గు గ్యాసిఫికేషన్‌ను ప్రోత్సహిస్తున్నారు. బొగ్గు మరియు సంబంధిత సాంకేతికతల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రోత్సాహక చర్యలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. మంత్రివర్గం ఆమోదించిన నూతన విధానంలో బొగ్గు కంపెనీలు తమ బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు బొగ్గును సరఫరా చేయడానికి వెసులుబాటు కలిగి ఉంటాయి.
***
(Release ID: 1801461)
Visitor Counter : 177
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada