స్పెషల్ సర్వీస్ మరియు ఫీచర్ లు
పరిపాలన , అభివృద్ధి కోసం సాంకేతికపరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో ప్రముఖ దేశంగా మారిన భారత్: కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐ. టి. సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్
Posted On:
25 FEB 2022 12:52PM by PIB Hyderabad
పరిపాలన , అభివృద్ధి కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో భారతదేశం ఒక ప్రముఖ దేశంగా మారిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మీటీవై) సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. డ్రాఫ్ట్ నేషనల్ డేటా సెంటర్ , క్లౌడ్ పాలసీపై పరిశ్రమ సంప్రదింపుల సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పారు.
డేటా సెంటర్ క్లౌడ్ కార్యకలాపాల్లో స్వదేశీ ప్లాట్ ఫారమ్ లు/పరిష్కారాల వినియోగాన్ని ప్రోత్సహించడమే ఈ విధానం లక్ష్యం అని మంత్రి తెలిపారు. ఇంధన సమర్థవంతమైన, స్థిరమైన , గ్రీన్ డేటా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఈ విధానాన్ని ఉద్దేశించినట్టు ఆయన పేర్కొన్నారు..
జాతీయ డేటా సెంటర్ తో పాటు, భారత దేశ కేంద్రిత క్లౌడ్ స్పేస్ కూడా అవసరమని
ఆయన అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం పరిశ్రమల నుండి వచ్చే ఆలోచనలు ఆ లు స్వీకరించడానికి, దేశ అభివృద్ధికి అవసరమైన మార్పులు చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.
జాతీయ డేటా సెంటర్ పై ముసాయిదా విధానం- 2027 నాటికి 2000మెగావాట్ల సామర్థ్య జోడింపుతో దేశంలో అంచనా వేసిన డేటా సెంటర్ సామర్థ్యంలో వృద్ధిని వేగవంతం చేయాలని ఉద్దేశిస్తున్నట్టు మీటీ జాయింట్ సెక్రటరీ శ్రీ అమితేష్ కుమార్ సిన్హా తెలిపారు.
ప్ర స్తుతం భారత దేశం డేటా సెంటర్లకు 499 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని కలిగి ఉండగా, ఇది 2023 నాటికి 1007 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా వేసినట్టు ఆయన తెలిపారు.
ఐదు మెగావాట్ల డేటా సెంటర్ (ఐటి , ఐటి యేతర) ఏర్పాటు కోసం కాంపోనెంట్ వారీగా ఖర్చు వివరాలు, నిర్మాణానికి ముందు, నిర్మాణ సమయం లోనూ, నిర్మాణం తరువాత డేటా కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన ప్రాజెక్టు దశలతో పాటు ఉమ్మడి అనుమతుల జాబితా పైన చర్చించారు.
స్థానిక విలువ జోడింపునకు ప్రోత్సాహకాన్ని అందించడంతో సహా వివిధ సూచనలపై కూడా చర్చించారు. భౌతిక , వర్చువల్ విధానాల్లో జరిగిన ఈ సంప్రదింపులలో సుమారు 300 మంది పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు.
***
(Release ID: 1801274)
Visitor Counter : 173