ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కేంద్ర బడ్జెట్ పై కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహించనున్న వెబ్‌నార్‌ను రేపు ప్రారంభించనున్న ప్రధానమంత్రి
ఆయుష్మాన్ భారత్, డిజిటల్ మిషన్, ఇ-సంజీవని , టెలి మెంటల్ హెల్త్ అంశాలపై జరగనున్న సదస్సులలో పాల్గొనున్న ప్రైవేట్ రంగానికి చెందిన సంబంధిత రంగ ప్రముఖులు మరియు నిపుణులు
Posted On:
25 FEB 2022 10:11AM by PIB Hyderabad
కేంద్ర బడ్జెట్ పై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహించనున్న వెబినార్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు వెబినార్ ప్రారంభమవుతుంది. ఉదయం 10.45 నుంచి మధ్యాహ్నం 1.50 గంటల వరకు మూడు సదస్సులు నిర్వహిస్తారు. ఆయుష్మాన్ భారత్, డిజిటల్ మిషన్, ఇ-సంజీవని , టెలి మెంటల్ హెల్త్ అంశాలపై సదస్సులు జరుగుతాయి.
ఆరోగ్య రంగంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల్లో ప్రైవేట్ రంగానికి భాగస్వామ్యం కల్పించేందుకు గల అవకాశాలను చర్చించి, సంబంధిత వర్గాలకు ప్రాధాన్యత కల్పించాలన్న లక్ష్యంతో ఈ వెబినార్ ను నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం తరువాత బడ్జెట్ కు సంబంధించి వివిధ అంశాలపై వెబినార్లను నిర్వహించడం జరుగుతుంది/ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించనున్న వెబినార్ లో పలువురు ప్రముఖులు, నిపుణులు పాల్గొంటారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్, పరిశ్రమలు, అంకుర సంస్థలు, విద్యా రంగానికి చెందిన ప్రతినిధులు, నిపుణులు వివిధ అంశాలపై ప్రసంగిస్తారు. సదస్సు ముగింపు సమావేశానికి కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ సంయుక్తంగా అధ్యక్షత వహిస్తారు.
ఈ కింది అంశాలపై వెబినార్ లో సదస్సులను నిర్వహించడం జరుగుతుంది.
1. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్:
నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి కె పాల్ సదస్సు అనుసంధానకర్తగా వ్యవహరిస్తారు. ఎన్‌హెచ్‌ఏ అడిషనల్ సీఈఓ డాక్టర్ ప్రవీణ్ గెడం ప్రసంగిస్తారు. యశోద హాస్పిటల్ శ్రీమతి ఉపాసన అరోరా, నారాయణ హెల్త్ చైర్మన్ డాక్టర్ దేవి శెట్టి, మెట్రోపొలిస్ ల్యాబ్ మేనేజింగ్ డైరెక్టర్ అమీరా షా, హెల్త్ కేర్ ఫెడరేషన్ అఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ హర్ష్ మహాజన్, సీఐఐ ప్రతినిధులు శ్రీ రాజీవ్ వాసుదేవన్, ఆయుర్వైద్ ఈ సదస్సులో ప్రసంగిస్తారు.
2. జాతీయ టెలీ-మెడిసిన్ కార్యక్రమాలు మరియు ఇ-సంజీవని:
పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ప్రొఫెసర్ కె శ్రీనాథ్ రెడ్డి అధ్యక్షతన ఈ సదస్సు జరుగుతుంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ లవ్ అగర్వాల్ ఈ -సంజీవని పై ప్రసంగిస్తారు. ఎన్‌హెచ్‌ఎం కర్ణాటక ఎండీ డాక్టర్ అరుంధతీ చందర్‌శేఖర్, అపోలో హాస్పిటల్ జాయింట్ ఎండీ శ్రీమతి సంగీతారెడ్డి, టాటా మెడికల్ అండ్ డయాగ్నోస్టిక్స్ సీఈవో శ్రీ గిరీష్ కృష్ణమూర్తి, బీఐఎస్‌లోని టెలిహెల్త్ స్టాండర్డ్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ అశ్విని గోయెల్ సదస్సులో ప్రసంగిస్తారు.
3. టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రాం:
నిమ్హాన్స్ డైరెక్టర్ డాక్టర్ ప్రతిమ మూర్తి ఈ సదస్సుకు అనుసంధానకర్తగా స్వాగత ప్రసంగం చేస్తారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ ఎండీ శ్రీ వికాస్ షీల్ టెల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రాం ప్రాధాన్యతను వివరిస్తారు. ది యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా క్లినికల్ ప్రొఫెసర్ ఆఫ్ సైకియాట్రీ డాక్టర్. మోహన్ ఐజాక్, ఆరోగ్య అంశాలపై పరిశోధనలు చేస్తూ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన (అమెరికా /గోవా) డాక్టర్ అనంత్ భాన్, , పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు డాక్టర్ ప్రీతి కుమార్, ఐఐటీ బెంగళూరుకు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ టీ. కే. శ్రీకాంత్, నిమ్హాన్స్ నుంచి డాక్టర్ కిషోర్ కుమార్ ఈ సదస్సులో పాల్గొంటారు.
సంబంధిత వర్గాల మధ్య విస్తృతంగా చర్చలు జరిగే విధంగా సదస్సులను నిర్వహించడం జరుగుతుంది. సదస్సులో తీసుకునే నిర్ణయాలను అమలు చేసేందుకు సమగ్ర కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది. వెబినార్ లో ప్రధానమంత్రి ప్రసంగాన్ని దూరదర్శన్ న్యూస్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.
***
(Release ID: 1801054)
Visitor Counter : 243