కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

గ్రామాలలో సౌకర్యాలను అందించడంతో పాటు, బ్రాడ్‌ బ్యాండ్, గ్రామాల్లో నైపుణ్యం కలిగిన యువకుల పెద్ద సమూహాన్ని కూడా సృష్టిస్తుంది : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Posted On: 23 FEB 2022 5:10PM by PIB Hyderabad

ఇటీవల ప్రకటించిన కేంద్ర బడ్జెట్-2022 పై బడ్జెట్ అనంతర వెబినార్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, గ్రామీణ డిజిటల్ అనుసంధానత అనేది ఇకపై కేవలం ఆకాంక్ష కాదు, ఇది ఒక అవసరంగా మారిందని వ్యాఖ్యానించారు.  పరిశ్రమల ప్రముఖులు, విధాన నిర్ణేతలు, ప్రభుత్వ అధికారులను ఒకచోట చేర్చి, బడ్జెట్ యొక్క సానుకూల ప్రభావం పై చర్చించి, ప్రతి ఒక్కరి ఉద్ధరణ యొక్క ఉమ్మడి లక్ష్యాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళడం కోసం, సమిష్టిగా పని చేసి, నిర్దిష్ట కార్యాచరణ వ్యూహాలను గుర్తించాలని లక్ష్యంగా పెట్టుకుని, ఎవరినీ వదిలి పెట్టకుండా, ప్రతి ఇల్లు, ప్రతి గ్రామాన్ని సంతృప్తి పరచాలన్న ఉద్దేశ్యంతో, ఈ వెబినార్ కు 'ఏ పౌరుడు వెనుకబడకుండా...' అనే ఇతివృత్తాన్ని నిర్ణయించడం జరిగింది. 

వెబినార్‌ లో ప్రధానమంత్రి మాట్లాడుతూ, గ్రామాలలో సౌకర్యాలను అందించడంతో పాటు, బ్రాడ్‌ బ్యాండ్, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నైపుణ్యం కలిగిన యువకుల పెద్ద సమూహాన్ని కూడా సృష్టిస్తుందని పేర్కొన్నారు.  గ్రామీణ ప్రాంతాలకు సేవా రంగాన్ని విస్తరించడానికి, ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి, బ్రాడ్‌ బ్యాండ్ సహాయపడుతుందని ఆయన నొక్కి చెప్పారు.  ముఖ్యంగా ఆశావహ జిల్లాల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పనకు సంతృప్త విధానం అవసరమని ఆయన నొక్కి చెప్పారు.  లక్ష్యాలను సాధించడంలో గ్రామాల మధ్య ఇటువంటి అనుసంధానత, ఆరోగ్యకరమైన పోటీని ఉపయోగించడంపై అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు.

ఆర్. & డి. ని ప్రోత్సహించడానికి, గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో సరసమైన బ్రాడ్‌ బ్యాండ్ మరియు మొబైల్ సేవల విస్తరణను అందుబాటులోకి తీసుకురావడానికి సాంకేతికతలు, పరిష్కారాల వాణిజ్యీకరణను ప్రోత్సహించడానికి, యు.ఎస్.ఓ.ఎఫ్. కింద వార్షిక ఆదాయం లో 5 శాతం కేటాయించాలని ప్రతిపాదించడం ద్వారా,  కేంద్ర బడ్జెట్ 2022-23 టెలికాం రంగానికి ఒక ప్రోత్సాహాన్ని అందించింది.  వీటితో పాటు, 2025 నాటికి అన్ని గ్రామాలను ఆప్టికల్ ఫైబర్ నెట్‌ వర్క్‌ వ్యవస్థలోకి తీసుకురావాలని కూడా ప్రతిపాదించింది.

బడ్జెట్ వేగాన్ని స్థిరంగా ముందుకు తీసుకెళ్లడానికి, కొనసాగించడంతో పాటు, బడ్జెట్ అమలులో యాజమాన్య భావాన్ని అన్ని సంబంధిత భాగస్వాములకు కలిగించడానికి, వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల ద్వారా వరుస వెబినార్లను ఏర్పాటు చేయడం జరిగింది.   "ఏ పౌరుడు వెనుకబడకుండా..." అనే ఇతివృత్తంతో గ్రామీణాభివృద్ధి శాఖ కూడా ఇటువంటి బడ్జెట్ అనంతర వెబినార్‌ ను నిర్వహించింది.  అదేవిధంగా "అన్ని గ్రామీణ ఆవాసాలకు రహదారి, సమాచారం" అనే ఇతివృత్తంతో మరొక సదస్సు నిర్వహించడం జరిగింది.  ఈ సదస్సుకు టెలికమ్యూనికేషన్స్ విభాగం కార్యదర్శి(టి), శ్రీ కె. రాజారామన్ మరియు  గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, అదనపు కార్యదర్శి,  డా. ఆశిష్ కుమార్ గోయెల్ సంధానకర్తలుగా వ్యవహరించారు. ఈ సదస్సులో - బి.ఎస్.ఎన్.ల్., సి.ఎం.డి., శ్రీ పి.కె. పూర్వార్; భారతీ ఎయిర్‌టెల్, సి.ఈ.ఓ., శ్రీ గోపాల్ విట్టల్; ఉత్తర ప్రదేశ్, గ్రామీణాభివృద్ధి శాఖ, ఏ.సి.ఎస్., శ్రీ మనోజ్ కుమార్ సింగ్; ఐఐటి మద్రాస్, సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఎ. వీరరాఘవన్; హైదరాబాద్ లోని విశ్వ సముద్రం ఇంజనీరింగ్ సంస్థ సి.ఈ.ఓ., శ్రీ వి.శ్రీనివాస్ వంటి ప్రముఖ వక్తలు పాల్గొని,  బ్రాడ్‌ బ్యాండ్ కనెక్టివిటీ మరియు గ్రామీణ రహదారుల రంగంలో అభివృద్ధి వంటి వివిధ అంశాల గురించి వివరించారు. 

ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఆర్థిక, సామాజిక లేదా ఆర్థికాభివృద్ధి తో సహా అభివృద్ధికి సంబంధించిన అన్ని కోణాలను సాధించడానికి "డిజిటల్ సాచ్యురేషన్" పునాది గా భావించడం జరిగింది. 

100 శాతం లక్ష్యాన్ని సాధించడం కోసం, భారత ప్రభుత్వ గతి శక్తి కార్యక్రమంలో భాగమైన ఖర్చు మరియు సాంకేతికత పరంగా సమర్థవంతమైన సేవలను అందించడానికి భాగస్వాములందరి కలయిక అవసరమని సూచించడం జరిగింది.   భారత్ నెట్ దాని కోసం పరపతిని పొందుతుంది, అదేవిధంగా మెరుగైన డిమాండ్ కోసం నిబంధనల ప్రకారం అప్‌ టైమ్ మరియు ఎస్.ఎల్.ఏ. నిర్ధారించడం తో సహా అన్ని గ్రామీణ, మారుమూల ప్రాంతాల ముందస్తు సంతృప్తత కోసం కూడా ఉపయోగించడం జరుగుతుంది. 

అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలలో తుది ఫలితాలను దృష్టిలో ఉంచుకోవడమే ప్రధాన లక్ష్యంగా భావించడం జరుగుతుంది.   ఆవిష్కరణల సదస్సులు గ్రామీణ నిర్దిష్ట అంశంపై కేంద్రీకృత అభివృద్ధితో పాటు, సాంకేతికతల యొక్క కొత్త అభివృద్ధి ని నిర్ధారించే కార్యకలాపాలలో ఒకటిగా ఉండవచ్చు. 

చర్చలు మరియు భాగస్వాముల సమాచారం ఆధారంగా,  ఆర్.ఓ.డబ్ల్యూ. సమస్యలు కీలక సవాళ్లు గా గుర్తించడం జరిగింది.   సింగిల్ విండో క్లియరెన్స్ ద్వారా ముందస్తు పరిష్కారం కోసం నేషనల్ పోర్టల్‌ను రూపొందించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ విభాగాలను సమీకరించడానికి ప్రయత్నాలు చేయవలసిన అవసరం ఉంది.

టెలికాం యొక్క విద్యుత్ అవసరాలు, గ్రీన్ టెలికామ్‌పై దృష్టి పెట్టడం, సేవలకు పన్ను మరియు ఫీజుల నిర్మాణం, నియంత్రణ రుసుములలో తగ్గింపుతో సహా సరఫరా వైపు మరియు డిమాండ్ వైపు పరిమితులపై దృష్టి పెట్టవలసిన అవసరాన్ని పరిశ్రమ నిపుణులు సూచించారు.  గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌ బ్యాండ్‌ ప్రారంభించడానికి డిపార్ట్‌మెంట్ అమలు వ్యూహంలో ఈ విలువైన అభిప్రాయంతో పాటు, వివిధ భాగస్వాముల నుండి తగిన సమాచారం కూడా ఉంది. 

వెబినార్ చూసేందుకు యూట్యూబ్ లింక్:-

https://www.youtube.com/watch?v=903od7dTxHs

 

 

 

*****



(Release ID: 1800719) Visitor Counter : 133