మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

పిల్లల సంక్షేమం కోసం రూపొందించిన పిఎం కేర్స్ పథకం 28 ఫిబ్రవరి, 2022 వరకు పొడిగింపు

Posted On: 22 FEB 2022 2:43PM by PIB Hyderabad

పిల్లల సంక్షేమం కోసం రూపొందించిన పిఎం కేర్స్ పథకాన్ని 28 ఫిబ్రవరి, 2022 వరకు అమలు చేయాలని కేంద్ర  మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. పథకం గడువును 28 ఫిబ్రవరి, 2022 వరకు పొడిగిస్తూ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకాన్ని 31 డిసెంబర్ 2021 వరకు అమలు చేయాలని భావించారు. పథకం గడువును పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల  ముఖ్య కార్యదర్శులు/ కార్యదర్శులుమహిళా మరియు శిశు అభివృద్ధిసామాజిక న్యాయం  సాధికారత విభాగాలకు సమాచారం పంపింది.   అవసరమైన చర్యలు అమలు చేసేందుకు అన్ని జిల్లా మేజిస్ట్రేట్‌లు/జిల్లా కలెక్టర్‌లకు కూడా వర్తమానం పంపింది  (Click here to see letter).

 పిఎమ్ కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం  ప్రయోజనాలు పొందేందుకు అర్హత ఉన్న పిల్లలందరూ ఇప్పుడు 28 ఫిబ్రవరి 2022 వరకు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. కోవిడ్‌ 19 మహమ్మారి కారణంగా i) తల్లిదండ్రులు లేదా ii) జీవించి ఉన్న తల్లిదండ్రులు లేదా iii) చట్టపరమైన సంరక్షకులు/దత్తత తీసుకున్న తల్లిదండ్రులు/ఒకే దత్తత తీసుకున్న తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్‌ 19 మహమ్మారి ప్రారంభమైనదని  ప్రకటించిన 11.03.2020 నుంచి 28.02.2022 వరకు పథకం అమలులో ఉంటుంది.  ఈ పథకం కింద ప్రయోజనాలు పొందేందుకు తల్లిదండ్రులు మరణించిన తేదీ నాటికి పిల్లల వయస్సు 18 సంవత్సరాలు మించి ఉండకూడదు.

 

 కోవిడ్ 19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను   కోల్పోయిన పిల్లలను ఆదుకోవాలన్న లక్ష్యంతో   ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 మే 21వ తేదీన  సమగ్ర సాయాన్ని అందిస్తామని ప్రకటించారు.  కోవిడ్ మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సమగ్ర సంరక్షణ మరియు రక్షణ అందించడంఆరోగ్య బీమా ద్వారా వారి శ్రేయస్సును కొనసాగించడంవిద్య ద్వారా వారిని శక్తివంతం చేయడం మరియు స్వయం సమృద్ధి కోసం వారిని సన్నద్ధం చేయాలన్న లక్ష్యాలతో ఈ పథకానికి రూపకల్పన జరిగింది.  23 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు  తల్లిదండ్రులను   కోల్పోయిన పిల్లలకు   ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది.  తల్లిదండ్రులను  కోల్పోయిన పిల్లలకు ఒక సమగ్ర విధానంలో విద్యఆరోగ్యం అవసరాలకు అవసరమైన ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది.  18 సంవత్సరాల వయస్సు నుంచి నెలవారీ స్టైఫండ్ అందించడంతో పాటు ఏక మొత్తంలో 23 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి 10 లక్షల రూపాయలను అందిస్తారు.

 

 ఈ పథకాన్ని ఆన్‌లైన్ పోర్టల్ https://pmcaresforchildren.in  లో చూడవచ్చు.  28 ఫిబ్రవరి, 2022 వరకు పోర్టల్‌లో అర్హులైన పిల్లలను గుర్తించినమోదు చేయాలని అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల యంత్రాంగాలకు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏ పౌరుడైనా ఈ పథకం కింద సహకారం పొందేందుకు అర్హత ఉన్న పిల్లల వివరాలను పరిపాలనా యంత్రాంగానికి పోర్టల్ ద్వారా తెలియజేయవచ్చు.

 

(Click here to see detailed Scheme Guidelines)

 

***



(Release ID: 1800401) Visitor Counter : 271