ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తరాఖండ్ లోని చంపావత్ లో జరిగిన ఒక రహదారి దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


బాధితుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుందనిప్రకటించారు

प्रविष्टि तिथि: 22 FEB 2022 12:32PM by PIB Hyderabad

ఉత్తరాఖండ్ లోని చంపావత్ లో జరిగిన ఒక రహదారి దుర్ఘటన లో ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. బాధితుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి’ (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుందని కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘ఉత్తరాఖండ్ లోని చంపావత్ లో జరిగిన దుర్ఘటన హృదయ విదారకం గా ఉంది. ఈ ప్రమాదం లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు నేను నా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. స్థానిక పాలన యంత్రాంగం ఉపశమనకారి మరియు రక్షణ కార్యకలాపాల లో తలమునకలైంది: ప్రధాన మంత్రి’’

‘‘ఉత్తరాఖండ్ లో ఒక దుర్ఘటన కారణం గా ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని ప్రధాన మంత్రి శ్రీ @narendramodi ప్రకటించారు. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది.’’ అని పేర్కొంది.

***

DS/SH

 

 

 


(रिलीज़ आईडी: 1800273) आगंतुक पटल : 164
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam