నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ

బడ్జెట్ కు ముందు సదస్సు : "బలమైన పరిశ్రమ-నైపుణ్య అనుసంధానాన్ని పెంపొందించడం"

Posted On: 20 FEB 2022 12:46PM by PIB Hyderabad

విద్య, నైపుణ్యాలు సరిగ్గా అందుబాటులోకి రావడాన్ని విస్తరించడం, నాణ్యమైన విద్యను మెరుగుపరచడం, సామర్థ్యాన్ని పెంపొందించడం, డిజిటల్ నైపుణ్య పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం పై, విద్య, నైపుణ్య రంగానికి సంబంధించిన బడ్జెట్-2022 దృష్టి సారించింది.  అదేవిధంగా, బడ్జెట్‌ లో ప్రకటించిన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి తగిన మార్గాల పై మేధోమథనం చేసి, చర్చించడం కోసం, స్కిల్-ఇండియా వెబినార్ లో భాగంగా, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వశాఖ (ఎం.ఎస్.డి.ఈ) మరియు విద్యా మంత్రిత్వ శాఖ, ఇతర మంత్రిత్వ శాఖలతో కలిసి,  'బలమైన పరిశ్రమ-నైపుణ్య అనుసంధానాన్ని పెంపొందించే దిశగా...' అనే ఇతివృత్తంతో, 2022 ఫిబ్రవరి, 21వ తేదీ, సోమవారం, మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల నుండి 2 గంటల 15 నిమిషాల వరకు ఒక సదస్సును  నిర్వహిస్తోంది. వెబినార్‌ కు ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల నిపుణులు, కీలక సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారు.  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తున్న వరుస సదస్సుల్లో భాగంగా ఈ వెబినార్ ను ఏర్పాటు చేయడం జరిగింది.  'డిజిటల్ విశ్వవిద్యాలయం: ప్రపంచ స్థాయి ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం' అనే అంశంపై జరిగిన మొదటి వెబినార్‌ లో ప్రధానమంత్రి ప్రసంగించనున్నారు.

స్కిల్-ఇండియా వెబినార్ కు సహ-అధ్యక్షులుగా  కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, కార్యదర్శి, శ్రీ అరవింద్ సింగ్;  ఎం.ఎస్.డి.ఈ., కార్యదర్శి, శ్రీ రాజేష్ అగర్వాల్;  డి.పి.ఐ.ఐ.టి., కార్యదర్శి, శ్రీ అనురాగ్ జైన్ వ్యవహరిస్తారు. కాగా, ఈ సదస్సుకు జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ, సి.ఓ.ఓ., శ్రీ  వేద్ మణి తివారీ సమన్వయ కర్త గా వ్యవహరిస్తారు. 

 

ఈ సదస్సులో పాల్గొంటున్న విషయ నిపుణులు: 

*     జాతీయ వృత్తి విద్య, శిక్షణా మండలి, చైర్మన్,  శ్రీ ఎన్.ఎస్. కల్సి; 

*     పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి, శ్రీ అంబర్ దూబే, 

*     టీమ్‌లీజ్ సర్వీసెస్. ఉపాధ్యక్షులు, శ్రీ మనీష్ సబర్వాల్. 

డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా నైపుణ్య పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంపై, పలు  విస్తృత అంశాలను ఈ సదస్సులో చర్చించనున్నారు.  డిజిటల్ శిక్షణ ద్వారా ప్రజలకు నైపుణ్యం, పునరుద్ధరణ లేదా నైపుణ్యాన్ని పెంపొందించేలా చేయడం లక్ష్యంగా డి.ఈ.ఎస్.హెచ్. స్టాక్ పై చర్చలతో సహా, బడ్జెట్‌-2022 లో మన ఆర్థిక మంత్రి చేసిన ఇటీవలి ప్రకటనలపై విషయ నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకుంటారు.   అదేవిధంగా, క్రియాశీల పరిశ్రమ అవసరాలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల విస్తరణ, డ్రోన్ శక్తి పథకం ద్వారా శిక్షణ, దేశీయ తయారీ ని పెంపొందించడం, ఉపాధిని సృష్టించడం లక్ష్యంగా ఏర్పాటైన జాతీయ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌ వర్క్ (ఎన్.ఎస్.క్యూ.ఎఫ్) ని విజయవంతంగా అమలు చేయడానికి సంబంధించిన అంశాలపై కూడా ఈ సదస్సులో చర్చించనున్నారు.  ప్రధానమంత్రి గతి శక్తి కార్యక్రమానికి సంబంధించిన అంశాలను కూడా ఈ సదస్సులో చర్చించనున్నారు.  పర్యాటకం, సరకు రవాణా వంటి రంగాలపై కూడా ఈ సదస్సు దృష్టి సారిస్తుంది.

ఈ సదస్సులో భాగంగా పరస్పరం అభిప్రాయాలు పంచుకునేందుకు పాల్గొంటున్న ప్రముఖులు: 

1.       జియోక్నో, సి.ఓ.ఓ., కల్నల్ పంకజ్ ఫోతేదార్; 

2.       డబ్ల్యూ.ఓ.డబ్ల్యూ. ఫ్యాక్టర్స్ ఇండియా, మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ శంకర్ గోయెంకా;

3.       ఏరోస్పేస్ & ఏవియేషన్ ఎస్.ఎస్.సి., సి.ఈ.ఓ., రచిత్ భట్నాగర్;

4.       క్లియర్ స్కైస్ ఏవియేషన్ ఓ.పి.సి. ప్రయివేట్ లిమిటెడ్, సి.ఈ.ఓ., కెప్టెన్ గౌరవ్ నాథ్;

5.       డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, భాగస్వామ్య డైరెక్టర్, స్మిత్ షా;

6.       బెక్న్ ఫౌండేషన్, సుజిత్ నాయర్;

7.        ఏక్‌ స్టెప్ ఫౌండేషన్, ఆనంద్ గౌతమ్; 

8.       ప్రొటీన్ ఈ-గోవ్ టెక్నాలజీస్ లిమిటెడ్, సుజీత్ సూర్యవంశీ;

9.       ఐ.ఐ.టి. కాన్పూర్, డైరెక్టర్, అభయ్ కరాండీకర్;

10.     అగ్రికల్చర్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సి.ఈ.ఓ., డాక్టర్ సతేందర్ ఆర్య. 

ఈ వెబినార్‌ లో పాల్గొనే మంత్రిత్వ శాఖలు, విభాగాలు :-

 

*     విద్యా మంత్రిత్వ శాఖ (ఎం.ఓ.ఈ) పరిధిలోని ఉన్నత విద్యా శాఖ; 

*     పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం;  

*     నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వశాఖ (ఎం.ఎస్.డి.ఈ); 

*     ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ; 

*     గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ;

*     పౌర విమానయాన మంత్రిత్వ శాఖ;

*     పరిశ్రమలు, స్వదేశీ వాణిజ్య అభివృద్ధి విభాగం;

*     టెలికాం శాఖ;

*     భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియోఇన్ఫర్మేటిక్స్ (బి.ఐ.ఎస్.ఏ.జి-ఎన్);

*     పర్యాటక మంత్రిత్వ శాఖ;

*     ఆర్థిక వ్యవహారాల శాఖ;

*     విద్యాసంస్థలు; 

*     సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ.

సదస్సులో పాల్గొనడానికి దయచేసి  ఈ లింకు "క్లిక్" చెయ్యండి  :  https://youtu.be/RAk0cgw8itY

*****



(Release ID: 1799913) Visitor Counter : 125