ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోడిడ్-19 : వాస్తవాలు vs అసత్య ప్రచారాలు
ఐపిఓ కోసం ఎల్‌ఐసి విడుదల చేసిన వివరాలు దేశంలో 2021లో భారీ మరణాల సంఖ్యను నిర్ధారిస్తున్నాయంటూ మీడియా కథనాలు ఊహాజనితమైన గా వాస్తవం విరుద్ధంగా ఉన్నాయి
प्रविष्टि तिथि:
19 FEB 2022 12:47PM by PIB Hyderabad
ఎల్‌ఐసి జారీ చేసే ప్రతిపాదిత ఐపిఓలకు సంబంధించి విడుదల చేసిన వివరాలను ఆధారంగా చేసుకుని ఊహాజనితమైన, నిరాధారమైనవ ఒక మీడియా కథనం ప్రచురించబడింది. ఎల్‌ఐసి పరిష్కరించిన పాలసీలు, క్లెయిమ్‌లను ఉటంకిస్తూ దేశంలో కోవిడ్ -19 సంబంధిత మరణాల సంఖ్య . అధికారికంగా నమోదైన సంఖ్య కంటే ఎక్కువగా ఉందని ఈ మీడియా కథనంలో పేర్కొనడం జరిగింది. ఈ మీడియా కథనం ఊహాజనితంగా పక్షపాతంతో నిరాధారంగా ఉందని స్పష్టం చేయబడింది.
ఎల్‌ఐసి పాలసీలు తీసుకున్నవారు వివిధ కారణాల వల్ల మరణిస్తున్నారు. ఎల్‌ఐసి పరిష్కరించిన అన్ని క్లెయిమ్‌లు అనేక కారణాల వల్ల మరణించినవరు తీసుకున్న లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించినవి. అయితే, వీటిని ఆధారంగా చేసుకుని కోవిడ్ మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపించినట్టు మీడియా కథనంలో విశ్లేషించడం జరిగింది. ఈ విశ్లేషణ లోపభూయిష్టంగా ఉంది. ఈ వివరణ వాస్తవాలపై ఆధారపడి జరగలేదు. రచయిత పక్షపాత వైఖరికి అద్దం పట్టే విధంగా ఉంది. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి భారతదేశంలో కోవిడ్-19 మరణాలు ఎలా సంకలనం చేయబడ్డాయి మరియు ప్రతిరోజూ పబ్లిక్ డొమైన్‌లో ప్రచురించబడుతున్నాయనే అంశంపై రచయితకు అవగాహన లేదని ఇది వెల్లడిస్తుంది.
కోవిడ్-19 మరణాలను నమోదు చేసేందుకు భారతదేశం స్పష్టమైన, పారదర్శకమైన, సమర్థవంతమైన వ్యవస్థను కలిగి ఉంది. గ్రామ పంచాయతీ స్థాయి నుంచి జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి వరకు, మరణాలను నివేదించే ప్రక్రియను పర్యవేక్షించడం మరియు పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుంది. కోవిడ్ మరణాలను పారదర్శకంగా నమోదు చేయాలనే ఏకైక లక్ష్యంతో కోవిడ్ మరణాలను వర్గీకరించడానికి భారత ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వర్గీకరణ నమూనాను అనుసరిస్తోంది. ఈ నమూనాలో రాష్ట్రాల నుంచి అందే స్వతంత్ర నివేదికల ఆధారంగా భారతదేశంలో మొత్తం మరణాల సంకలనాన్ని కేంద్రం చేపట్టింది.
అంతేకాకుండా, మహమ్మారికి సంబంధించి స్పష్టమైన సమాచారాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని అనుసరించింది. కోవిడ్-19 నివారణకు ప్రజారోగ్య ప్రతిస్పందన కార్యక్రమాన్ని అమలు చేసేందుకు వాస్తవ గణాంకాలను అందించాలని రాష్ర్టాలకు కేంద్రం ప్రభుత్వం అనేకసార్లు సూచించడం జరిగింది. దీనికి స్పందించిన రాష్ర్టాలు తాజా నివేదికలు అందించాయి. దీనితో పాటుగా, కోవిడ్ మరణాలను సక్రమంగా నమోదు చేసేందుకు భారతదేశంలో అమలు చేస్తున్న పథకం దోహదపడిందని ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయినవారికి దేశంలో నగదు రూపంలో పరిహారాన్ని చెల్లించడం జరుగుతోంది. దీనివల్ల మరణాలను తక్కువగా చూపే అవకాశం మరింత తక్కువగా ఉంటుంది. అందువల్ల, మరణాలు తక్కువగా నివేదించడం గురించి ఏదైనా నిర్ధారణకు రావడం అనేది కేవలం ఊహాగానాలు మాత్రమే. వీటిలో ఎటువంటి వాస్తవం లేదని గుర్తించాల్సి ఉంటుంది.
మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ప్రజలందరికి మొత్తం ప్రభుత్వ విధానంలో పారదర్శక మరియు జవాబుదారీతనంతో కూడిన ప్రజారోగ్య ప్రతిస్పందనను అందించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు రూపొందించి అమలు చేసింది. భారతదేశంలో కోవిడ్-19 నిర్వహణకు అమలు చేసిన విధానంలో కోవిడ్-19 కారణంగా సంభవించిన మరణాలను పారదర్శకంగా నమోదు చేయడం అనే అంశానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. రోజువారీ మరణాలను పర్యవేక్షించి , మరణాలు నమోదు చేసేందుకు పటిష్టమైన యంత్రాంగాన్ని అమలు చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్రమం తప్పకుండా చెబుతూ వస్తోంది. దీనిలో భాగంగా కోవిడ్ నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్గదర్శకాలను జారీ చేస్తుంది. దీనికి అదనంగా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు వివిధ వేదికలు, అధికారిక వర్తమానాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు మరియు నిర్దేశించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. మరణాలు సక్రమంగా నమోదు అయ్యేలా చూసేందుకు కేంద్ర బృందాలను రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు పంపడం జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన ఐసిడి-10 కోడ్‌ల ప్రకారం అన్ని మరణాలు సరైన విధంగా నమోదు అవుతున్నాయి. దీనికోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కూడా 'భారతదేశంలో కోవిడ్-19 సంబంధిత మరణాల నమోదు కోసం మార్గదర్శకాలు' జారీ చేసింది.
వాస్తవాలను, దేశంలో నెలకొన్న సున్నిత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మరణాలకు సంబంధించిన వార్తలను ప్రచురించే సమయంలో బాధ్యత తో వ్యవహరించాల్సి ఉంటుంది. కోవిడ్ -19 మహమ్మారి వంటి ప్రపంచ ప్రజారోగ్య సంక్షోభం సమయంలో మరణం అనేది సున్నితమైన సమస్యగా ఉంటుందని గ్రహించి పనిచేయాల్సి ఉంటుంది. వాస్తవాలను ప్రచురించి ప్రజలకు ధైర్యం కలిగించేందుకు ప్రతి ఒక్కరి బాధ్యత గా ఉంటుంది.
భారతదేశంలో పటిష్టమైన సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సిఆర్ఎస్) మరియు సేంపుల్ నమోదు వ్యవస్థ (ఎస్‌ఆర్‌ఎస్) అమలులో ఉంది. ఇది కోవిడ్-19 మహమ్మారికి ముందు కూడా అమలులో ఉంది. అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో ఇది అమలులో ఉంది. దేశంలో చట్టపరంగా కూడా మరణాలను తప్పనిసరిగా నమోదు చేయవలసి ఉంటుందని ఇక్కడ గుర్తించాలి. రాష్ట్ర ప్రభుత్వాలచే నియమించబడిన కార్యనిర్వాహకులచే జనన మరియు మరణాల నమోదు చట్టం (ఆర్‌బిడి చట్టం, 1969) కింద రిజిస్ట్రేషన్ చేయబడుతుంది. కాబట్టి, సిఆర్ఎస్ రూపొందించే సమాచార వివరాలు అత్యంత విశ్వసనీయతను కలిగి ఉంటాయి. అధికారిక సమాచారం ఆధారంగా కాకుండా ప్రామాణీకరించని సమాచారం ఆధారంగా వార్తలు ప్రచురించవద్దని సూచించడం జరిగింది.
***
(रिलीज़ आईडी: 1799631)
आगंतुक पटल : 186