విద్యుత్తు మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా పబ్లిక్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను విస్తరిస్తున్న భారత ప్రభుత్వం


ప్రభుత్వ ప్రయత్నాల ఫలితంగా గత నాలుగు నెలల్లో 9 మెగా సిటీల్లో ఛార్జింగ్ స్టేషన్లు 2.5 రెట్లు పెరిగాయి.

ఈ 9 నగరాల్లో అక్టోబర్ 2021 నుండి జనవరి 2022 మధ్య 678 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌ల అదనపు ఇన్‌స్టాలేషన్

ప్రస్తుతం భారతదేశంలోని 1640 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లో 940 ఛార్జింగ్ స్టేషన్లు 9 నగరాల్లో ఉన్నాయి

దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాలు మరియు హైవేలలో 22,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌లను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఏర్పాటు చేయనున్నాయి.

Posted On: 19 FEB 2022 9:13AM by PIB Hyderabad

విద్యుత్ మంత్రిత్వ శాఖ ఇటీవల జనవరి 14, 2022న ఈవీ ఛార్జింగ్‌ల ఏర్పాటుకు సవరించిన ఏకీకృత మార్గదర్శకాలు మరియు ప్రమాణాలను జారీ చేసింది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ మరియు స్వీకరణను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది. దీంతో పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో గణనీయమైన విస్తరణతో, ఎలక్ట్రిక్ వాహనాలు భారతీయ మార్కెట్లోకి చొచ్చుకుపోవటం ప్రారంభించాయి.

ప్రైవేట్ మరియు పబ్లిక్ ఏజెన్సీలు (బీఈఈ, ఈఈఎస్ఎల్,పిజిసిఐఎల్,ఎన్టీపీసీ మొదలైనవి) పాల్గొనడం ద్వారా పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రయత్నాలు చేసింది. వినియోగదారుల విశ్వాసాన్ని పొందేందుకు అనుకూలమైన ఛార్జింగ్ నెట్‌వర్క్ గ్రిడ్‌ను అభివృద్ధి చేయడానికి అనేక ప్రైవేట్ సంస్థలు కూడా ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయి. విద్యుత్ మంత్రిత్వ శాఖ (ఎంఓపీ) ఛార్జింగ్ స్టేషన్లు 3×3 కిమీ గ్రిడ్ విస్తీర్ణంలో ఉండాలని ప్లాన్ చేసింది. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 1640 ఆపరేషనల్ పబ్లిక్ ఈవీ ఛార్జర్‌లు ఉన్నాయి. వీటిలోని  9 నగరాలు (సూరత్, పూణే, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై మరియు చెన్నై) సుమారు 940 స్టేషన్‌లను కలిగి ఉన్నాయి.

ప్రభుత్వం ఈ 9 మెగా నగరాలపై (4 మిలియన్లకు పైగా జనాభాతో) మొదట్లో తన దృష్టిని పెంచింది. వివిధ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీల ద్వారా ప్రభుత్వం చేపట్టిన  ప్రయత్నాల ఫలితంగా పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ అవస్థాపన విస్తరణలో వేగవంతమైన అభివృద్ధి జరిగింది. ఈ 9 నగరాల్లో అక్టోబర్ 2021 నుండి జనవరి 2022 మధ్యకాలంలో 678 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌ల అదనపు ఇన్‌స్టాలేషన్ జరిగింది. ఇది మునుపటి సంఖ్యలో కంటే 2.5 రెట్లు ఎక్కువ, అదే సమయంలో దాదాపు 1.8 లక్షల కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్‌లోకి వచ్చాయి. ఇది ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు మళ్లేందుకు వినియోగదారులలో ఎక్కువ విశ్వాసాన్ని ప్రదర్శించింది. ఈ మెగా నగరాల్లో ఈవీ మౌలిక సదుపాయాలు సంతృప్తి చెందిన తర్వాత, దశలవారీగా ఇతర నగరాలకు కవరేజీని విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను వేగవంతం చేయడానికి తగినంత ఛార్జింగ్ అవస్థాపన లభ్యత ప్రధాన అడ్డంకిగా ఉంది. ఈ విషయంలో విద్యుత్ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ అవస్థాపనను త్వరితగతిన అమలు చేయడం కోసం కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలో వివిధ వాటాదారుల పాత్రలు మరియు బాధ్యతలను వివరిస్తూ "ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్-మార్గదర్శకాలు మరియు ప్రమాణాలు" జారీ చేసింది.

ఇటీవల, విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ మార్గదర్శకాలు మరియు ప్రమాణాలను జనవరి 14, 2022న కింది సవరణలతో జారీ చేసింది.

i. పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఆపరేటర్లు మరియు యజమానులు మరియు ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) యజమానులు ఛార్జ్ చేయగల సరసమైన టారిఫ్‌ను అందించాలి.

ii. ఎలక్ట్రిక్ వాహనాల యజమానులు వారి నివాసాలు లేదా కార్యాలయాల వద్ద ఉన్న వారి విద్యుత్ కనెక్షన్‌లను ఉపయోగించి ఈవీలను ఛార్జ్ చేయడానికి వీలు కల్పించాలి.

iii. పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌ను కార్యాచరణ కోణం నుండి ఆర్థికంగా లాభదాయకంగా మార్చడానికి భూమి వినియోగం కోసం రెవెన్యూ షేరింగ్ మోడల్ సూచించబడింది.

iv. ఈవీ పబ్లిక్ ఛార్జింగ్‌ను వేగవంతమైన రోల్ అవుట్ కోసం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ (పిసిఎస్)కి కనెక్టివిటీని అందించడానికి టైమ్‌లైన్‌లు సూచించబడ్డాయి.

v. పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌ల కోసం సాంకేతిక అవసరాలు వివరించబడ్డాయి.

ఈ క్రమంలో చమురు మార్కెటింగ్ కంపెనీలు దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాలు మరియు జాతీయ రహదారులపై 22,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాయి. 22,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లలో ఐవీసిఎల్ ద్వారా 10,000, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్) ద్వారా  7,000  మరియు మిగిలిన 5,000 వాటిని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్) ద్వారా ఏర్పాటవుతాయి. ఐవోసీఎల్ ఇప్పటికే 439 ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌లను ఇన్‌స్టాల్ చేసింది మరియు వచ్చే ఏడాదిలో మరో 2,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌లను ఇన్‌స్టాల్ చేయాలని యోచిస్తోంది. బీపీసీఎల్ 52 ఛార్జింగ్ స్టేషన్లను, హెచ్‌పీసీఎల్ 382 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశాయి.

భారీ పరిశ్రమల శాఖ ఇటీవల 25 హైవేలు & ఎక్స్‌ప్రెస్‌వేల్లో 1576 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌లను మంజూరు చేసింది, ఇవి ఈ ఎక్స్‌ప్రెస్‌వేలు & హైవేలకు ఇరువైపులా ప్రతి 25 కి.మీ పరిధిలో ఏర్పాటవుతాయి.

 

***(Release ID: 1799626) Visitor Counter : 220