హోం మంత్రిత్వ శాఖ
అనుసంధాన న్యాయ వ్యవస్థ (ఐసిజెఎస్ ) అమలుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం
2022-23 నుంచి 2025-26 మధ్య ప్రాజెక్టు అమలుకు అనుమతి మంజూరు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ
3,375 కోట్ల రూపాయల వ్యయంతో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుగా అమలు
రెండవ దశ సమర్థవంతమైన మరియు ఆధునిక పోలీసింగ్‌ను నిర్ధారించే దిశగా కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో రూపుదిద్దుకున్నఐసిజెఎస్
Posted On:
18 FEB 2022 1:06PM by PIB Hyderabad
దేశంలో 2022-23 నుంచి 2025-26 మధ్య కాలంలో మొత్తం .3,375 కోట్ల రూపాయల వ్యయంతో ఇంటర్-ఆఫరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసిజెఎస్) ప్రాజెక్ట్ అమలుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రాజెక్టు అమలు చేస్తుంది. సమర్థవంతమైన మరియు ఆధునిక పోలీస్ వ్యవస్థను అభివృద్థి చేసేందుకు కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో రూపొందిన ఐసిజెఎస్ ప్రాజెక్ట్ రెండవ దోహదపడుతుంది. అవుతుంది. ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రాయోజిత పథకం గా అమలు చేయబడుతుంది.
హై స్పీడ్ కనెక్టివిటీతో అంకితమైన మరియు సురక్షితమైన క్లౌడ్ ఆధారిత మౌలిక సదుపాయాల ద్వారా ఐసిజెఎస్ అందుబాటులోకి వస్తుంది. ప్రాజెక్టును నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసి) సహకారంతో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి)అమలు చేస్తుంది. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల సహకారంతో ఈ ప్రాజెక్ట్ అమలు చేయబడుతుంది.
నేపథ్యం
అయిదు వ్యవస్థలను అనుసంధానం చేసి దేశంలలో శిక్ష ధర్మ నిర్ణాయక స్మృతి (క్రిమినల్ జస్టిస్) ను వేగంగా అందించేందుకు ఇంటర్-ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఎన్‌ఐసి) సహరకిస్తుంది. ప్రధాన ఐటీ వ్యవస్థను అనుసంధానం చేస్తూ కింది అయిదు వ్యవస్థలను ఏకతాటిపైకి తీసుకుని వచ్చేందుకు ఎన్‌ఐసుని జాతీయ వేదికగా అభివృద్ధి చేసేందుకు కృషి జరుగుతుంది.
1. పోలీస్ (క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ అండ్ నెట్‌వర్క్ సిస్టమ్స్),
2. ఫోరెన్సిక్ ల్యాబ్స్ కోసం ఈ-ఫోరెన్సిక్స్,
3. కోర్టుల కోసం ఈ-కోర్టులు,
4. పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ఈ-ప్రాసిక్యూషన్
5. జైళ్ల కోసం ఈ-జైళ్లు.
ఎన్‌ఐసి ప్రాజెక్ట్ దశ-Iలో వ్యక్తిగత ఐటి వ్యవస్థలను అభివృద్థి చేసి అమలు చేయడం జరిగింది. స్థిరీకరించబడిన ఈ వ్యవస్థలలో రికార్డుల శోధన కూడా ప్రారంభించబడింది.
రెండవ దశ వ్యవస్థ 'వన్ డేటా వన్ ఎంట్రీ' సూత్రంపై నిర్మించబడుతుంది దీని ద్వారా సమాచారాన్ని ఒక వ్యవస్థలో ఒకసారి మాత్రమే నమోదు చేస్తారు. మిగిలిన వ్యవస్థలలో సమాచారాన్ని తిరిగి నమోదు చేయాల్సిన అవసరం లేకుండా అన్ని ఇతర వ్యవస్థలలో అదే సమాచారం అందుబాటులో ఉంటుంది.
***
(Release ID: 1799311)
Visitor Counter : 174