యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
2024, 2028 తయారీలో జరిగే ఒలింపిక్స్ శిక్షణ కోసం 398 కోచ్‌లను, అసిస్టెంట్ కోచ్‌లను నియమించిన సాయ్
నియమించబడిన వారిలో అంతర్జాతీయ మాజీ అథ్లెట్లు, అర్జున అవార్డు గ్రహీతలు ఉన్నారు
Posted On:
16 FEB 2022 5:10PM by PIB Hyderabad
దేశంలో క్రీడల శిక్షణా కార్యక్రమాలను పటిష్టం చేసేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ చర్యలు ప్రారంభించాయి. శిక్షణ వ్యవస్థను పటిష్టం చేయాలన్న లక్ష్యంతో 21 విభాగాలలో వివిధ స్థాయిలలో కోచ్‌లుగా పనిచేయాలని ఆహ్వానిస్తూ 398 మందికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆహ్వానాలు పంపింది. వీరిలో మాజీ-అంతర్జాతీయ అథ్లెట్లు మరియు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు మరియు ఒలింపిక్స్ వంటి పోటీలలో పాల్గొని పతకాలు గెలుచుకున్నవారు అర్జున అవార్డు గ్రహీతలు ఉన్నారు. మొత్తం 398 మందిలో 101 కోచ్‌లు పిఎస్‌యులు మరియు ఇతర ప్రభుత్వ సంస్థల నుంచి డిప్యుటేషన్‌పై పనిచేస్తారు.
2024,2028 ఒలింపిక్స్ తో సహా ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు పూర్తి స్థాయి సహకారం అందించాలని యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీనిలో భాగంగా అనుభవం, అర్హతలు కలిగిన వారిని కోచ్‌లను నియమించాలని యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.కోచ్‌లుగా పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన అనేక అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించిన అథ్లెట్లకు కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ కృతజ్ఞతలు తెలిపారు. తమ అనుభవంతో అంతర్జాతీయ మాజీ అథ్లెట్లు దేశ క్రీడా రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తారని ఆయన అన్నారు. క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడంతో పాటు మానసిక దృఢత్వం కల్పిస్తారని అన్నారు. ప్రపంచ స్థాయి పోటీల్లో పోటీ చేసినప్పుడు విజయానికి కీలకమైన మానసిక దృఢత్వం కీలకంగా ఉంటుందని శ్రీ శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు.
కొత్త బ్యాచ్ కోచ్‌లు మరియు అసిస్టెంట్ కోచ్‌ల జాబితాలో ప్రముఖ అథ్లెట్లు, అర్జున అవార్డు గ్రహీతలు ఉన్నారు. పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహీత బజరంగ్ లాల్ థాకర్ ఆసియా రోయింగ్ కోచ్‌గా చేరుతారు. 2011లో కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణం గెలిచిన శిల్పి షెరాన్ రెజ్లింగ్‌లో అసిస్టెంట్ కోచ్‌గా సేవలు అందిస్తారు. అథ్లెటిక్స్ కోచ్‌గా ఒలింపియన్ జిన్సీ ఫిలిప్, అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌లలో అనేక పతకాలు సాధించిన విజేత ప్రణమికా బోరా బాక్సింగ్ కోచ్‌గా చేరుతారు. నూతన బాధ్యతలు నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని అర్జున అవార్డు గ్రహీత బజరంగ్ లాల్ థాకర్ అన్నారు. కోచ్‌గా క్రీడలకు సేవ అందించే అవకాశం ఇచ్చిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో జరుగుతున్న వాటర్ స్పోర్ట్స్ లో పాల్గొని అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభ చూపేందుకు క్రీడాకారులకు అవకాశం కలుగుతుందని బజరంగ్ లాల్ థాకర్ అన్నారు."నేను ఆసియా క్రీడల కోసం జట్టుకు శిక్షణ ఇస్తున్నాను . రానున్న ఆసియా క్రీడలలో అత్యధిక విభాగాల్లో పాల్గొనేలా చూడాలి. దీనివల్ల మన దేశం ఎక్కువ పథకాలు సాధించగలుగుతుంది" అని ఆయన అన్నారు. జగత్‌పురా, అలెప్పిలోసాయ్ నెలకొల్పిన నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌తో భారతదేశంలో వాటర్ స్పోర్ట్స్‌కు అదనపు సౌకర్యాలు వచ్చాయని అన్నారు.
వివిధ స్థానాలకు ఎంపికైన వారిలో 4 మంది అర్జున అవార్డు గ్రహీతలు, 1 ధ్యాన్‌చంద్ అవార్డు గ్రహీత మరియు 1 ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఉన్నారు. మాజీ-అంతర్జాతీయ అథ్లెట్లతో పాటు పాటియాలా నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ లేదా గుర్తింపు పొందిన భారతీయ లేదా విదేశీ విశ్వవిద్యాలయం నుండి స్పోర్ట్స్ కోచింగ్‌లో డిప్లొమా పూర్తి చేసిన వారు కూడా వీరిలో. గతంలో కాంట్రాక్ట్‌పై ఉన్న అనేక మంది సాయ్ కోచ్‌ల కాంట్రాక్టులు ముగిసాయి. అయితే, అర్హత ప్రకారం వారు తిరిగి సర్వీస్‌లో నియమించబడ్డారు.
***
(Release ID: 1798876)
Visitor Counter : 135