హోం మంత్రిత్వ శాఖ
పోలీసు బలగాల ఆధునీకరణ పథకం కొనసాగింపుకు ఆమోదం తెలిపిన ప్రధానమంత్రి , శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం
రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు బలగాల ఆధునీకరణ మరియు పనితీరును మెరుగుపరచడానికి కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా రూపొందించిన పథకం
2021-22 నుంచి 2025-26 వరకు 26,275 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో అమలు కానున్న పథకం
Posted On:
13 FEB 2022 11:02AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పోలీసు బలగాల ఆధునీకరణ (ఎంపిఎఫ్ ) పథకాన్ని కొనసాగించడానికి ఆమోదం తెలిపింది. 2021-22 నుంచి 2025-26 మధ్య కాలంలో పథకం అమలు జరుగుతుంది, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు బలగాల ఆధునీకరణ మరియు పనితీరును మెరుగు పరచాలన్న లక్ష్యంతో కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా పథకానికి రూపకల్పన చేశారు. పధకాన్ని అమలు చేసేందుకు అవసరమైన.26,275 కోట్ల రూపాయలను కేంద్ర నిధుల నుంచి సమకూర్చడం జరుగుతుంది. బలాలను ఆధునీకరించి వాటి సామర్థ్యం పెంపొందించేందుకు అవసరమైన అన్ని సంబంధిత ఉప పథకాలను దీనిలో భాగంగా అమలు చేయడం జరుగుతుంది.
పథకం ముఖ్య అంశాలు:
1. దేశంలో పటిష్టమైన ఫోరెన్సిక్ వ్యవస్థను అభివృద్ధి చేయడం ద్వారా నేర న్యాయ వ్యవస్థను పటిష్టం చేయడం కోసం పథకంలో చర్యలు అమలవుతాయి. అంతర్గత భద్రత, శాంతిభద్రతలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు, మాదకద్రవ్యాల నియంత్రణలో రాష్ట్రాలకు తగిన సహకారం అందించేందుకు పథకంలో భాగంగా చర్యలను అమలు చేయబడతాయి.
2.కేంద్ర ప్రభుత్వం అందించే 4,846 కోట్ల రూపాయల నిధులతో రాష్ట్ర పోలీసు బలగాల ఆధునీకరణ పథకం అమలు జరుగుతుంది.
3. ఆధునిక పద్ధతుల్లో శాస్త్రీయ మరియు సమయానుకూల పరిశోధనకు దోహదపడే విధంగా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో స్వతంత్ర కార్యాచరణతో ఫోరెన్సిక్ సైన్సెస్ సౌకర్యాలు అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఫోరెన్సిక్ సౌకర్యాల ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం 2,080.50 కోట్ల రూపాయలను సమకూరుస్తుంది.
4. కేంద్ర పాలిత ప్రాంతాలు అయిన జమ్మూకాశ్మీర్, తిరుగుబాటు ప్రభావిత ఈశాన్య రాష్ట్రాలు మరియు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో భద్రత సంబంధిత అంశాల కోసం కేంద్ర ప్రభుత్వం 18,839 కోట్ల రూపాయలను కేటాయించేందుకు ఆమోదం తెలిపింది.
5. వామపక్ష తీవ్రవాద సమస్యలను నివారించేందుకు అమలు చేసిన జాతీయ విధానం, కార్యాచరణ కార్యక్రమం తో హింసాత్మక సంఘటనలు గణనీయంగా తగ్గాయి. ఈ కార్యక్రమాన్ని మరికొంత కాలం అమలు చేయాలని నిర్ణయించడం జరిగింది. దీనికోసం 8,689 కోట్ల రూపాయలను సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. కేంద్ర నిధులతో వామపక్ష తీవ్రవాద సమస్య పరిష్కారానికి ఆరు సంబంధిత పథకాలు ఆమోదించబడ్డాయి. వామపక్ష తీవ్రవాద ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాలలో కార్యక్రమాలను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కేంద్ర సహాయంగా అందించే నిధులతో అమలయ్యే పథకాలు దీనిలో భాగంగా ఉంటాయి.
6. ఇండియా రిజర్వ్ బెటాలియన్లు/స్పెషలైజ్డ్ ఇండియా రిజర్వ్ బెటాలియన్లను నెలకొల్పేందుకు 350 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది.
7. మాదకద్రవ్యాల నియంత్రణ కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 50 కోట్ల రూపాయలతో అమలు జరుగుతున్న కేంద్ర పథకం కొనసాగుతుంది.
***
(Release ID: 1798036)
Visitor Counter : 227