సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
దివ్యాంగులు మరియు వయోవృద్ధల కోసం 'సామాజిక అధికారిత శివర్' & 'ఇంటిగ్రేటెడ్ మొబైల్ సేవల వ్యాన్'ను ప్రారంభించనున్న సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ
Posted On:
12 FEB 2022 2:45PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఏఐడీపీ పథకం కింద 'దివ్యాంగజన్'కి తగిన సాయం, సహాయ పరికాలను అందించేందుకు గాను 'సామాజిక అధికారిత శివర్' కార్యక్రమాన్ని చేపట్టింది. 'రాష్ట్రీయ వయోశ్రీ యోజనస (ఆర్‌వీవై పథకం) కింద వయోవృద్ధులకు సహాయాలు మరియు సహాయక పరికరాల పంపిణీ కోసం 'సామాజిక అధికార శివిర్'ను డిపార్ట్‌మెంట్
నిర్వహిస్తుంది. ఏఎల్ఐఎంసీఓ,ఛతర్‌పూర్ జిల్లా పాలనా వ్యవస్థతో కలిసి వీటిని ప్రారంభింనుంది. రేపు (13.02.2022 ) మధ్యాహ్నం 12 గంటలకు మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్, నెం.1లోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో వికలాంగుల సాధికారత (డీఈపీడబ్ల్యూడీ) డిపార్ట్‌మెంట్ వారి సౌజన్యతో దీనిని ఏర్పాటు చేయనున్నారు. మొత్తం రూ.2.33 కోట్ల విలువైన 5286 సహాయాలు మరియు సహాయక పరికరాల
ఉచితంగా పంపిణీ చేయబడతాయి. కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా డిపార్ట్‌మెంట్ రూపొందించిన ఎస్ఓపీని
అనుసరిస్తూ బ్లాక్/పంచాయతీ స్థాయిలలో 1391 మంది దివ్యాంగులకు, 553 మంది సీనియర్ సిటిజన్‌లకు ఉచితంగా ఇవి పంపిణీ చేయబడతాయి. గౌరవనీయులైన కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు, ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి "ఆఫ్టర్-సేల్ సర్వీస్" అందించడానికి అలిమ్‌కో అభివృద్ధి చేసిన 'ఇంటిగ్రేటెడ్ మొబైల్ సర్వీస్ డెలివరీ వ్యాన్'ని కూడా ప్రారంభిస్తారు. ప్రభుత్వ ఏడీఐపీ/ఆర్‌వీవై పథకం కింద పంపిణీ చేయబడుతున్న ఎయిడ్స్ మరియు సహాయక పరికరాల కోసం గమ్యస్థానంలో ఉన్న ప్రదేశంలో మరమ్మత్తులు/దిద్దుబాటు/సర్దుబాటు మరియు ప్రాస్తెటిక్స్ మరియు ఆర్థోటిక్స్ పరికరాలను అమర్చడం మరియు ఎయిడ్స్ మరియు సహాయక పరికరాల వినియోగంపై అవగాహన ప్రచారాన్ని చేపట్టడం. భారతదేశంలో, దివ్యాంగులు మరియు సీనియర్ సిటిజన్‌లకు ఇటీవలి కాలంలో సహాయాలు మరియు సహాయక పరికరాలను వివిధ జిల్లాల్లో.పంపిణీ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ శ్రీ ప్రదుమ్‌న్ సింగ్ లోధి మరియు ఎమ్మెల్యే, బదమల్హేరా, మధ్యప్రదేశ్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు.
అలిమ్‌కో సంస్థ సీఎండీ శ్రీ రాజన్ సెహగల్ మరియు ఆ సంస్థ సీనియర్ అధికారులు, జిల్లా పరిపాలన అధికారలు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
***
(Release ID: 1797976)
Visitor Counter : 226