నౌకారవాణా మంత్రిత్వ శాఖ

తీర‌ప్రాంత జ‌ల‌మార్గాల ద్వారా స‌రుకు ర‌వాణా

Posted On: 08 FEB 2022 2:23PM by PIB Hyderabad

జ‌ల మార్గాల ద్వారా ర‌వాణాను ప్రోత్స‌హించ‌డానికి ప్ర‌భుత్వం చేసిన ప్ర‌య‌త్నాల ఫ‌లితంగా లోత‌ట్టు జ‌ల ర‌వాణా, తీర ప్రాంత జ‌ల‌మార్గాల ద్వారా స‌రుకు ర‌వాణా పెరిగింది. జాతీయ జ‌ల‌మార్గాలు (నేష‌న‌ల్ వాట‌ర్‌వేస్ -ఎన్‌డ‌బ్ల్యుస్‌)తో అనుసంధానం అయిన తీర‌ప్రాంత జ‌ల‌మార్గాలు (కోస్ట‌ల్ వాట‌ర్‌వేస్‌) స‌హా జాతీయ జ‌ల మార్గాల ద్వారా స‌రుకు క‌ద‌లిక 2014-15 నుంచి 2020-21 మ‌ధ్య కాలంలో 2.76 రెట్లు వృద్ధిని న‌మోదు చేసింది.
జాతీయ జ‌ల‌మార్గాల ద్వారా ఐడ‌బ్ల్యుటి 2009-10 నుంచి 2013-14 మ‌ధ్య కాలంలో వృద్ధి రేటు 1.5% గా ఉంది.  కాగా, 2019-20తో పోలిస్తే 2020-21లో వృద్ధి రేటు 13.5%గా ఉంది. 
ఈ స‌మాచారాన్ని కేంద్ర ఓడ‌రేవులు, షిప్పింగ్‌, జ‌ల‌మార్గాల మంత్రి శ్రీ స‌ర్బానంద‌ సోనోవాల్ రాజ్య‌స‌భ‌లో లిఖిత‌పూర్వ‌కంగా మంగ‌ళ‌వారం ఇచ్చిన స‌మాధానం ద్వారా వెల్ల‌డించారు. 

 

***
 



(Release ID: 1796672) Visitor Counter : 94