గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇప్పటివరకు 1,88,507 కోట్ల రూపాయల విలువైన 6,721 ప్రాజెక్టులకు టెండర్లు వేసిన - స్మార్ట్ సిటీలు

నాడు పోస్టు చేయడమైనది: 07 FEB 2022 3:34PM by PIB Hyderabad

ఈ రోజు రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు, కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పురి, లిఖిత పూర్వక సమాధానమిస్తూ, భారత ప్రభుత్వం 2015 జూన్, 25వ తేదీన స్మార్ట్-సిటీస్-మిషన్ (ఎస్.సి.ఎం) ని ప్రారంభించినట్లు తెలియజేశారు.  2016 జనవరి నుంచి 2018 జూన్ వరకు 4 దశల్లో నిర్వహించిన పోటీల ద్వారా వంద స్మార్ట్ సిటీలను ఎంపిక చేయడం జరిగింది.  ఎస్.సి.ఎం. మార్గదర్శకాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం ఈ నగరాలకు, ఐదు సంవత్సరాల వ్యవధిలో 48,000 కోట్ల రూపాయల మేర ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.  అంటే, ఒక నగరానికి సంవత్సరానికి సగటున 100 కోట్ల రూపాయల మేర అందజేస్తుంది. అదేవిధంగా, రాష్ట్ర ప్రభుత్వం / పట్టణ స్థానిక సంస్థ (యు.ఎల్.బి) కూడా సమాన మొత్తాన్ని జమ చేస్తుంది.

2022 జనవరి 21వ తేదీ నాటికి, ఈ స్మార్ట్ సిటీలు 1,88,507 కోట్ల రూపాయల విలువైన 6,721 ప్రాజెక్టులకు టెండర్లు ఇచ్చాయి;  వీటిలో 6,124 ప్రాజెక్టులకు సంబంధించి, 1,62,908 కోట్ల రూపాయల విలువైన వర్క్ ఆర్డర్లు జారీ చేయడం జరిగింది.   కాగా, వీటిలో 58,735 కోట్ల రూపాయల విలువైన 3,421 ప్రాజెక్టులు పూర్తయ్యాయి.  2022 జనవరి, 21వ తేదీ నాటికి, భారత ప్రభుత్వం, వంద స్మార్ట్ సిటీ ల కోసం 28,413.60 కోట్ల రూపాయలు విడుదల చేయగా, అందులో 23,668.27 కోట్ల రూపాయలు (83 శాతం) వినియోగించడం జరిగింది.  ఎస్.సి.ఎం. కింద మరిన్ని నగరాలను చేర్చే ప్రతిపాదన ఏదీ, ప్రస్తుతం, ప్రభుత్వ పరిశీలనలో లేదు.

 

*****


(రిలీజ్ ఐడి: 1796406) సందర్శకుల సూచీ సంఖ్య : : 136
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , English , Urdu , Marathi , Bengali , Tamil