ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

సార్వత్రిక వ్యాధి నిరోధక కార్యక్రమానికి ప్రాధాన్యం!


-ఐ.ఎం.ఐ.-4- ప్రారంభించిన సందర్భంగా,
కేంద్రమంత్రి మాండవీయ ప్రకటన..

“ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాధి నిరోధక
కార్యక్రమాన్ని చేపట్టిన భారత్”

“దేశానికి గొప్ప సేవలు అందిస్తున్న
ఆరోగ్యరక్షణ కార్యకర్తలు”

సార్వత్రిక వ్యాధి నిరోధక కార్యక్రమ లక్ష్యాల సాధనకు
అందరి కృషి, జనభాగస్వామ్యం అవసరం:మాండవీయ

Posted On: 07 FEB 2022 1:19PM by PIB Hyderabad

     “ప్రపంచంలోనే అతి పెద్దదైన సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాలు కార్యక్రమాన్ని(యు.ఐ.పి.ని) భారతదేశం అమలుచేస్తోంది. ప్రతియేటా 3కోట్ల మందికిపైగా గర్భిణులకు, 2.6కోట్లమంది చిన్నారులకు ఈ కార్యక్రమాన్ని వర్తింపజేస్తున్నాం”. ఉధృతం చేసిన మిషన్ ఇంద్రధనుష్ (ఐ.ఎం.ఐ.)పేరిట 4వ దశ వ్యాధి నిరోధక టీకాలు కార్యక్రమాన్ని ఈ రోజు వర్చువల్ పద్ధతిలో ప్రారంభించిన సందర్భంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ మన్.సుఖ్ మాండవీయం ఈ ప్రకటన చేశారు. వివిధ రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్యశాఖల అధికారుల సమక్షంలో ఆయన ఈ కార్యక్రమానికి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. అస్సాం ఆరోగ్య శాఖ మంత్రి కేశవ్ మహంత, గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి రుషీకేశ్ పటేల్ ఈ కార్యక్రమానికి వర్చువల్ పద్ధతిలో హాజరయ్యారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, AS&MD వికాస్ శీల్, సంయుక్త కార్యదర్శులు లవ్ అగర్వాల్, డాక్టర్ పి. అశోక్ బాబు, హర్మీత్ సింగ్, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. 

   ఇన్.టెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ (ఐ.ఎం.ఐ.) 4వ దశ కార్యక్రమం 3 దఫాలుగా నిర్వహిస్తారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం కింద గుర్తించిన 75 జిల్లాలతో సహా దేశంలోని మొత్తం 33 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 416 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరినుంచి ఏప్రిల్ వరకూ తొలి దఫాలో 11 రాష్ట్రాల్లో 4వ దశ ఐ.ఎం.ఐ.ని చేపడతారు. అస్సాం, ఉత్తరాఖండ్, గుజరాత్, జమ్ము-కాశ్మీర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో తొలి దఫా కార్యక్రమం జరుగుతుంది. మిగిలిన 22 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏప్రిల్ నుంచి మే నెల వరకూ దఫాలవారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర,, ఆంధ్రప్రదేశ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, బీహార్, పుదుచ్చేరి, ఢిల్లీ, పంజాబ్, గోవా, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, జార్ఖండ్, దాద్రా-నాగర్ హవేళీ, డామన్-డయ్యూ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, అండమాన్-నికోబార్ దీవుల్లో ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తారు.

   ఉధృతం చేసిన మిషన్ ఇంద్రధనుష్ పేరిట 4వ దశ వ్యాధి నిరోధక టీకాలు కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా కేంద్రమంత్రి మాండవీయ మాట్లాడుతూ, వ్యాధి నిరోధ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు టీకాలు అందించే ఫ్రంట్.లైన్ సిబ్బంది చిత్తశుద్ధి, అంకితభావం ఎంతో అభినందనీయమని అన్నారు. వ్యాధి నిరోధక టీకాలుతో అతి మారుమూల గ్రామాన ఉన్న వారికి, ప్రతి కుటుంబానికి రక్షణ కల్పించాలన్న లక్ష్యంతో వారు దుర్గమమైన ప్రాంతాలకు సైతం శ్రమకోర్చి వెళ్తున్నారని, తమ విధి నిర్వహణలో ప్రతికూల వాతావరణాన్ని కూడా లెక్కచేయడం లేదని ఆయన అన్నారు. “ఆరోగ్యరక్షణ కార్యకర్తలు దేశానికి ఎంతో గొప్ప సేవ అందిస్తున్నారు. జాతి నిర్మాణానికి తగిన సేవలందించడంలో నాతోపాటు, ఇతరులకు వారు ప్రదర్శిస్తున్న అంకితభావం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది.”, అని ఆయన అన్నారు.

https://ci6.googleusercontent.com/proxy/G585C7MDjuWUdt1yHnmfhZad6qquLPeSl3A0ZwcyjeJ2OcrRJZR6s0cf_ZVHdPe5sIpmFz31JHwVYL8urhYznO0Jul3Ln9r9zTLBJqkYBDnz1U3VjS2yYkMc0A=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00235T1.jpghttps://ci4.googleusercontent.com/proxy/guErw2Tbvp9lxupQbQQ790DxgCtHupGNWzysY3Mn5PPiC_IWnULmta8QikzpC0Uo_s0J70Pv9aOsCuc6_DnHQSHwiaFEm4lGDZrpuDKMWe_PJMAJLEnFAFF3WQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003ANB6.jpg https://ci6.googleusercontent.com/proxy/PkhXk0YcuYv_hhdEFt3Rd7f-pSuTEtMcPAPQW6IT5psFoDnTS_W9WRvT5vwYVVgzkfbES3xL_TC7P1H3Pduw-UbtjyG-7AxDAnDQ7ae3pvKw_g3z5kxoSCkqvg=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004TZXE.jpg https://ci4.googleusercontent.com/proxy/64Sp1-jfC6swjGP46j5hxf6hPab7hgdGaAbXMWpWlNSAgA4jsc-prcPs_IO_UhppnGuStJ1IY_sa9ZpnT-Cls1No71Qzy6RTBidgja9p8d2dbm5h23EbID3E1A=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005V9WC.jpg

వ్యాధి నిరోధక టీకాలు కార్యక్రమం కవరేజీ పెరిగిందని, కుటుంబ ఆరోగ్యంపై తాజాగా నిర్వహించిన దేశవ్యాప్త సర్వే ఇదే విషయాన్ని తెలియజేస్తోందని డాక్టర్ మాండవీయ అన్నారు. “శిశువులను, చిన్నారులను, గర్భిణులైన మహిళలను వ్యాధులనుంచి, మరణాలనుంచి రక్షించేందుకు సమర్థమైన, సురక్షితమైన పద్ధతుల్లో వ్యాక్సీన్లు అందించడం ఒక మార్గం. పూర్తిస్థాయికి వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పెంచాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి 2014 డిసెంబరు నెలలో మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వ్యాధి నిరోధక కార్యక్రమం తక్కువ స్థాయిలో జరిగిన ప్రాంతాల్లో, వ్యాధులు సోకడానికి ఎక్కువ ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో, దుర్గమ పర్వత ప్రాంతాల్లో పాక్షికంగా వ్యాక్సినేషన్లు అందుకున్న గర్భిణీ స్త్రీలకు, చిన్నారులకు టీకాలను పూర్తిగా అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వారందరికీ వ్యాధులనుంచి టీకా ద్వారా రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం” అని ఆయన అన్నారు.  మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమం కింద, జాతీయ వ్యాధి నిరోధక కార్యక్రమ షెడ్యూలు ప్రకారం సార్వత్రికంగా అందరికీ టీకాలును అందిస్తారన్నారు.  గ్రామ స్వరాజ్ అభియాన్ పథకం కింద చేపట్టే ఫ్లాగ్ షిప్ కార్యక్రమాల్లో ఒకటిగా కూడా మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమం గుర్తింపు పొందిందని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా 541 జిల్లాల్లోని 16,850 గ్రామాల్లో గ్రామ స్వరాజ్ అభియాన్ పథకాన్ని అమలు చేస్తున్నారని, విస్తృతీకరించిన గ్రామ స్వరాజ్ అభియాన్ పథకాన్ని 112 ఆశావహ జిల్లాల పరిధిలోని 48,929 గ్రామాల్లో అమలు చేస్తున్నారని ఆయన చెప్పారు.

  కోవిడ్ మహమ్మారి వ్యాప్తి కారణంగా వ్యాధి నిరోధక కార్యక్రమంలో వేగం తగ్గిందని, ఐ.ఎం.ఐ. 4వ దశ కార్యక్రమం ద్వారా అంతరాలన్నింటినీ పూడ్చివేయడానికి వీలుంటుందని, తద్వారా సార్వత్రిక వ్యాధి నిరోధక కార్యక్రమ లక్ష్యాలు పూర్తికావచ్చని డాక్టర్ మాండవీయ అభిప్రాయపడ్డారు.  ఇప్పటివరకూ వ్యాక్సీన్లు అందని ప్రాంతాలకు, పాక్షికంగా మాత్రమే వ్యాక్సినేషన్ అందిన ప్రాంతాలకు రొటీన్ ఇమ్యూనైజేషన్ (ఆర్.ఐ.) సేవలు అందుతాయని, ఐ.ఎం.ఐ. 4వ దశ ఇందుకు దోహదపడుతుందని కేంద్రమంత్రి చెప్పారు.

  ప్రజారోగ్య రంగంలో వ్యాక్సీన్ల ప్రముఖ పాత్రను గురించి కేంద్ర ఆరోగ్యమంత్రి వివరిస్తూ, దేశవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమ విజయాలను ప్రస్తావించారు. కోవిడ్19 వ్యాక్సినేషన్  ద్వారా ఇప్పటివరకూ 170కోట్ల మేర డోసుల టీకాలను ప్రభుత్వం  ప్రజలకు అందించినట్టు ఆయన చెప్పారు. ఈ మేరకు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారతదేశం సాధించిన విజయానికి ప్రపంచవ్యాప్త ప్రశంసలు లభించాయన్నారు.

  దేశంలో సార్వత్రిక వ్యాధి నిరోధక కార్యక్రమం కింద నిర్దేశించిన లక్ష్యం చేరుకోవడానికి “అందరి ప్రయత్నం”, “జన భాగస్వామ్యం” ఎంత అవసరమో ఆయన వివరించారు. “కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, లబ్ధిదారుల సమష్టి కృషితోనే దేశంలో పూర్తిస్థాయిలో వ్యాధి నిరోధక కార్యక్రమ లక్ష్యాలు సాధించగలుగుతాం”, అని ఆయన అన్నారు. లక్ష్యాల సాధనకోసం రాష్ట్రాలన్నీ వివిధ స్థాయిల్లో పరిపూర్ణంగా కృషి చేయాలని, జిల్లా పరిపాలనా యంత్రాగాలు, పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలతో కలసి రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందని కేంద్రమంత్రి అన్నారు.

  ఐ.ఎం.ఐ. 4వ దశ కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు.  “ఐ.ఎం.ఐ. 4వ దశకు సంబధించిన నిర్వహణా పరమైన మార్గదర్శక సూత్రాల”ను ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు.  “పట్టణ ప్రాంతాల్లో వ్యాధి నిరోధక కార్యక్రమాన్ని బలోపేతం-ఒక కార్యాచరణ ప్రణాళిక”ను, పట్టణ వ్యాధి నిరోధక టీకాలు కార్యక్రమంపై మహిళా ఆరోగ్య సమితికోసం ముద్రించిన కరదీపికను కూడా ఆయన ఆవిష్కరించారు. వ్యాధి నిరోధక కార్యక్రమంపై అవగాహనకోసం రూపొందించినక అధునాతన సమాచార సామగ్రిని కూడా కేంద్రమంత్రి విడుదల చేశారు.  

   ఇప్పటివరకూ మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమానికి సంబంధించి దేశవ్యాప్తంగా 701 జిల్లాల్లో పది దశలు పూర్తయ్యాయి. 2021వ సంవత్సరం ఏప్రిల్ వరకూ అందిన సమాచారం ప్రకారం,..వివిధ దశల్లో చేపట్టిన మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమం కింద  3.86కోట్ల మంది చిన్నారులకు, 96.8లక్షల మంది గర్భిణీ స్త్రీలకు టీకాలు అందించారు. మిషన్ ఇంద్రధనుష్ మొదటి రెండు దశల అమలు ద్వారా ఒక ఏడాది కాలంలో జరిగిన వ్యాధి నిరోధక కార్యక్రమంలో 6.7శాతం వ్యాక్సినేషన్ వృద్ధి నమోదైంది. ఉధృతం చేసిన మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమం (5వ దశ మిషన్ ఇంద్రధనుష్) అమలు చేసిన 190 జిల్లాల్లో సర్వే జరపగా, 18.5శాతం పెరుగుదల కనిపించింది. 4వ దఫా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో తేలిన ఫలితాలతో పోల్చినపుడు ఈ వృద్ధి కనిపించింది. వ్యాధి నిరోధక కార్యక్రమాన్ని బలోపేతం చేసేందుకు గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు నిర్వహించిన కార్యక్రమాలతో వ్యాధి నిరోధక టీకాలు కార్యక్రమం గణనీయమైన స్థాయిలో మెరుగుదల సాధించింది. 2019-21 సంవత్సరాల్లో జరిగిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తాజా ఫలితాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. 2015-16 సంవత్సరంలో జరిగిన 4వ దశ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేతో పోల్చినపుడు ఈ మెరుగుదల నమోదైంది. 12నుంచి 23 నెలల మధ్య వయస్సున్న చిన్నారుల్లో పూర్తిస్థాయి వ్యాధి నిరోధక కార్యక్రమం కవరేజీ 62శాతంనుంచి 76.4శాతానికి పెరిగింది.

   అయితే, కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి కారణంగా వ్యాక్సినేషన్ లో ఏర్పడిన అంతరాలను భర్తీ చేసేందుకు మూడు దఫాలుగా ఐ.ఎం.ఐ. కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. 33రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 416 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తాజాగా విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5వ దశ నివేదిక, ఆరోగ్య నిర్వహణా సమాచార వ్యవస్థ (హెచ్.ఎం.ఐ.ఎస్.) సమాచారం, వ్యాక్సినేషన్ ద్వారా నిరోధించగలిగిన వ్యాధులు తదితర అంశాలపై వెల్లడించిన వ్యాక్సినేషన్ కవరేజీ ప్రాతిపదికగా ఈ 416 జిల్లాలను గుర్తించారు. ఆయా రాష్ట్రాలు సూచించిన జిల్లాలను కూడా ఈ జిల్లాల జాబితాలో పొందుపరిచారు. ఇటీవలి కాలంలో తీవ్రంగా పెరుగుతున్న కోవిడ్ కేసులను దృష్టిలో పెట్టుకుని, 2022 ఫిబ్రవరి, ఏప్రిల్ మధ్య గానీ, లేదా మార్చి, మే మధ్యగానీ ఐ.ఎం.ఐ. కార్యకలాపాలను చేపట్టే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చారు. తొలి రౌండ్ కార్యక్రమం 2022 ఫిబ్రవరి 7నుంచి, రెండవ రౌండు మార్చి 7నుంచి, 3వ రౌండు,.. ఏప్రిల్ 4నుంచి చేపడతారు. గతంలోవలె కాకుండా ప్రతి రౌండును ఏడు రోజులపాటు (ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాలతో సహా) చేపడతారు. అయితే, ఇటీవలి కాలంలో పెరిగిన కోవిడ్ కేసులను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది మార్చినుంచి మే నెల వరకూ కార్యక్రమాన్ని చేపట్టేందుకు రాష్ట్రాలకు తగిన వెసులుబాటు కల్పించారు. ఇక, ఈ ఏడాది ఫిబ్రవరి-ఏప్రిల్ షెడ్యూలుతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లందుకు 33 రాష్ట్రాలకు గాను,  11 రాష్ట్రాలు తమ కార్యాచరణను నిర్దేశించుకున్నాయి.

****(Release ID: 1796325) Visitor Counter : 244