సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రేపటి నుంచి పూర్తి హాజరుతో ప్రభుత్వ కార్యాలయాల పునఃప్రారంభం


కోవిడ్ పరిస్థితిని సమీక్షించిన తర్వాత నిర్ణయం .. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

ఎటువంటి మినహాయింపు లేకుండా అన్ని స్థాయిల్లో ఉద్యోగులు 2022 ఫిబ్రవరి 7 నుంచి కార్యాలయాలకు తప్పనిసరిగా హాజరు కావాలి

Posted On: 06 FEB 2022 7:16PM by PIB Hyderabad

రేపటి నుంచి పూర్తి హాజరుతో ప్రభుత్వ కార్యాలయాల పునఃప్రారంభం అవుతాయని   కేంద్ర శాస్త్ర సాంకేతిక,భూగర్భ శాస్త్రం, సిబ్బంది వ్యవహారాలు , ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ ( స్వతంత్ర బాధ్యత ) మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు.  ఎటువంటి మినహాయింపు లేకుండా అన్ని స్థాయిల్లో  ఉద్యోగులు  2022 ఫిబ్రవరి నుంచి కార్యాలయాలకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన స్పష్టం చేశారు. దేశంలో కోవిడ్ మహమ్మారి పరిస్థితిని ఈరోజు సాయంకాలం సమీక్షించిన అనంతరం డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రభుత్వ కార్యాలయాలకు సిబ్బంది హాజరుపై కీలక ప్రకటన చేశారు.  దేశంలో కరోనా కేసుల సంఖ్యతో పాటు పాజిటివిటీ రేటు తగ్గుతున్నదని దీనితో ఎటువంటి మినహాయింపులు లేకుండా ఫిబ్రవరి 7 నుంచి పూర్తి స్థాయిలో హాజరు అయ్యేలా నిర్ణయం తీసుకున్నామని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. 

అయితేవిధులకు హాజరయ్యే సిబ్బంది ఎల్లవేళలా మాస్కులు ధరించికోవిడ్ అనుగుణ ప్రవర్తనతో పని చేసేలా చర్యలు తీసుకోవాలని  సంబంధిత విభాగ అధిపతులను ఆదేశించామని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు.  

50% హాజరుతో కార్యాలయాలు ఫిబ్రవరి 15 వరకు  పనిచేయాలని ఆదేశిస్తూ గతంలో  జారీ చేసిన ఉత్తర్వుల స్థానంలో ఈ  ఉత్తర్వులు అమలు లోకి వస్తాయి. తాజా పరిస్థితిపై సంబంధిత వర్గాల నుంచి సేకరించిన సమాచారంసమీక్ష తర్వాత సిబ్బంది వ్యవహారాలుశిక్షణ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను సవరిస్తూ కార్యాలయ ఉత్తర్వులను విడుదల చేసింది. దీని ప్రకారం 2022 ఫిబ్రవరి నుంచి అన్ని స్థాయిల సిబ్బంది ఎటువంటి మినహాయింపు లేకుండా కార్యాలయాలకు హాజరు కావలసి ఉంటుంది. ఇకపై సిబ్బందికి "వర్క్ ఫ్రమ్ హోమ్" ఎంపిక ఉండదు.

సిబ్బంది హాజరుకు సంబంధించి  సిబ్బంది వ్యవహారాలుశిక్షణ మంత్రిత్వ శాఖ 2022 జనవరి న కార్యాలయ మెమో ద్వారా మార్గదర్శకాలను జారీ చేసింది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వీటిలో మార్పులు చేర్పులు చేయడం జరుగుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 

50% హాజరుతో ఫిబ్రవరి 15 వరకు కార్యాలయాలు పనిచేయాలని మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అండర్ సెక్రటరీ స్థాయి వరకు మొత్తం సిబ్బందిలో 50% మంది కార్యాలయాలకు హాజరు కావాలనిమిగిలిన 50% మంది ఇళ్ల నుంచి విధులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. ఇంతేకాకుండాఅంగ వైకల్యం కలిగిన సిబ్బందిగర్భిణులు విధులకు హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వడం జరిగింది. అయితేవీరంతా కార్యాలయ పనివేళల్లో టెలిఫోన్ ఇతర వ్యవస్థల ద్వారా అందుబాటులో ఉండాలని కూడా ఆదేశాలు గతంలో జారీ అయ్యాయి. 

కోవిడ్ బారిన పడినపాజిటివ్ వచ్చి ఇళ్ల నుంచి పనిచేస్తున్న సిబ్బందితో డాక్టర్ జితేంద్ర సింగ్ గత నెలలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు.  వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న మంత్రి వారి అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. 

అయితేపరిస్థితులు మెరుగు పడడంతో గతంలో జారీ చేసిన ఉత్తర్వులను  సిబ్బంది వ్యవహారాలుశిక్షణ మంత్రిత్వ శాఖ ఉపసంహరించుకుని తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 15 వరకు 50% సిబ్బందితో కార్యాలయాలు పనిచేయాలని ఆదేశిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసిన మంత్రిత్వ శాఖ 2022 ఫిబ్రవరి నుంచి ఎటువంటి మినహాయింపులు లేకుండా అన్ని స్థాయిల్లో ఉద్యోగులు పూర్తిగా విధులకు హాజరు కావాలని ఆదేశిస్తూ సవరించిన ఉత్తర్వులను విడుదల చేసింది.  

 

***


(Release ID: 1796088) Visitor Counter : 160