ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆర్థిక మంత్రి అమృత్ కాల్ ప్రమేయంతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (వ్యాపార సరళీకరణ)2.0 కోసం విశ్వాస ఆధారిత పాలనను ప్రకటించారు
దరఖాస్తుదారులకు సమాచారం అందించడానికి సింగిల్ విండో పోర్టల్ పరివేష్ విస్తరణ
I-T అనుసంధానం ద్వారా ప్రతిపాదించిన కేంద్ర రాష్ట్ర-స్థాయి వ్యవస్థల ఏకీకరణ
భూ రికార్డుల ఆధారిత నిర్వహణను సులభతరం చేయడానికి ప్రతిపాదిత ప్రత్యేక ల్యాండ్ పార్సెల్ గుర్తింపు సంఖ్య
ప్రభుత్వ సేకరణలను ఎండ్-టు-ఎండ్ ఆన్‌లైన్ ఇ-బిల్ సిస్టమ్ ద్వారా సులభతరం చేయడం, బ్యాంక్ గ్యారెంటీకి ప్రత్యామ్నాయంగా ష్యూరిటీ బాండ్‌లను ఉపయోగించడం
యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్ ప్రమోషన్ రంగాలలో యువత ఉపాధి అవకాశాలను అన్వేషించడం కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
6 నెలల కంటే తక్కువ వ్యవధిలో కార్పొరేట్ స్వచ్ఛంద ముగింపులను వేగవంతం చేయడానికి కొత్త వ్యవస్థ ప్రతిపాదన
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పధకం ద్వారా 5G కోసం బలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి డిజైన్-లీడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రారంభం
పరిశ్రమ, స్టార్ట్-అప్స్ విషయావగాహన కోసం డిఫెన్స్ R&D తోడ్పాటు
Posted On:
01 FEB 2022 1:16PM by PIB Hyderabad
ఈరోజు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2022-23ను సమర్పిస్తున్నప్పుడు, కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అమృత్ కాల్ ప్రమేయంతో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0 (EODB 2.0) ఈజ్ ఆఫ్ లివింగ్ తదుపరి దశ ప్రారంభమౌతుందని ప్రకటించారు. ఇది "మూలధనం, మానవ వనరుల ఉత్పాదక సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వ సంకల్పం" ప్రభుత్వం 'విశ్వాస ఆధారిత పాలన' ఆలోచనను అనుసరిస్తుంది అని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.
అమృత్ కాల్ యొక్క విస్తృత అవలోకనాన్ని అందిస్తూ శ్రీమతి నిర్మలా సీతారామన్, ఈ కొత్త దశ రాష్ట్రాల క్రియాశీల ప్రమేయం, మాన్యువల్ ప్రక్రియలు, డిజిటలైజేషన్, IT అనుసంధానాల ద్వారా కేంద్ర రాష్ట్ర స్థాయి వ్యవస్థల ఏకీకరణ, పౌర-కేంద్రీకృత సేవలన్నింటికీ ఒకే పాయింట్ యాక్సెస్ ప్రమాణీకరణ, అతివ్యాప్తి అనుసరణల తొలగింపు, సలహాల క్రౌడ్‌సోర్సింగ్, పౌరులు-వ్యాపారాల చురుకైన ప్రమేయంతో క్షేత్రస్థాయి అంచనా ప్రోత్సహకాల గురించి తన ప్రసంగంలో ఆమె జోడించారు.
కనిష్ఠ ప్రభుత్వజోక్యం - గరిష్ట పాలన' కోసం మన ప్రభుత్వ దృఢ నిబద్ధత ఫలితంగా, ఇటీవలి సంవత్సరాలలో 25,000 పిర్యాదులు తగ్గాయి, 1,486 కేంద్ర చట్టాలు రద్దు చేశాము- అని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (EODB) వంటి చర్యలతో పాటు ప్రజలపై ప్రభుత్వానికి ఉన్న నమ్మకానికి ఇది పరిణామమని ఆమె పేర్కొన్నారు.
గ్రీన్ క్లియరెన్స్
దరఖాస్తుదారులకు సమాచారం అందించేందుకు సింగిల్ విండో పోర్టల్, పరివేష్ పరిధిని విస్తరించాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. యూనిట్ల స్థానం ఆధారంగా, నిర్దిష్ట ఆమోదాల సమాచారం అందిస్తారు. మొత్తం నాలుగు ఆమోదాల కోసం ఒకే దరఖాస్తు ఉపయోగపడుతుంది. సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్-గ్రీన్ (CPC-గ్రీన్) ద్వారా ప్రక్రియ పర్యవేక్షణ జరుగుతుంది. ఈ పోర్టల్, అన్ని గ్రీన్ అనుమతుల కోసం, 2018లో ప్రారంభించారు. ఇది ఆమోదాల కోసం అవసరమైన సమయాన్ని గణనీయంగా తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
భూ రికార్డుల నిర్వహణ
భూ వనరులను సమర్ధవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్నందున, ఐటి ఆధారిత భూ రికార్డుల నిర్వహణను సులభతరం చేసేందుకు ప్రత్యేక భూమి గుర్తింపు సంఖ్యను స్వీకరించేలా రాష్ట్రాలను ప్రోత్సహించాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. షెడ్యూల్ ఆమోదించిన ఎనిమిది భాషల్లో ఏదైనా భూమి రికార్డుల లిప్యంతరీకరణ సౌకర్యం కూడా అందుబాటులోకి వస్తుంది.
ప్రభుత్వ సేకరణ
పారదర్శకతను పెంపొందించడానికి , చెల్లింపులలో జాప్యాన్ని తగ్గించడానికి తదుపరి దశగా, ఆర్థిక మంత్రి పూర్తిగా కాగిత రహిత, ఎండ్-టు-ఎండ్ ఆన్‌లైన్ ఇ-బిల్ సిస్టమ్‌ను అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు తమ కొనుగోళ్ల కోసం ప్రారంభించాలని ప్రతిపాదించారు. ఈ సిస్టమ్ సరఫరాదారులు కాంట్రాక్టర్‌లు తమ డిజిటల్ సంతకం చేసిన బిల్లులు క్లెయిమ్‌లను ఆన్‌లైన్‌లో సమర్పించడానికి , ఎక్కడి నుండైనా వాటి స్థితిని ట్రాక్ చేయడానికి అనుమతిస్తుంది.
సరఫరాదారులు వర్క్-కాంట్రాక్టర్లకు పరోక్ష వ్యయాన్ని తగ్గించడానికి, బ్యాంక్ గ్యారెంటీకి ప్రత్యామ్నాయంగా ష్యూరిటీ బాండ్‌లను ఉపయోగించడం ప్రభుత్వ కొనుగోళ్లలో ఆమోదయోగ్యంగా ఉంటుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. బంగారం దిగుమతులు వంటి వ్యాపారాలకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుందని ఆమె అన్నారు. బీమా కంపెనీలు ష్యూరిటీ బాండ్ల జారీకి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్ ను IRDAI అందించిందని ఆమె తెలిపారు.
అమృత్ కాల్ అవసరాల కోసం ఇటీవల ప్రభుత్వ నియమాలను ఆధునికీకరించారు. కొత్త నియమాల వల్ల వివిధ వాటాదారులు ప్రయోజనం పొందారు. ఆధునికీకరించిన నియమాలు సంక్లిష్టమైన టెండర్ల మూల్యాంకనంలో ఖర్చుతగ్గించడంతో పాటు పారదర్శక నాణ్యతా ప్రమాణాలను పాటించడానికి అనుమతిస్తాయి. 75 శాతం రన్నింగ్ బిల్లులను తప్పనిసరిగా 10 రోజుల్లోగా చెల్లించేందుకు, రాజీ ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడానికి ప్రోత్సహించడానికి నిబంధనలు రూపొందించారు.
AVGC- దృశ్య శ్రవణ క్రీడా వినోదాల ప్రమోషన్ టాస్క్ ఫోర్స్
శ్రీమతి సీతారామన్ యువతకు ఉపాధి కల్పించేందుకు మన మార్కెట్లకు సేవలందించే దేశీయ సామర్థ్యాన్ని పెంపొందించడానికి, ప్రపంచ డిమాండ్ ను అందుకోడానికి ఈ రంగంలో అపారమైన సామర్థ్యాన్ని ఉపయోగించుకునే మార్గాలను అన్వేషించడానికి వాటాదారులతో కలసి యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ కామిక్ (AVGC) ప్రమోషన్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు..
వేగవంతమైన కార్పొరేట్ నిష్క్రమణ
ప్రాసెస్ రీ-ఇంజనీరింగ్‌తో కూడిన సెంటర్ ఫర్ ప్రాసెసింగ్ యాక్సిలరేటెడ్ కార్పొరేట్ ఎగ్జిట్ (C-PACE) ని ప్రస్తుతం అవసరమైన 2 సంవత్సరాల నుండి 6 నెలల కంటే తక్కువ వ్యవధిలో కంపెనీల స్వచ్ఛంద మూసివేతను సులభతరం చేయడానికి మరియు వేగవంతం చేయడానికి ఏర్పాటు చేయాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. కొత్త కంపెనీల వేగవంతమైన రిజిస్ట్రేషన్ కోసం అనేక ఐటి ఆధారిత వ్యవస్థలు కోరుతున్నందున ఈ అవసరం ఉత్పన్నమైందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.
5G లో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పధకం (PLI)
EoDB- (వ్యాపార సరళీకరణ) లో భాగంగా, శ్రీమతి సీతారామన్ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పధకంలో లో భాగంగా 5G కోసం బలమైన వ్యవస్థను నిర్మించడానికి డిజైన్-లీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ పథకాన్ని కూడా ప్రతిపాదించారు.
రక్షణలో ఆత్మనిర్భరత
రక్షణ పరిశోధన, అభివృద్ధి బడ్జెట్‌లో 25 శాతం కేటాయింపులతో పరిశ్రమలు, స్టార్టప్‌లు విద్యాసంస్థల కోసం డిఫెన్స్ ఆర్ అండ్ డి అందుబాటులో ఉంటుందని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. SPV (ప్రత్యేక అవసర యంత్రాంగం) మోడల్ ద్వారా DRDO ఇతర సంస్థల సహకారంతో మిలిటరీ అవసరాలు, పరికరాల రూపకల్పన వాటి అభివృద్ధిని చేపట్టేందుకు ప్రైవేట్ పరిశ్రమలను ప్రోత్సహిస్తామని శ్రీమతి సీతారామన్ పేర్కొన్నారు. విస్తృత శ్రేణి పరీక్ష, ధృవీకరణ అవసరాలను తీర్చడానికి స్వతంత్ర నోడల్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు.
***
(Release ID: 1794613)
Visitor Counter : 388