ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వాతావరణ మార్పుల వల్ల ఉత్పన్నమయ్యే ప్రమాదాలు భారతదేశం తోపాటు ఇతర దేశాలను ప్రభావితం చేసే బలమైన ప్రతికూల బాహ్యతలు: కేంద్ర బడ్జెట్ 2022-23


అధిక సామర్ధ్య మాడ్యూల్స్ తయారీకి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల కోసం అదనపు కేటాయింపులుగా రూ. 19,500 కోట్ల ప్రతిపాదనలు

కొత్త వ్యాపారాలు ఉద్యోగాలలో ఉత్పాదకత, అవకాశాలను పెంచడానికి వృత్తాకార ఆర్థిక పరివర్తన

థర్మల్ పవర్ ప్లాంట్‌లలో ఐదు నుండి ఏడు శాతం బయోమాస్ గుళికలను కో-ఫైర్ చేయడానికి ప్రతిపాదన; CO2 ఆదా 38 MMT వరకూ అని అంచనా

బొగ్గు గ్యాసిఫికేషన్ బొగ్గును రసాయనాలుగా మార్చడం కోసం నాలుగు పైలట్ ప్రాజెక్ట్ లు కూడా సిద్ధం

Posted On: 01 FEB 2022 1:14PM by PIB Hyderabad

అమృత్ కాల్ సమయంలో శక్తి పరివర్తన,  వాతావరణ మార్పుల చర్యలపై  దృష్టిని సాధించడం ప్రభుత్వం లక్ష్యం. ఈరోజు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2022-23ను సమర్పిస్తున్నప్పుడు, కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, ఈ దార్శనికతపై దృష్టి సారించారు.  దేశపు ముఖ్యమైన ప్రాధాన్యతలలో ఒకటిగా దీనిని నిర్వచించారు. 

 

image.png


 శక్తి పరివర్తన - వాతావరణ చర్య

"వాతావరణ మార్పుల ప్రమాదాలు భారతదేశంతోపాటు ఇతర దేశాలను ప్రభావితం చేసే బలమైన ప్రతికూల బాహ్యతలు" అని కేంద్ర మంత్రి పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తూ  అన్నారు. సుస్థిర అభివృద్ధి పట్ల మన

ప్రభుత్వ దృఢ నిబద్ధతకు  ప్రతిబింబంగా, ప్రధానమంత్రి ప్రకటించిన తక్కువ కార్బన్ అభివృద్ధి వ్యూహాన్ని ఆమె  పునరుద్ఘాటించారు.

ఈ వ్యూహం భారీ ఉపాధి అవకాశాలకు తెర తీస్తుంది. బడ్జెట్ ఈ విషయంలో అనేక సమీప-కాల మరియు దీర్ఘకాలిక చర్యలను ప్రతిపాదిస్తుంది.

సౌర శక్తి

సౌర శక్తి  రంగానికి ఆర్థిక మంత్రి అదనపు కేటాయింపును ప్రతిపాదించారు. అధిక సామర్థ్యం గల మాడ్యూళ్ల తయారీకి ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్ కోసం రూ. 19,500 కోట్లు. ఇది 2030 నాటికి 280 GW స్థాపిత సోలార్ సామర్థ్య ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన దేశీయ తయారీని కూడా నిర్ధారిస్తుంది.

వృత్తాకార ఆర్థిక వ్యవస్థ

 "సర్క్యులర్ ఎకానమీ ట్రాన్సిషన్  ఉత్పాదకతను పెంపొందించడం తో పాటు కొత్త వ్యాపారాలు ఉద్యోగాల కోసం పెద్ద అవకాశాలను సృష్టించడంలో సహాయపడుతుందని భావిస్తున్నాను", అని  సర్క్యులర్ ఎకానమీ  ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ కేంద్ర మంత్రి అన్నారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రివర్స్ లాజిస్టిక్స్, సాంకేతికత అప్-గ్రేడేషన్,  అనధికారిక రంగంతో సాంకేతిక అడునికీకరణ, ఏకీకరణకు సంబంధించిన ముఖ్యమైన క్రాస్ కట్టింగ్ సమస్యలను పరిష్కరించడంపై ఇప్పుడు దృష్టి కేంద్రీకరించాలని ఆమె పేర్కొన్నారు.

"నిబంధనలను అమలు చేసే క్రియాశీల పబ్లిక్ పాలసీలు, పొడిగించిన ఉత్పత్తిదారుల బాధ్యతలను ఈ ఫ్రేమ్‌వర్క్  ఇన్నోవేషన్స్ సులభతరం చేస్తాయి. దీనికి మద్దతు ఇస్తాయి" అని మంత్రి జోడించారు.

కార్బన్ తటస్థ ఆర్ధిక వ్యవస్థకు రూపాంతరం

థర్మల్ పవర్ ప్లాంట్‌లలో ఐదు  నుంచి  ఏడు కార్బన్ న్యూట్రల్ ఎకానమీకి మారడంతో బయో మాస్ గుళికలను మండించడం వల్ల ఏటా  38 MMT  CO2 ఆదా అవుతుందని కేంద్ర మంత్రి  ప్రతిపాదించారు “ఇది రైతులకు అదనపు ఆదాయాన్ని , స్థానికులకు ఉద్యోగావకాశాలను అందిస్తుంది. వ్యవసాయ క్షేత్రాలలో ఎదుగుదలకు సహాయపడుతుంది” అని ఆర్థిక మంత్రి తెలిపారు.

పెద్ద వాణిజ్య భవనాల్లో ఎనర్జీ సర్వీస్ కంపెనీ (ESCO) వ్యాపార నమూనాలో పనితీరు ఒప్పందాలు అమలు చేయడం ద్వారా శక్తి సామర్థ్యం పెంపుదల పొదుపు చర్యలు సాధ్యమౌతాయి.  సాధారణ కొలతలు, ధృవీకరణ ప్రోటోకాల్ సామర్ధ్య నిర్మాణం, అవగాహన ని కూడా సులభతరం చేస్తాయి.

బొగ్గు ను వాయువులుగా  మార్చడం / గ్యాసిఫికేషన్,  బొగ్గు ని   పరిశ్రమకు  అవసరమైన రసాయనాలు గా మార్చడం  కోసం  నాలుగు పైలట్ ప్రాజెక్ట్‌ లు కూడా సాంకేతిక, ఆర్థిక సాధ్యతను అభివృద్ధి చేయడానికి ప్రతిపాదించారు.

***


(Release ID: 1794561) Visitor Counter : 337