ఆర్థిక మంత్రిత్వ శాఖ

విద్యాసంస్థలు, పరిశ్రమలు మరియు ప్రభుత్వ సంస్థల మధ్య సహకారం పెరిగేలా చేసే ప్రయత్నాలకు అదనంగా,


సరికొత్త అవకాశాలలో ఆర్ అండ్ డి కోసం ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది

Posted On: 01 FEB 2022 1:09PM by PIB Hyderabad

సరికొత్త నవోదయ అవకాశాల అపారమైన సామర్థ్యాన్ని గుర్తిస్తూ, కేంద్ర ఆర్థిక & కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో సమర్పించిన కేంద్ర బడ్జెట్, సహాయక విధానాలు, సరళమైన నిబంధనలు, దేశీయ సామర్థ్యాలను పెంపొందించడానికి మరియు పరిశోధన & అభివృద్ధిని ప్రోత్సహించడానికి సులభతరమైన చర్యలుగా అభివర్ణించారు. ఇది ప్రభుత్వ విధానానికి మార్గనిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు. 

బడ్జెట్‌ను సమర్పిస్తూ శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ సూర్యోదయ అవకాశాలలో ఆర్ అండ్ డి కోసం, విద్యాసంస్థలు, పరిశ్రమలు మరియు ప్రభుత్వ సంస్థల మధ్య సహకారంతో పాటు ప్రభుత్వ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జియోస్పేషియల్ సిస్టమ్స్, డ్రోన్‌లు, సెమీకండక్టర్, దాని పర్యావరణ వ్యవస్థ, స్పేస్ ఎకానమీ, జెనోమిక్స్, ఫార్మాస్యూటికల్స్, గ్రీన్ ఎనర్జీ మరియు క్లీన్ మొబిలిటీ సిస్టమ్‌లు దేశాన్ని సుస్థిర అభివృద్ధికి మరియు ఆధునీకరించడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ఆమె అన్నారు. అవి యువతకు ఉపాధి అవకాశాలను అందిస్తాయి. భారతీయ పరిశ్రమను మరింత సమర్థవంతంగా మరియు పోటీగా మారుస్తాయి.

 

Quote Covers_M6.jpg

 

****



(Release ID: 1794555) Visitor Counter : 266