ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సెజ్ లలో ఇకపై ఐటీ కస్టమ్స్ పరిపాలనా వ్యవస్థ


మూలధన ఉత్పత్తులు, ప్రాజెక్ట్ దిగుమతులపై కల్పిస్తున్న రాయితీలు దశలవారీగా తొలగింపు . 7.5% పన్ను విధింపుకు ప్రతిపాదన

మేక్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ ప్రోత్సాహానికి కస్టమ్స్ సుంకం పరిధి నుంచి 350 అంశాలకు మినహాయింపు

గ్రేడెడ్ డ్యూటీ రేట్ వ్యవస్థతో దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ప్రోత్సాహం

రొయ్యల పెంపకానికి ఉపయోగించే వస్తువుల పై కస్టమ్స్ సుంకం తగ్గింపు

కలపని ఇంధనం (అన్‌బ్లెండెడ్ )పై అదనంగా లీటరుకు రెండు రూపాయల సుంకం వసూలు

Posted On: 01 FEB 2022 1:06PM by PIB Hyderabad

సెజ్ లలో ఇకపై  కస్టమ్స్ పరిపాలన పూర్తిగా ఐటీ  ఆధారితంగా ఉంటుందని కేంద్ర ఆర్థికకార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి ప్రకటించారు. ఈరోజు పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్ 2022-23 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కస్టమ్స్ జాతీయ పోర్టల్ లో మరిన్ని సౌకర్యాలను కల్పించే అంశంపై దృష్టి సారిస్తామని మంత్రి తెలిపారు. ప్రమాదకరమైన, హాని కలిగించే అంశాలపై మాత్రమే తనిఖీలు జరుగుతాయని  ఆమె చెప్పారు.

 

Indirect Tax Proposals.jpg

మూలధన ఉత్పత్తులు  మరియు ప్రాజెక్ట్ దిగుమతులు

 

మూలధన ఉత్పత్తులు మరియు ప్రాజెక్ట్ దిగుమతులకు అందిస్తున్న రాయితీ రేట్లను దశలవారీగా  తగ్గించి 7.5 శాతం మితమైన సుంకాన్ని విధించాలని  ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అయితే,  దేశంలో తయారు చేయని అధునాతన యంత్రాలపై  కొన్ని మినహాయింపులు కొనసాగుతాయని ఆమె వివరించారు. దేశంలో మూలధన ఉత్పతుల  తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేకమైన కాస్టింగ్‌లుబాల్ స్క్రూలు మరియు లీనియర్ మోషన్ గైడ్ వంటి పరికరాలకు కొన్ని మినహాయింపులు ప్రవేశపెడుతుందని ఆమె ప్రకటించారు.

సహేతుకమైన టారిఫ్‌లు దేశీయ పరిశ్రమల వృద్ధికి మరియు 'మేక్ ఇన్ ఇండియా'కి అవసరమైన సహకరిస్తాయి. తప్పనిసరి దిగుమతులపై వీటి ప్రభావం ఉండదని అనుభవపూర్వకంగా తెలుస్తోంది' అని ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించారు.  విద్యుత్, ఎరువులువస్త్రాలు వంటి వివిధ రంగాలకు చెందిన  మూలధన ఉత్పతులపై కల్పిస్తున్నసుంకం మినహాయింపులు  దేశీయ మూలధన ఉత్పత్తుల  పరిశ్రమ వృద్ధికి అడ్డుపడుతున్నాయని  అన్నారు. అదేవిధంగా  బొగ్గు మైనింగ్విద్యుత్ ఉత్పత్తి వంటి కొన్ని రంగాలలో కల్పిస్తున్న ప్రాజెక్ట్ దిగుమతి సుంకం రాయితీలు స్థానిక ఉత్పత్తిదారులు అభివృద్ధి చెందకుండా  చేశాయని ఆమె అన్నారు. 

కస్టమ్స్ మినహాయింపులు మరియు టారిఫ్ సరళీకరణ పై  సమీక్ష 

గత రెండు బడ్జెట్లలో ప్రభుత్వం అనేక కస్టమ్స్ డ్యూటీ మినహాయింపులను హేతుబద్ధీకరించిందని  శ్రీమతి నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు.  క్రౌడ్ సోర్సింగ్‌తో పాటు విస్తృతమైన సంప్రదింపుల తర్వాత 350 కంటే ఎక్కువ వస్తువులను కల్పిస్తున్న మినహాయింపులనుదశలవారీగా తొలగించాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని సీతారామన్ చెప్పారు.   వీటిలో మినహాయింపులు పొందుతున్న కొన్ని వ్యవసాయ ఉత్పత్తులురసాయనాలుబట్టలువైద్య పరికరాలుమందులు లాంటి అంశాలు ఉన్నాయని అన్నారు . సరళీకరణ చర్యలో భాగంగా  అనేక రాయితీ రేట్లను బహుళ నోటిఫికేషన్‌ల ద్వారా సూచించే బదులు కస్టమ్స్ టారిఫ్ షెడ్యూల్‌లోనే చేర్చడం జరుగుతుందని ఆమె చెప్పారు. ఈ విధానంతో  రసాయనాలువస్త్రాలు మరియు లోహాలు వంటి రంగాలలో కస్టమ్స్ రేటు మరియు సుంకం నిర్మాణాన్ని సులభతరం చేస్తుందని మంత్రి వివరించారు. ఈ విధానం   వివాదాలను తగ్గించి మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ సాధనకు ఉపకరిస్తుందని శ్రీమతి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 

దేశీయ సామర్థ్యాల కల్పనలో కస్టమ్స్ సంస్కరణలు కీలక పాత్ర పోషించాయనిఎంఎస్ఎంఈ ల అభివృద్ధికి దోహదపడ్డాయని మంత్రి పేర్కొన్నారు. ముడిసరుకుల కొరత తీరడంతో సులభతర వ్యాపార వ్యవస్థ అభివృద్ధి చెందిందని అన్నారు. ఉత్పత్తితో కూడిన ప్రోత్సాహకాలు అందించడం, దశల వారీ తయారీ ప్రణాళికలు అమలు చేయాలన్న లక్ష్య సాధనకు ప్రభుత్వం వివిధ రంగాలకు సంబంధించి రూపొందించిన   నిర్దిష్ట ప్రతిపాదనలు క్రింది విధంగా ఉన్నాయి:

 

Indirect Tax Proposals 2.jpg

ఎలక్ట్రానిక్స్ 

 ఎలక్ట్రానిక్ వస్తువులుధరించగలిగే మరియు వినగలిగే పరికరాలు మరియు ఎలక్ట్రానిక్ స్మార్ట్ మీటర్ల వంటి ఉత్పతులను దేశంలో ఎక్కువగా ఉత్పత్తి చేసేలా ప్రోత్సహించేందుకు   గ్రేడెడ్ రేట్ స్ట్రక్చర్‌ను అందించడానికి కస్టమ్స్ డ్యూటీ రేట్లనురూపొందిస్తామని శ్రీమతి  సీతారామన్ ప్రకటించారు. మొబైల్ ఫోన్ ఛార్జర్‌ల, ట్రాన్స్‌ఫార్మర్ భాగాలు మరియు మొబైల్ కెమెరా మాడ్యూల్  కెమెరా లెన్స్ మరియు కొన్ని ఇతర వస్తువులకు కూడా డ్యూటీ రాయితీలు కల్పిస్తామని  ఆమె చెప్పారు.

రత్నాలు మరియు ఆభరణాలు 

రత్నాలుఆభరణాల రంగానికి ఊతమిచ్చేందుకు కట్‌పాలిష్‌ చేసిన వజ్రాలురత్నాలపై కస్టమ్స్‌ సుంకాన్ని 5 శాతానికిసాన్‌ డైమండ్‌పై సున్నా  శాతానికి తగ్గిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇ-కామర్స్ ద్వారా ఆభరణాలను ఎగుమతి చేయడానికి 2022 జూన్ నాటికి సరళీకృత నియంత్రణ వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని  ఆమె చెప్పారు.  తక్కువ విలువతో  అనుకరణ ఆభరణాల దిగుమతిని అరికట్టేందుకు  అనుకరణ ఆభరణాల పై  కిలోకు 400 రూపాయల  కస్టమ్స్ సుంకాన్ని విధించాలని ప్రతిపాదించింది. 

రసాయనాలు 

దేశీయ విలువ జోడింపును పెంపొందించేందుకు పెట్రోలియం శుద్ధి కోసం వినియోగించే  మిథనాల్ఎసిటిక్ యాసిడ్ మరియు హెవీ ఫీడ్ స్టాక్‌ల వంటి కొన్ని రసాయనాలపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.  అదే సమయంలో తగినంత దేశీయ సామర్థ్యం ఉన్న సోడియం సైనైడ్‌పై సుంకాన్ని ఎక్కువ చేస్తామని ఆమె ప్రకటించారు.

ఎగుమతులు

వస్త్రాలుతోలు పాదరక్షలు మరియు ఇతర వస్తువులు. వాటి ఎగుమతులను ప్రోత్సహించేందుకు  హస్తకళలువస్త్రాలు మరియు తోలు ఎగుమతి చేసే ఎగుమతిదారులకు అవసరమైన అలంకరణట్రిమ్మింగ్ఫాస్టెనర్లు  , బటన్లుజిప్పర్లైనింగ్ మెటీరియల్స్పెసిఫైడ్ లెదర్ఫర్నీచర్ ఫిట్టింగ్‌లు మరియు ప్యాకేజింగ్ బాక్స్‌లు వంటి వాటిపై మినహాయింపులు కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు.   రొయ్యల ఆక్వాకల్చర్‌కు అవసరమైన కొన్ని ఇన్‌పుట్‌లపై  సుంకం తగ్గిస్తున్నట్లు ఆమె తెలిపారు.

ఇంధనం కలపడం 

మిశ్రమ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని శ్రీమతి  సీతారామన్ అన్నారు.  మిశ్రమాన్ని ప్రోత్సహించడానికి అన్‌బ్లెండెడ్  ఇంధనంపై లీటరుకు 2 .రూపాయల చొప్పున  ప్రభుత్వం   ఎక్సైజ్ సుంకాన్ని  అక్టోబర్ 2022 నుంచి  విధిస్తుందని మంత్రి ప్రకటించారు. 

జీఎస్టీ  పురోగతి

 

 జీఎస్టీ ని సహకార సమాఖ్య  స్ఫూర్తిని ప్రదర్శించే విధంగా స్వతంత్ర భారతదేశంలో అమలు చేసిన అతి పెద్ద సంస్కరణగా శ్రీమతి నిర్మలా సీతారామన్ వర్ణించారు.  జీఎస్టీ కౌన్సిల్ మార్గదర్శకత్వం మరియు పర్యవేక్షణలో పరిపాలన సవాళ్లను నేర్పుగా మరియు శ్రమతో అధిగమించామని శ్రీమతి  సీతారామన్ పేర్కొన్నారు. సులభతరం మరియు అమలు మధ్య సరైన సమతుల్యత గణనీయంగా సాధించామని ఆమె అన్నారు. ఎక్కువ మంది ఆమోదం పొందిన ఈ వ్యవస్థ ఆశించిన ఫలితాలను ఇస్తోందని అన్నారు. సక్రమంగా పన్ను చెల్లిస్తున్న వారిని మంత్రి అభినందించారు.  మహమ్మారి ప్రభావం కొనసాగుతున్న సమయంలో  జీఎస్టీ   రాబడులు ప్రోత్సాహకరంగా  ఉన్నాయని మంత్రి అన్నారు.   ఒకే మార్కెట్-ఒక పన్ను విధానం అమలుకు జీఎస్టీ దోహదపడిందని అన్నారు.  పూర్తి ఐటీ ఆధారిత మరియు ప్రగతిశీల  జీఎస్టీ  పాలనలో భారతీయులు గర్వపడతారని అన్నారు. రాబోయే సంవత్సరంలో మిగిలిన సవాళ్లను అధిగమించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలు ఫలిస్తాయని ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. 

 

 కోవిడ్ -19 మహమ్మారికి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో సహకరించిన కస్టమ్స్ సిబ్బందిని  శ్రీమతి సీతారామన్ అభినందించారు. సరళీకృత విధానంలో, సాంకేతిక సహకారంతో   కస్టమ్స్ యంత్రాంగం సరికొత్త రూపం సంతరించుకుని “ ఫేస్‌లెస్ కస్టమ్స్'  గా రూపుదిద్దుకుందని  అన్నారు.

***


(Release ID: 1794280) Visitor Counter : 330