ఆర్థిక మంత్రిత్వ శాఖ
కోవిడ్ సంక్షోభంలోనూ 2021-22 లో 3.9%, 2020-21 లో 3.6% పెరిగిన వ్యవసాయ రంగం
2021-22 లో వ్యవసాయ, అనుబంధ రంగాల స్థూల విలువ 18.8% పెరుగుదల
పంటల వైవిధ్యం కార్యక్రమం ద్వారా జలసంరక్షణ, స్వావలంబన
భారతీయ ప్రకృతి సేద్యంతో పర్యావరణ అనుకూల వ్యవసాయోత్పత్తి
వంటనూనె ఉత్పత్తి 2015-16 నుంచి 2020-21 కి దాదాపు 43% పెరుగుదల
జాతీయ ఆహార భద్రత చట్టం కింద 2021-22 లో రాష్ట్రాలకు 1052 లక్షల టన్నుల ఆహార ధాన్యం కేటాయించిన కేంద్రం
ప్రధానమంత్రి కృషి శించాయీ కింద 2015-16 నుంచి 59 లక్షల హెక్టార్లలో సూక్ష్మ సేద్యం
Posted On:
31 JAN 2022 3:01PM by PIB Hyderabad
2021-22 లో దేశ స్థూల విలువకు 18.8% కలిపిన వ్యవసాయ రంగం గత రెండేళ్లలో గణనీయమైన ఎదుగుదల ప్రదర్శించింది. కోవిడ్ సంక్షోభం మధ్య కూడా 2021-22 లో 3.9%, 2020-21 లో 3.6% ఎదుగుదలతో ఆర్థిక వ్యవస్థ కోలుకోవటంలో కీలకపాత్ర పోషించినట్టు 2021-22 ఆర్థిక సర్వే తేల్చి చెప్పింది. ఈ రోజు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖామంత్రి శ్రీమతి నిర్మలాసీతారామన్ ఈ ఆర్థిక సర్వే నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
మంచి రుతుపవనాలు, ప్రభుత్వ చర్యలఫలితంగా రుణసౌకర్యం అందుబాటు, పెట్టుబడుల్లో మెరుగుదల, మౌలికవసతుల అభివృద్ధి, నాణ్యమైన ముడిసరకు అందుబాటు లాంటివి ఈ పరిస్థితికి దోహదం చేశాయని నివేదిక పేర్కొంది. అదే విధంగా పశుగణాభివృద్ధి, మత్స్యసంపద కూడా సహాయపడినట్టు వివరించింది.
జోడించిన స్థూల విలువ, స్థూల మూలధన సమీకరణ
ఆర్థిక వ్యవస్థలోని స్థూల విలువ జోడింపులో వ్యవసాయ, అనుబంధ రంగాల వాటా దీర్ఘ కాలంలో దాదాపు 18 శాతం ఉన్నట్టు సర్వే పేర్కొంది. 2021-22 లో అది 18.8% కాగా 2020-21 లో 20.2 శాతం నమోదైంది. గమనించిన మరో ధోరణి ఏంటంటే, అనుబంధ రంగాలైన పశుగణం, అటవీ, ఆక్వాకల్చర్ లలో వ్యవసాయం కంటే ఎక్కువ అభివృద్ధివ శాతం నమోదైంది. వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేయటం మీద ఏర్పాటైన కమిటీ ఈ తరహా అనుబంధ రంగాల అధిక వృద్ధి రేటు గమనించి వీటికి మరింత ప్రాధాన్యం ఇవ్వటం ద్వారా వ్యవసాయా ఆదాయాన్ని పెంచవచ్చునని అభిప్రాయపడింది.
వ్యవసాయ రంగంలో పెట్టిన మూలాధాన పెట్టుబడికి, దాని ఎదుగుదల శా తానికీ నేరుగా సంబంధం ఉందని సర్వే గుర్తించింది. ప్రభుత్వ రంగ పెట్టుబడులలో మార్పు 2-3 శాతం మధ్య దాదాపు స్థిరంగా ఉండగా ప్రైవేట్ రంగ పెట్టుబడులు బాగా మారాయి. రైతులకు సంస్థాగత రుణాల అందుబాటు, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం ఎక్కువగా ఉన్నట్టు కూడా తేలింది.
వ్యవసాయోత్పత్తి
మొదటి ముందస్తు అంచనా 2021-22 (ఖరీఫ్ మాత్రమే) ప్రకారం మొత్తం ఆహార ధాన్యాల అంచనా ఉత్పత్తి రికార్డు స్థాయిలో 150.50 మిలియన్ టన్నులు కాగా అది 2020-21 ఖరీఫ్ అంచనా కంటే 0.94 మిలియన్ టన్నులు ఎక్కువ. వారి, గోధుమ, ఇతర ముడి ధాన్యాల ఉత్పత్తి వార్షిక వృద్ధి రేటు వరుసగా 2015-16, 2020-21 సంవత్సరాలలో 2.7, 2.9, 4.8 శాతం నమోదైంది. పప్పు ధాన్యాలు, నూనె గింజలు, ప్రత్తి అదే సమయానికి 7.9, 6.1, 2.8 శాతం నమోదయ్యాయి.
చెక్కెర ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్ ది రెండో స్థానం. భారతదేశం చక్కెర అదనపు నిల్వ ఉన్న దేశంగా తయారైనట్టు సర్వే నివేదిక పేర్కొంది. 2010-11 మొదలుకొని 2016-17 మినహా ప్రతి సంవత్సరం వినియోగం కంటే ఉత్పత్తి ఎక్కువగా ఉంటూ వచ్చింది. దీనివలన చెరకు రైతులను ధర ఒడిదుడుకుల రిస్క్ నుంచి కాపాడేలా బీమా చేయటానికి వీలుకలిగింది. అదే విధంగా సరసమైన, గిట్టుబాటు ధర ఇవ్వటం సాధ్యమైంది.
పంటల వైవిధ్యం
ప్రస్తుత పంటల విధానం ఎక్కువగా చెరకు, వారి, గోధుమల వంటి పంటల సాగు వైపే మొగ్గు చూపుతున్నాడాని, దీనివలన భూగర్భ జలాలు కాలవరపరచే రీతిలో అడుగంటుతున్నాయని ఆర్థిక సర్వే నివేదిక హెచ్చరించింది. మరీ ముఖ్యంగా వాయువ్య భారతదేశంలో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయిలో పడిపోతున్నాయని పేర్కొంది.
నీటిని సమర్థవంతంగా వాడుకోవటానికి, సుస్థిర వ్యవసాయం సాధించటానికి రైతులకు అధిక ఆదాయం సమకూరటానికి ప్రభుత్వం పంటల వైవిధ్య పథకాన్ని అమలు చేస్తోంది. గతంలో హరిత విప్లవం అమలు చేసి సాధించిన పంజాబ్, హర్యానా, పశ్చిమా ఉత్తరప్రదేశ్ లలో దీన్ని రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో భాగంగా 2013-14 నుంచి అమలు చేస్తున్నారు. దీనివల్ల సంప్రదాయంగా వారి పండిస్తున్న ప్రాంతాలలో నీరు తక్కువగా వాడుకునే నూనె గింజలు, పప్పు ధాన్యాలు, పోషకాహార విలువలున్న తృణధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్నారు. అదే విధంగా పొగాకు వంటి పంటలు పండించే ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర , పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలలో కూడా ప్రత్యామ్నాయ పంటల ద్వారా వైవిధ్యం సాధించేలా రైతులను ప్రోత్సాహిస్తున్నారు.
నీరు, నీటిపారుదల
దేశంలో నీటిద్వారా సాగయ్యే నికరపు నేలలో 60 శాతం మేరకు భూగర్భ జలాల ద్వారానే సాగు అవుతున్నట్టు సర్వే గుర్తించింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో భూగర్భం నుంచి వెలికి తీస్తున్న నీరు 100 శాతం కంటే ఎక్కువగా ఉంది. అయితే, సూక్ష్మ సేద్యం కిందికి తీసుకు రావటం ద్వారా నీటిని సమర్థంగా వాడుకొని సంరక్షించుకోవటం సాధ్యమవుతుందని సూచించింది. ఈ రాష్ట్రాలు దీర్ఘ కాల, స్వల్ప కాల భూగర్భ జలాల సంరక్షణను దృష్టిలోపెట్టుకొని సమర్థవంతంగా సూక్ష్మ సేద్యం మీద దృష్టిపెట్టాలని సూచించింది.
సూక్ష్మ సేద్యాన్ని విస్తరించటానికి వనరులను సమీకరించే లక్ష్యంతో నాబార్డ్ కింద 2018-19 లో రూ. 5000 కోట్ల కార్పస్ ఫండ్ తో ఒక సూక్ష్మ సేద్య నిధి ఏర్పాటు చేయబడింది. 01.12.2021 నాటికి దీనికింద ఋణాలతో రూ. 3970.17 కోట్ల విలువచేసే సూక్ష్మ సేద్య ప్రాజెక్టులతో 12.81 లక్షల హెక్టార్ల సాగుకు అంచనాలు కట్టారు. పైగా, ప్రధాన మంత్రి కృషి శించాయి పథకం కింద 2015-16 నుంచి 14.12.2021నాటికి మొత్తం 59.37 లక్షల హెక్టార్ల విస్తీర్ణాన్ని సూక్ష్మ సేద్యం కిందికి తెచ్చారు.
వ్యవసాయ పరపతి, మార్కెటింగ్
ఆర్థిక సర్వే ప్రకారం 2021-22 సంవత్సరానికి ఋణ ప్రవాహం రూ. 16,50,000 కోట్లు కాగా 2021 సెప్టెంబర్ 30 నాటికి రూ. 7,36,589.05 కోట్లు పంపిణీ జరిగింది. పైగా, ఆత్మ నిర్భర్ భారత్ కింద 2 లక్షల కోట్ల రాయితీతో కూడిన రుణం ఇవ్వటం ద్వారా 2.5 కోట్ల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా సాయం అందింది. ఈవిధంగా బంకులు 2.70 కోట్లమంది అర్హులైన రైతులకు 2022 జనవరి 17 వరకు కిసాన్ క్రెడిట్ కార్డులిచ్చాయి. పైగా 2018-19 లో ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డుల సౌకర్యాన్ని ప్రభుత్వం మత్స్య అభివృద్ధికి, పశుగణాభివృద్ధికి కూడా విస్తరించింది.
రైతులను మార్కెట్లతో అనుసంధానం చేయటానికి, వాణిజ్యంలో వారికి అండగా నిలవటం ద్వారా తమ ఉత్పత్తులకు సరైన ధర వచ్చేలా చూడటానికి ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోంది. వ్యవసాయ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది. వ్యవసాయ మౌలిక వసతుల నిధి కింద ఏపీఎంసీ లను కూడా గుర్తించి చేర్చింది. అదనంగా జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ-నామ్) పథకం కింద 2021 డిసెంబర్ 1 నుంచి 18 రాష్టఱయలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలలోని 1000 మండీలను ఈ-నామ వేదికతో సమీకృతం చేసింది.
ఆహార యాజమాన్యం
భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార కార్యక్రమాల్లో ఒక దానిని నిర్వహిస్తోంది. 2021-22 లో ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 1052.77 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను వివిధ పథకాల కోసం జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేటాయించినట్టు ఆర్థిక సర్వే గుర్తించింది. 2020-21 లో అది 948.48 లక్షల టన్నులు. పైగా, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద అదనంగా మనిషికి 5 కిలోల చొప్పున ధాన్యం అందిస్తూ ఈ పథకాన్ని ప్రభుత్వం మరింత విస్తరించింది. 2021-22 లో ఈ పథకం కింద ప్రభుత్వం 437.37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం 80 కోట్ల మందికి ఉచితంగా అందించటానికి కేటాయించింది. కోవిడ కారణంగా ఏర్పడిన సమస్యలనుంచి పేద ప్రజలు బైటపడటానికి ఇది దోహదం చేసింది.
2020-21 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లో 601.85 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించగా లక్ష్యం 642.58 లక్షల మెట్రిక్ టన్నులని పేర్కొందివ. 2021-22 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లో 2022 జనవరి 16 వరకు 566.58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ( 379.98 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యానికి సమానం) సేకరించినట్టు పేర్కొంది. 2021-22 సీజన్ లో 433.44 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు సేకరించగా 2020-21 లో అది 389.92 లక్షల మెట్రిక్ టన్నులు. 2020-21 ఖరీఫ్, రబీ మార్కెటింగ్ సీజన్ లో సుమారు 11.87 లక్షల మెట్రిక్ టన్నుల ముతక ధాన్యం కూడా సేకరించారు,. అది గత అయిదేళ్లలో రికార్డు.
వ్యవసాయ పరిశోధన, విద్య
ఆర్థిక సర్వే ప్రకారం వ్యవసాయ పరిశోధన, అభివృద్ధి మీద పెట్టిన ప్రతి రూపాయీ మెరుగైన ఫలితాన్నిచ్చింది. వ్యవసాయ రంగంలో పరిశోధన, అభివృద్ధి మీద పెడుతున్న అదనపు వ్యయం కేవలం ఆహార భద్రతకు హామీ మాత్రమే కాదు, సామాజిక, ఆర్థిక దృక్కోణంలో కూడా ఎంతో అవసరం.
వ్యవసాయ పరిశోధన, అభివృద్ధి అనేది పర్యావరణానుకూల సుస్థిర ప్రపంచ ఆహార వ్యవస్థకు, ఆహార, పౌష్ఠికాహార భద్రతకు, ఖర్చు తగ్గించుకోవటం ద్వారా వ్యవసాయ ఆదాయాన్ని పెంచుకోవటానికి ఉపయోగపడుతుందని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. భారత జాతీయ వ్యవసాయ పరిశోధనా వ్యవస్థ తగిన ఫలితాలనిచ్చిందని పేర్కొంది. భారత వ్యవసాయ పరిశోధనామండలి 2020, 2021 సంవత్సరాలలో మొత్తం 731 కొత్త హైబ్రిడ్ వంగడాలని విడుదల చేసింది. వూయవసాయ పరిశోధన విద్యావిభాగం 2021-22 సంవత్సరంలో 35 ప్రత్యేక రకాలను ఉద్యానవన పంటల విభాగంలో విడుదలచేసింది.
***
(Release ID: 1794001)
Visitor Counter : 862