ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 30 JAN 2022 9:00AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 165.70 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 18,84,937

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 4.59%

ప్రస్తుత రికవరీ రేటు 94.21%

గత 24 గంటల్లో 3,52,784 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,87,13,494 కు పెరిగింది.

గత 24 గంటల్లో 2,34,281 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 14.50%

వారపు పాజిటివిటీ రేటు 16.40%

గత 24 గంటల్లో చేసిన 16,15,993 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 72.73 కోట్ల పరీక్షలు చేశారు. 

****


(Release ID: 1793727) Visitor Counter : 152