భారత ఎన్నికల సంఘం

దేశవ్యాప్తంగా 12వ జాతీయ వోటర్ల దినోత్సవం


వోటుహక్కు వినియోగాన్ని పెంచడంలో
ఎన్నికల కమిషన్ కృషి అమోఘం!
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందలు..

ఎన్నికలను మరింత సమ్మిళితంగా తీర్చిదిద్దేందుకు
కమిషన్ కట్టుపబడి ఉందన్న ప్రధాన కమిషనర్..


‘నా వోటే నా భవిష్యత్తు- ఒక్క వోటు శక్తి’ పేరిట,
అవగాహనా పోటీకి ఎన్నికల కమిషన్ శ్రీకారం

Posted On: 25 JAN 2022 6:57PM by PIB Hyderabad

   జాతీయ వోటర్ల దినోత్సవం ఈ రోజు (జనవరి 25, 2022) దేశవ్యాప్తంగా జరుపుకున్నారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఇచ్చిన సందేశాన్ని వర్చువల్ పద్ధతిలో విడుదల చేశారు. వోటు హక్కు వినియోగించుకునే వోటర్ల సంఖ్యను మెరుగుపరచడంలో, ఎన్నికల ప్రక్రియపై విశ్వసనీయతను పెంపొందించడంలో  ఎన్నికల కమిషన్ క్రమం తప్పకుండా చేస్తున్న కృషి ఎంతో ప్రశంసనీయమని ఉపరాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ప్రశంసనీయమైన సేవలందించిందుకు ఈ రోజు ఎన్నికల కమిషన్ నుంచి పురస్కారాలు అందుకున్న వారిని కూడా ఉపరాష్ట్రపతి అభినందించారు. ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్లు నవీన్ చావ్లా, సునీల్ అరోరా, గుర్తింపు పొందిన రాజకీయపార్టీల (ఎ.ఐ.టి.సి., బి.ఎస్.పి., సి.పి.ఐ., ఐ.ఎన్.సి. నేషనల్ పీపుల్స్ పార్టీ,) సీనియర్ నాయకులు, జాతీయ ప్రముఖులు, ఉత్తమ ఎన్నికల నిర్వహణా ప్రక్రియతో ఎన్నికల కమిషన్ నుంచి అవార్డులు పొందిన వారు ఈ నాటి కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.  

 

https://ci6.googleusercontent.com/proxy/agVmTNQ3AhHd-zGK-Wa3---cLvDoVbbKwItlpXthzGsKr44ieWQA03rFBuKF54vaEg5c5vO6MkI7VNCdC0993ynl-bn1_TjgvyIhX7Gn5eeAP9EMG8Opid2Atw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0016RW7.jpg

  కార్యక్రమంలో ఎన్నికల ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియను మరింత సమ్మిళంతంగా, అందుబాటు యోగ్యంగా, భాగస్వామ్య సహితంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అందుకు ఎన్నికల కమిషన్ దృఢ నిశ్చయంతో ఉందని పునరుద్ఘాటించారు. ఇందుకు తగినట్టుగానే ఈ సంవత్సరపు వోటర్ల దినోత్సవ ఇతివృత్తాన్ని ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్నట్టు తెలిపారు. ఎన్నికల కమిషన్ రెండు కోణాల్లో చక్కని కృషి చేసిందన్నారు. వోటర్ల నమోదుకోసం సదుపాయాలను పెంచడం,... మరింత సానుకూలంగా, సౌకర్యవంతంగా, అందుబాటు యోగ్యంగా పోలింగ్ కేంద్రాలను తీర్చిదిద్దడం.. కమిషన్ తీసుకున్న రెండు చక్కని చర్యలని ఆయన అన్నారు. వయోజనులు, అంగవైకల్యం కలిగిన వోటర్లు కూడా వోటింగ్ లో పాలుపంచుకునేలా ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు గట్టి చర్యలు తీసుకుంటూ వస్తోందన్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లి వోటు వేయలేని వారికోసం, వారి ముంగిటికే పోలింగ్ బూత్.లను కమిషన్ తీసుకెళ్లిందని, వారు వోటింగ్ లో పాల్గొనేలా పోస్టల్ బ్యాలెట్ సదుపాయంతో తగిన ప్రత్యామ్నాయాన్ని కమిషన్ కల్పించిందని అన్నారు. దేశంలో వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అన్ని సవాళ్ల అధిగమిస్తూ తమతమ విధి నిర్వహణను చక్కగా నిర్వహించి, ఎన్నికల ప్రక్రియను ఎలాంటి విఘాతం కలగకుండా చూసిన క్షేత్రస్థాయి సిబ్బందికి, పోలింగ్ బూత్ స్థాయి అధికారులకు, భద్రతా సిబ్బందికి, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలకు ఆయన అభినందనలు తెలిపారు. 

  కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు మాట్లాడుతూ, ప్రతి వోటరూ తన వోటు హక్కుకు విలువ ఇవ్వాలని, ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశంలో వోటు హక్కును కలిగి ఉండటం తనకు దక్కిన సమున్నత గౌరవంగా ప్రతి వోటరూ భావించాలని అన్నారు. పటిష్టమైన ఎన్నికల ప్రక్రియల నిర్వహణ ద్వారానే విజయవంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు తగిన పునాది ఏర్పడుతుందన్నారు. అర్హులైన యవ పౌరులు వోటర్లుగా తమ పేర్లు నమోదు చేసుకునేందుకు ఏడాది కాలంలోనే నాలుగు సార్లు అవకాశం కల్పించిన తాజా ఎన్నికల సంస్కరణలను గురించి కేంద్రమంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. రాజ్యాంగ సంస్థలకు స్వేచ్ఛ ఇవ్వాల్సిన ఆవశ్యకతను కూడా గుర్తించాలన్నారు. స్వేచ్ఛ విషయంలో ఎలాంటి రాజీకి అవకాశం లేకుండానే, రాజ్యాంగ సంస్థలు పరస్పర సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటూ తమ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎన్నికల సిబ్బందికి మరణానంతరం పురస్కారాలు అందించే పద్ధతిని ఎన్నికల కమిషన్ ప్రారంభించాలని ఆయన సూచించారు.

 

https://ci3.googleusercontent.com/proxy/iTWrckAlShWUOKEklas8v_AO0bcc1VNfuXFBfhLmmhOP7UJwYCPwV6cneH_6rsxoM8BZmZ4150PQmdJ_YHBPvXvjWBMIPxnUeSYYhQWaWl5iZZ3ebvk-QIYXqg=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0024HTP.jpg

ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, భారతదేశంలో ప్రజాస్వామ్య సంప్రదాయం, ప్రజాస్వామ్య పద్ధతులు చాలా దృఢంగా వేళ్లూనుకున్నాయని అన్నారు. భారత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ఒక రోజు ముందస్తుగానే ఎన్నికల కమిషన్.ను రాజ్యాంగ సంస్థగా ఏర్పాటు చేయడాన్ని పరిశీలించినపుడు, ప్రజాస్వామ్య స్ఫూర్తి పట్ల, పౌరులు వెల్లడించే తీర్పుపట్ల మన రాజ్యాంగ వ్యవస్థాపకుల చిత్తశుద్ధి ఎంత గొప్పదో మనకు వెల్లడవుతోందని అన్నారు. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులకు సముచిత రీతిలో అవకాశాలు కల్పించడానికే ఎన్నికల కమిషన్ కట్టుబడి ఉందని, అప్పుడే వోటర్లు కూడా ఎలాంటి భయానికి, పక్షపాతానికి తావులేకుండా తమ వోటుహక్కు వినియోగించుకోగలరని రాజీవ్ కుమార్ చెప్పారు. ఎన్నికల కమిషన్ చేపట్టిన పలు సంస్కరణలు వివిధ పరిణామ దశల్లో ఉన్నాయని, అవి త్వరలోనే క్షేత్రస్థాయిలో వాస్తవరూపం దాల్చబోతున్నాయని అన్నారు. భవిష్యత్తులో ఎన్నికలు తప్పని సరిగా మరింత క్రియాశీలకంగా ఉండబోతున్నాయని, వోటర్ల సంక్షేమం లక్ష్యంగా ఎన్నికల ప్రక్రియలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగం మరింత విస్తృతం కాబోతున్నదని అన్నారు.

  మరో ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే,.. ఈ కార్యక్రమంలో అతిథులను, పురస్కార గ్రహీతలను ఉద్దేశించి స్వాగతోపన్యాసంచేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన మన దేశంలో ఎన్నికల ప్రక్రియను మరింత సమ్మిళతంగా, స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, భాగస్వామ్య సహితంగా, అందుబాటు యోగ్యంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నిర్విరామ కృషి చేస్తూ వస్తోందని పాండే అన్నారు. వోటుహక్కు వినియోగించుకోలేని పరిస్థితి ఏ ఒక్క వోటరుకూ ఎదురు కాకుండా చూసుకోవాలన్న రాజ్యాంగబద్ధమైన బాధ్యతను జాతీయ వోటర్ల దినోత్సవం ప్రతి యేటా తమకు గుర్తు చేస్తుందని ఆయన అన్నారు. 2022వ సంవత్సరంలో జరుగుతున్న జాతీయ వోటర్ల దినోత్సవం, భారతదేశంలో 70సంవత్సరాలపాటు విజయవంతమైన ఎన్నికల ప్రక్రియకు తార్కాణమని ఆయన అన్నారు.

   ఎన్నికల నిర్వహణకు సంబంధించి వివిధ రంగాల్లో ఉత్తమమైన పద్ధతులు అనుసరించిన అధికారులకు వారి సేవలను గుర్తిస్తూ జాతీయ పురస్కారాలను ఎన్నికల కమిషన్ ఈ సందర్భంగా ప్రదానం చేసింది. వోటు హక్కు వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేసిన ప్రభుత్వ శాఖలకు, పత్రికా సంస్థలకు, మీడియా సంస్థలకు కూడా కమిషన్ అవార్డులు ప్రదానం చేసింది.

జాతీయ వోటర్ల దినోత్సవంపై ప్రచురించిన బ్రోషర్ కోసం ఈ లింకును డౌన్.లోడ్ చేసుకోవచ్చు.:

https://eci.gov.in/files/file/13975-12th-national-voters-day-best-electoral-practices-awards-2021-2022/

 

https://ci3.googleusercontent.com/proxy/RJVZF-X8JA9RIWBxLfS09Aj_R32EdEw06R0Qbvc2nn35Qe2DEPfaCGDs1O8spKHdN6ClOK0IqLOAYgLN7HQcMagq-UBnWClyZIrhRJDj38gZDNdcrS4q87cCPQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003A0PW.jpg

https://ci6.googleusercontent.com/proxy/4nuVF38FIGer0f6fkFINriaAiJHHjl5FLltpPXEVGZTAGm-9EcQjBRC_pZDZKmqVSzrtX3sRlgzZmFBHBs5B8hzZXZ8eXE3XC6LMgQjYPPJOHtR_Pu8TiezAoQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004GYPN.jpg

https://ci5.googleusercontent.com/proxy/c7clXnHa6i6DN0JMwLqSfgZg6WWX2g18amqFsC4z7z8RF7VftD_TSb6ailS9qfG8Yok3TDK9qYf6q3i37ZQmyOnHjALJd1qkdUskBk03VOADTpPmchlI6-qLBA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005TJYQ.jpg

 

  ‘లీప్ ఆఫ్ ఫెయిత్: భారతీయ ఎన్నికల ప్రయాణం’ అన్న శీర్షికతో ఒక ప్రచురణను ఎన్నికల కమిషన్ ఈ రోజు ఆవిష్కరించింది. 19వ శతాబ్దం నుంచి 21వ శతాబ్దం వరకూ భారత దేశ ఎన్నికల చరిత్రను, ప్రజా ప్రాతినిధ్యంతో కూడిన, ఎన్నికల నిర్వహణా సూత్రాల పరిణామాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది. ప్రజాతీర్పును ప్రతిబింబించేలా ఎన్నికల ప్రక్రియను తీర్చిదిద్దేందుకు భారతీయ ఎన్నికల కమిషన్ క్రమం తప్పకుండా తీసుకుంటున్న చర్యలను గురించి కూడా ఈ పుస్తకం ప్రధానంగా వివరిస్తుంది.

 

‘వోటుకోసం ప్రతిజ్ఞ – దశాబ్ద కాలంగా దేశంలో జాతీయ వోటర్ల దినోత్సవ పయనం’ అన్న శీర్షికతో మరో ప్రచురణను కూడా ఈసందర్భంగా విడుదల చేశారు. వజ్రోత్సవ వేడుకల అనంతరం దశాబ్దకాలంలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ వోటర్ల దినోత్సవాల గురించి ఈ పుస్తకం వివరిస్తుంది.  వోటర్ల దినోత్సవ కార్యక్రమాల్లో ముఖ్య అతిధులుగా పాల్గొన్న ప్రముఖుల ప్రసంగాలు, ఎన్నికల ప్రధాన కమిషనర్ల ప్రసంగాలు, సందేశాలు, జాతీయ అవార్డు విజేతల వివరాలు, తదితర అంశాలను కూడా ఈ పుస్తకం వివరిస్తుంది. ఈ పుస్తకం ఇ-బుక్ కోసం ఈ దిగువన ఇచ్చిన లింకును సందర్శించవచ్చు:

https://eci.gov.in/files/file/13976-pledging-to-vote-a-decadal-journey-of-the-national-voters%E2%80%99-day-in-india/

    జాతీయ వోటర్ల అవగాహనా పోటీ-2022వ సంవత్సరంలో ప్రస్తుతం జరుగుతున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి వోటుకూ ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి పునరుద్ఘాటించేందుకు ‘నా వోటే నా భవిష్యత్తు-ఒక్క వోటు శక్తి’ పేరిట ఒక పోటీని ప్రారంభించారు.  వోటు ప్రాధాన్యం, ఎన్నికల ప్రక్రియ ప్రాముఖ్యంపై,.. గేయం, నినాదం, క్విజ్, వీడియో చిత్రీకరణ, పోస్టర్ రూపకల్పన వంటి అంశాల్లో ఈ పోటీ ఉంటుంది. పోటీలో పాల్గొనేందుకు అందరూ అర్హులే. ఆసక్తి గలనారు,..  మార్చి 15వ తేదీవరకూ తమ ఎంట్రీలను పంపించుకోవచ్చు. పోటీలో గెలిచిన విజేతలకు చక్కని నగదు బహుమతి, ప్రశంసలు ఉంటాయి. పోటీపై మరింత సమాచారం కోసం  ఈ వెబ్.లింకును సందర్శించవచ్చు: https://ecisveep.nic.in/contest/

   ఎన్నికల కమిషన్ చేపట్టిన పలు కార్యక్రమాలపై మల్టీ మీడియా ఎగ్జిబిషన్.ను కూడా వోటర్ల దినోత్సవంలో నిర్వహించారు. ఇటీవల చేపట్టిన ఎన్నికల సంస్కరణలు, ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలు (ఇ.వి.ఎం.), వి.వి.పి.ఎ.టి.లపై సమాచారం, అంతర్జాతీయ అనుభవాలు, ఎన్నికలను మరింత సమ్మిళితంగా, అందుబాటు యోగ్యంగా, భాగస్వామ్య సహితంగా, కోవిడ్.నుంచి రక్షించేలా  తీర్చిదిద్దేందుకు కమిషన్ చేపట్టిన కార్యక్రమాలపై సమాచార పంపిణీ ప్రక్రియ తదితర అంశాలను ప్రతిబింబిస్తూ ఈ ఎగ్జిబిషన్.ను రూపొందించారు. వోటర్ల కోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారంగా చేపట్టిన కె.వై.సి., సి.విజిల్ యాప్, తదితర అంశాలను కూడా వోటర్ల దినోత్సవంలో ప్రదర్శించారు. 

     https://ci5.googleusercontent.com/proxy/Fh4KPc7H0fpiMK23hTh3VbdiqMf6EO0Eqgq31lrKmUbZY5Yp8jqDCt1rVKvB2yulWdZtUXJcwR9aOuaV-MfNIT7idlEw74s2XMs7UND715s4n6y69tYbgIEkWw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0067Y5T.jpg

   ఢిల్లీలో వోటర్లుగా కొత్తగా పేర్లు నమోదు చేయించుకున్న ఐదుగురు వోటర్లను ఈ కార్యక్రమంలో సత్కరించి, వారికి ఫొటో వోటరు గుర్తింపు కార్డును (ఎపిక్.ను) అందజేశారు.

https://ci6.googleusercontent.com/proxy/wAGGM6HUnHKdRv9Ejl6E5gSNnnZYK9y0lB7gMKSVF_8GrDEXrjALIbaGLute9pi8_zR6GRlwgNU1WSYv_46jsfTxkZxleS6pyl-Nz0e1hmpaTMr3p79483znvQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007JUU9.jpg

https://ci6.googleusercontent.com/proxy/ldyF6iHsbClHalxiFX72Mex0pjS6CPTVCzNbHAq0tgrg-NDrv5Ts78yQ9sbkFAAlx9R9bkngVBUIBp0FaiPi2tnOGkqkHgJiyxXOLxwCNebjEuePno0_FotbOg=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008MW4B.jpg

   భారతీయ జాతీయ వోటర్ల దినోత్సవాన్ని 2011వ సంవత్సరంనుంచి ప్రతియేటా జనవరి 25వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ వస్తున్నారు. 1950వ సంవత్సరంలో భారతీయ ఎన్నికల కమిషన్ కూడా ఇదే రోజున ఏర్పాటైంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి వోటుకూ ఉన్న ప్రాముఖ్యాన్ని వివరించడం, కొత్త వోటర్లను ప్రోత్సహించి, వారు వోటు వేసేందుకు అవకాశాలు కల్పించి, వోటర్ల నమోదును గరిష్టస్థాయిలో పెంచడం, వోటింగ్ ప్రక్రియలో ఎక్కువ మంది వోటర్లు పాల్గొనేలా చేయడం తదితర లక్ష్యాలతో జాతీయ వోటర్ల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ వస్తున్నారు.

 

****



(Release ID: 1792726) Visitor Counter : 176