ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్స్ తయారీపై వాల్యూమ్ ఆఫ్ విజన్ రెండో డాక్యుమెంట్‌ను విడుదల చేశారు.
–ఎలక్ట్రానిక్స్ తయారీని 2026 నాటికి భారతదేశం ప్రస్తుత 75 బిలియన్ డాలర్ల నుండి 300 బిలియన్ డాలర్లకు పెంచేలా ఎలక్ట్రానిక్స్ పవర్‌హౌస్‌గా మారడానికి –ఉద్దేశించిన విజన్ డాక్యుమెంట్ (రెండో సంచిక) వివరణాత్మక లక్ష్యాలను రోడ్‌మ్యాప్‌ను నిర్దేశిస్తుంది.
–లక్ష్యాన్ని నిర్దేశించడంలో ప్రభుత్వం–-పరిశ్రమ ప్రయత్నాలను అద్భుతంగా వివరిస్తుంది.
–ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 2021–-22లో అంచనా 15 బిలియన్ డాలర్ల నుండి 2026 నాటికి 120 బిలియన్ డాలర్లకు పెరుగుతాయని విజన్ డాక్యుమెంట్ పేర్కొంది.
Posted On:
24 JAN 2022 5:02PM by PIB Hyderabad
మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐసియాతో కలిసి, ఎలక్ట్రానిక్స్ సెక్టార్ కోసం 5 సంవత్సరాల రోడ్‌మ్యాప్, విజన్ డాక్యుమెంట్‌ను "2026 నాటికి 300 బిలియన్ డాలర్ల విలువైన సస్టైనబుల్ ఎలక్ట్రానిక్స్ తయారీ & ఎగుమతులు" పేరుతో విడుదల చేసింది. ఈ రోడ్‌మ్యాప్ రెండు-భాగాలుగా ఉంటుంది. ఇందులో విజన్ డాక్యుమెంట్ రెండవది. - ఇందులో మొదటిది "ఇండియా ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల జీవీసీలలో వాటాను పెంచడం" పేరుతో నవంబర్ 2021లో విడుదల చేయడం జరిగింది. ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రస్తుత 75 బిలియన్ డాలర్ల నుండి 300 బిలియన్ డాలర్లకు పెంచేలా మనదేశాన్ని ఎలక్ట్రానిక్స్ తయారీ పవర్‌హౌస్‌గా మార్చడానికి దారితీసే వివిధ ఉత్పత్తుల కోసం ఈ నివేదిక ఏడాది వారీగా ఉత్పత్తి అంచనాలను అందిస్తుంది. ఎలక్ట్రానిక్స్ తయారీలో భారతదేశ వృద్ధికి దారితీసే కీలక ఉత్పత్తులలో మొబైల్ ఫోన్‌లు, ఐటీ హార్డ్‌వేర్ (ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు), కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ (టీవీ ఆడియో), ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఆటో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ భాగాలు, ఎల్ఈడీ లైటింగ్, స్ట్రాటజిక్ ఎలక్ట్రానిక్స్, పీసీబీఏ ఉన్నాయి. వీటిలో ధరించగలిగేవి, వినగలిగే టెలికాం పరికరాలు కూడా (చార్ట్ చూడండి) ఉన్నాయి. మొబైల్ తయారీ మార్కెట్ 100 బిలియన్ డాలర్ల వార్షిక ఉత్పత్తిని దాటగలదని అంచనా. ఇది- ప్రస్తుతం 30 బిలియన్ డాలర్ల నుండి దాదాపు 40 శాతం పెరుగుతుందన్నది మరో అంచనా. త్వరగా డాక్యుమెంట్లు , పాలసీ ఫ్రేమ్‌వర్క్ అంశాలను బయటకు తీసుకురావడంలో కృషి చేసినందుకు ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మొత్తం బృందాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో, వైష్ణవ్ ఈ సందర్భంగా ఇటీవల తనతో ఇంటరాక్షన్ సమయంలో పరిశ్రమ ప్రముఖులు లేవనెత్తిన కొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. మొబైల్ తయారీలో ద్వంద్వ నిబంధనల సమస్యపై పరిశ్రమ ఆందోళనలను ప్రస్తావిస్తూ, టెలికాం శాఖ మొబైల్ తయారీలోకి ప్రవేశించబోదని, మొబైల్ తయారీ నియంత్రణ విధానం అలాగే ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఐటీ, స్కిల్ డెవలప్‌మెంట్ & ఎంట్రప్రిన్యూర్‌షిప్ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ప్రధాన మంత్రి చేసిన ప్రకటనకు అనుగుణంగా భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమను విస్తృతం చేయడంపై తమ మంత్రిత్వ శాఖ దృష్టి సారిస్తోందని అన్నారు. సప్లై చెయిన్‌లలో భారతదేశం నమ్మకమైన విశ్వసనీయ భాగస్వామిగా ఎదుగుతోందని అన్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్ వాల్యూమ్–-2 లక్ష్యం గురించి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, “కొత్త మార్కెట్‌లు, కొత్త కస్టమర్‌లను సంపాదించి గ్లోబల్ వాల్యూ చైన్ (జీవీసీ)లో భాగంగా మారటమే 2వ దశ లక్ష్యం. ఎలక్ట్రానిక్స్ తయారీకి సంబంధించిన 1వ వాల్యూమ్‌తో పాటు ఈ వాల్యూమ్, ప్రభుత్వం, పరిశ్రమల మధ్య గంటల కొద్దీ లోతైన చర్చల అనంతరం తీసుకున్న నిర్ణయాలను వివరిస్తుంది. లక్ష్యాన్ని నిర్దేశించడం, వివరణాత్మక వ్యూహాన్ని రూపొందించడానికి ఇది అద్భుతమైన ఉదాహరణ. వాల్యూమ్ ఆఫ్ విజన్ డాక్యుమెంట్‌లోని సంఖ్యలు ఎలక్ట్రానిక్స్ రంగంలో కంపెనీలకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని ఉదాహరణలతో సహా నిర్ధారిస్తున్నాయి”అని ఆయన అన్నారు. ఇందుకు డిజిటల్ వినియోగం, వృద్ధి ప్రపంచ విలువ గొలుసుల వైవిధ్యం పెరుగుదల అనే రెండు కారకాలు ముఖ్యమని వివరించారు. రాబోయే 5 సంవత్సరాలలో దేశీయ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ 65 బిలియన్ డాలర్ల నుండి 180 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. 2026 నాటికి భారతదేశం నుంచి 2-3 అగ్రశ్రేణి ఎగుమతులలో ఎలక్ట్రానిక్స్ కూడా ఉంటాయి. మొత్తం 300 బిలియన్ డాలర్లలో, ఎగుమతులు 2021-–22లో అంచనా వేసిన 15 బిలియన్ డాలర్ల నుండి 2026 నాటికి 120 బిలియన్ డాలర్లకు పెరుగుతాయని ఈ డాక్యుమెంట్ పేర్కొంది. 300 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి ఐదు-భాగాల వ్యూహం పనిచేస్తుంది. "ఆల్ ఆఫ్ గవర్నమెంట్" విధానం ఆధారంగా, భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీని విస్తృతం చేయడం, భారీగా చేయడంపై దృష్టి పెడతారు. ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ తయారీదారులు/బ్రాండ్‌లను ఆకర్షించడం ద్వారా పోటీతత్వాన్ని స్థాయిని పెంపొందించడం, సబ్-అసెంబ్లీలు కాంపోనెంట్ ఎకోసిస్టమ్‌ను మార్చడం అభివృద్ధి చేయడం, డిజైన్ పర్యావరణ వ్యవస్థను నిర్మించడం, భారతీయ ఛాంపియన్‌లను ప్రోత్సహించడం భారతదేశం ఎదుర్కొంటున్న వ్యయ సమస్యలను క్రమంగా తొలగించడం ద్వారా లక్ష్యాలను సాధిస్తారు. 300 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ తయారీలో భాగంగా సెమీకండక్టర్ డిస్‌ప్లే, ఎకోసిస్టమ్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం 10 బిలియన్ డాలర్ల విలువైన పీఎల్ఐ పథకాన్ని ప్రకటించింది. సెమీకండక్టర్ డిజైన్, స్మార్ట్‌ఫోన్‌లు, ఐటీ హార్డ్‌వేర్ కాంపోనెంట్‌ల కోసం - నాలుగు పీఎల్ఐ పథకాల ద్వారా ప్రభుత్వం వచ్చే 6 సంవత్సరాలలో దాదాపు 17 బిలియన్ డాలర్ల పెట్టుబడికి కట్టుబడి ఉంది. విజన్ డాక్యుమెంట్.. ఎలక్ట్రానిక్స్ రంగంలో సమగ్ర దేశీయ విలువ జోడింపుపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతపై బలమైన సిఫార్సులు చేసింది. భారతదేశం ప్రస్తుతం ఉన్న స్థితి నుండి చైనా, వియత్నాం వంటి దేశాలతో పోటీ పడేందుకు సిద్ధంగా ఉంది. గ్లోబల్ కంపెనీలతో పాటు భారతీయ ఛాంపియన్లు పోషించే కీలక పాత్ర ప్రాముఖ్యతను కూడా ఇది వివరిస్తుంది. ఇది రెండూ ఇప్పటికే పీఎల్ఐ పథకాలలో భాగమై ఉన్నాయి.
300 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ తయారీకి భారత్‌ను దారిలో పెట్టేందుకు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్‌పై పోటీ టారిఫ్ నిర్మాణాన్ని, ఇతర ఇబ్బందులను తొలగించాలని నివేదిక కోరింది. పోటీతత్వం, కొన్ని రంగాలకు కొత్త సవరించిన ప్రోత్సాహక పథకాలు, స్థిరత్వం సులభంగా వ్యాపారం చేయడం వంటి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఆర్థిక వ్యవస్థల మద్దతుతో “విజేత అందరినీ అంగీకరిస్తుంది” వ్యూహాన్ని నివేదిక సిఫార్సు చేస్తుంది.
చార్ట్: 300 బిలియన్ డార్లు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారు చేయడానికి రోడ్‌మ్యాప్
వివరణ: పట్టిక వివరణ స్వయంచాలకంగా రూపొందించబడింది
విజన్ డాక్యుమెంట్-వాల్యూమ్ 2 "2026 నాటికి 300 బిలియన్ డాలర్ల సస్టైనబుల్ ఎలక్ట్రానిక్స్ తయారీ & ఎగుమతి
***
(Release ID: 1792509)
Visitor Counter : 209