మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సేవ్ ద గ‌ర్ల్ ఛైల్డ్ పై వెబినార్ నిర్వ‌హించిన జాతీయ మ‌హిళా క‌మిష‌న్‌

నాడు పోస్టు చేయడమైనది: 24 JAN 2022 5:15PM by PIB Hyderabad

జాతీయ మ‌హిళా క‌మిష‌న్ (ఎన్ సి డ‌బ్ల్యు) ,జాతీయ బాలికా దినోత్స‌వం సంద‌ర్భంగా బాలిక‌ల‌ను ర‌క్షించండి అనే అంశంపై ఒక వెబినార్ ను  నిర్వ‌హించింది. బాలిక‌ల  విద్య‌,ఆరోగ్యం, పౌష్టికాహారం వంటి వాటిపై  బాలిక‌ల హ‌క్కుల‌ను ప్రోత్స‌హించేందుకు , ఇందుకు సంబంధించిన  వివిధ అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఈ వెబినార్ ను నిర్వ‌హంచారు. బాలిక‌ల ప‌ట్ల స‌మాజ వైఖ‌రి విష‌యంలో నూత‌న దృక్ప‌థాన్ని ప్రోత్స‌హించడం, బాలిక‌లు ఎదుర్కొంటున్న వివ‌క్ష‌ను త‌గ్గించ‌డం ఈ చ‌ర్చ ఉద్దేశం.
ఛైర్ ప‌ర్స‌న్ రేఖా శ‌ర్మ‌, హ‌ర్యానా మాజీ కేబినెట్ మంత్రి శ్రీ ఒ.పి. ధ‌న్‌క‌ర్‌, సేవ్ ద చిల్ట్ర‌న్ ప్ర‌చార హెడ్‌
 ప్ర‌గ్య వాట్స్ త‌దిత‌రులు  ఈ వెబినార్ కు పేన‌లిస్టులుగా వ్య‌వ‌హ‌రించారు.

బాలికా విద్య‌, ఆరోగ్యం, ఎంపిక‌లో స్వేచ్ఛ‌, నిర్ణ‌యాలు తీసుకునే హ‌క్కు వంటి బాలిక‌ల‌కు సంబంధించిన ప‌లు అంశాల‌ను ఛైర్ ప‌ర్స‌న్ ఈ వెబినార్ లో ప్ర‌స్తావించారు. బాలిక‌లు జీవ‌న అన్ని రంగాల‌లో స‌మాన స్థాయిని క‌లిగి ఉంటార‌ని, ప్ర‌భుత్వం బాలికా విద్య‌ను ప్రోత్స‌హించేందుకు మ‌హిళా కేంద్రిత విధానాల‌ను అనుస‌రిస్తున్న‌ద‌ని అన్నారు.

బాలిక‌లు అన్ని రంగాల‌లో త‌మ ప్ర‌తిభ‌ను రుజువు చేసుకున్నారు, అలాగే జాతీయ మ‌హిళా క‌మిష‌న్ త‌మ కార్య‌క‌లాపాల ద్వారా ప్ర‌తి రంగంలో బాలిక‌ల ర‌క్ష‌ణ‌, సాధికార‌త‌కు దోహ‌ద‌ప‌డుతోంది. మ‌న ప్ర‌భుత్వం ,  బాలిక‌లు  త‌మ నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌ను ప్ర‌ద‌ర్శించేందుకు అవ‌కాశం క‌ల్పిస్తోంది. అయితే స‌మాజం తిరోగ‌మ‌న ధోర‌ణిని ఇంకా వ‌దిలించుకోవ‌ల‌సిన అవ‌స‌రం ఉంద‌ని , అప్పుడే బాలిక‌లు ముందుకు వ‌చ్చి మార్పుకు ప్ర‌తినిధులుగా ఉంటారు అని శ్రీమ‌తి శ‌ర్మ అన్నారు.

స‌మాజంలో మార్పు తీసుకువ‌చ్చేందుకు ప్ర‌భుత్వం క్రియాశీలంగా ముందుకు వ‌స్తున్న‌ద‌ని శ్రీ ధ‌న్‌క‌ర్ అన్నారు. ఈ మార్పు స‌మాజంలో స్ప‌ష్టంగా క‌నిపిస్తున్న‌ది. అయితే మ‌రింత విస్తృత మార్పు రావ‌ల‌సి  ఉంది. మ‌న ప్ర‌ధాన‌మంత్రి , కేంద్ర ప్ర‌భుత్వం, బాలిక‌ల‌కు ప్రోత్సాహం ఇవ్వ‌డం, వారి ర‌క్ష‌ణ‌కు అంకిత‌మై  ఉంది. ఇది స‌మాజంలో ప్ర‌తిఫ‌లిస్తున్న‌ది. అని ధ‌న్‌క‌ర్ అన్నారు.

పేద‌రికం, పితృస్వామ్యం, దృష్టి కోణం గురించి శ్రీమ‌తి వాట్స్ నొక్కి చెప్పారు. ఇవి మహిళ‌లు అవ‌కాశాల‌ను, సామ‌ర్ధ్యాన్ని కోల్పోయేలా చేస్తాయ‌న్నారు. ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం, స‌మ‌ష్ఠిత‌త్వంతో ఉమ్మ‌డి కృషి ద్వారా  బాలిక‌ల సాధికార‌త‌, బాలిక‌ల అభివృద్ధి సాధించ‌వ‌చ్చ‌ని అన్నారు.
మ‌హిళ‌, శిశు అభివృద్ధి మంత్రిత్వ‌శాఖ కింద ప‌నిచేస్తున్న  జాతీయ మ‌హిళా క‌మిష‌న్ త‌న కార్య‌క్ర‌మాలు, చొర‌వ ద్వారా బాలిక‌ల ప‌ట్ల గ‌ల వివ‌క్ష‌ను తొల‌గించేందుకు అకుంఠిత దీక్ష‌తో ప‌నిచేస్తున్న‌ద‌ని అన్నారు. ఈ దిశ‌గా ఈ చ‌ర్చ ఈ అంశంపై మ‌రింత అవ‌గాహ‌న పెంచేందుకు దోహ‌ద‌ప‌డుతుంద‌ని అన్నారు.

జాతీయ బాలికా దినోత్స‌వాన్ని మొద‌ట 2008 వ సంవ‌త్స‌రంలో కేంద్ర మ‌హిళా  శిశు అభివృద్ధి మంత్రిత్వ‌శాఖ ప్రారంభించింది. జాతీయ బాలికా దినోత్స‌వాన్ని ప్ర‌తి సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 24న నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంది. భార‌త‌దేశంలోని బాలిక‌ల‌కు మ‌ద్ద‌తు, వారికి మ‌రిన్ని అవ‌కాశాలు  క‌ల్పించేందుకు దీనిని నిర్వ‌హిస్తారు. బాలిక‌ల హ‌క్కుల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికి, బాలికా విద్య, వారి ఆరోగ్యం, పౌష్టికాహారం ప్రాధాన్య‌త‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డం దీని ల‌క్ష్యం.

***


(రిలీజ్ ఐడి: 1792290) సందర్శకుల సూచీ సంఖ్య : : 202
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Tamil , English , Urdu , हिन्दी , Marathi , Punjabi