ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ముంబాయిలోని టార్డియోలో భ‌వ‌న అగ్నిప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారికి సంతాపం తెలిపిన ప్ర‌ధాన‌మంత్రి పిఎంఎన్ ఆర్ ఎఫ్ నుంచి ఎక్స్ గ్రేషియా మంజూరు

Posted On: 22 JAN 2022 10:23PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ, ముంబాయిలోని  టార్డియోలో   ని  ఒక భ‌వ‌నంలో జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో మ‌ర‌ణాలు సంభ‌వించ‌డం ప‌ట్ల ప్ర‌ధాన‌మంత్రి విచారం వ్య‌క్తం చేశారు.

బాధిత కుటుంబాల‌కు ఆయ‌న త‌మ సంతాపాన్ని తెలిపారు, గాయ‌ప‌డిన వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు.
ఈ ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి స‌మీప బంధువుల‌కు  రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల వంతున ఎక్స్‌గ్రేషియాను ప్ర‌ధాన‌మంత్రి పిఎంఎన్ ఆర్ ఎఫ్ నుంచి ఆమోదించారు. గాయ‌ప‌డిన వారికి ఒక్కొక్క‌రికి 50,000 రూపాయ‌ల వంతున మంజూరు చేశారు.
ఇందుకు సంబంధించి ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం ఒక ట్వీట్ చేస్తూ,

"ముంబైలోని టార్డియోలో ఒక భవనంలో అగ్నిప్రమాదం జ‌ర‌గ‌డం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియ‌జేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను: అని పేర్కొన్నారు.

 ముంబాయి టార్డియో భ‌వ‌న అగ్ని ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి స‌మీప బంధువుల‌కు పిఎంఎన్ ఆర్ ఎఫ్ నుంచి 2 ల‌క్ష‌ల రూపాయ‌ల ఎక్స్ గ్రేషియా చెల్లించ‌డం జ‌రుగుతుంది. ,గాయ‌ప‌డిన వారికి ఒక్కొక్క‌రికి 50,000 రూపాయ‌లు ఇవ్వ‌డం జ‌రుగుతుంది. -అని ప్ర‌ధాన‌మంత్రి పేర్కొన్నారు.

***


(Release ID: 1792139) Visitor Counter : 138