ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్ర‌ధాన‌మంత్రి రాష్ట్రీయ బాల్ పుర‌స్కార్ అవార్డు గ్ర‌హీత‌ల‌తో జ‌న‌వ‌రి 24 న ముచ్చ‌టించ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి తొలిసారిగా , అవార్డు గ్ర‌హీత‌లకు బ్లాక్ చైన్ టెక్నాల‌జీ ద్వారా డిజిట‌ల్ స‌ర్టిఫికేట్లు ప్ర‌దానం చేయ‌నున్నారు.

Posted On: 23 JAN 2022 10:06AM by PIB Hyderabad

ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కార్ (పిఎంఆర్‌బిపి) గ్రహితలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు మధ్యాహ్నాం 12 గంటల నుంచి  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటిస్తారు. ఈ యేటి పురస్కార విజేతలకు  బ్లాక్ చైన్ సాంకేతిక పరిజాన సహాయంతో డిజిటల్ సర్టిఫికెట్లను బహూకరిస్తారు. ఈ అవార్డు గ్ర‌హీత‌ల‌కు ఈ సాంకేతిక ప‌రిజ్ఞానం ఉప‌యోగించ‌డం ఇదే మొద‌టిసారి.

 వినూత్న ఆవిష్కరణలు , పరిశోధనాత్మక కృషి, క్రీడలు, కళా సంస్కృతులు, సామాజిక సేవ, సాహస  చర్యలు మొదలైన రంగాల్లో అసాధారణ ప్రతిభ కనపర్చిన బాలలకు ఏటా పి.ఎం.ఆర్.బి.పి అవార్డుల‌ను  భార‌త ప్ర‌భుత్వం  అంద‌జేస్తూ వ‌స్తోంది. ఈ ఏడాది దేశ‌వ్యాప్తంగా 29 మంది బాల‌లను పిఎంఆర్ బిపి 2022 అవార్డుకు వివిధ కేట‌గిరీల కింద బాల‌శ‌క్తి పుర‌స్కారాల‌కు ఎంపిక‌చేసింది. అవార్డు గ్ర‌హీత‌లు ప్ర‌తి ఏడాది రిప‌బ్లిక్ దినోత్స‌వ వేడుక‌ల‌లో పాల్గొంటారు. పిఎంఆర్‌బిపి ప్ర‌తి అవార్డు విజేత‌కు ఇక మెడ‌ల్‌, ల‌క్ష‌రూపాయ‌ల న‌గ‌దు స‌ర్టిఫికేట్ బ‌హుక‌రిస్తారు. న‌గ‌దు బ‌హుమ‌తిని పిఎంఆర్‌బిపి 2022 విజేత‌ల ఖాతాల‌కు బ‌ద‌లీ చేస్తారు.

***


(Release ID: 1792009) Visitor Counter : 164