ప్రధాన మంత్రి కార్యాలయం
ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఘనమైనవిగ్రహాన్ని స్థాపించడం జరుగుతుందన్న ప్రధాన మంత్రి
జనవరి 23న నేతాజీ జయంతి సందర్భం లో ఆయన హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధానమంత్రి ఆవిష్కరించనున్నారు
प्रविष्टि तिथि:
21 JAN 2022 3:00PM by PIB Hyderabad
ఇండియా గేట్ లో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కు చెందిన ఒక భవ్యమైనటువంటి విగ్రహాన్ని స్థాపించడం జరుగుతుందంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటన చేశారు. ఆ విగ్రహం పనులు పూర్తి అయ్యేటంతవరకు ఆయన యొక్క హోలోగ్రామ్ స్టాట్యూ ను నేతాజీ జయంతి అయినటువంటి జనవరి 23వ తేదీ నాడు ప్రధాన మంత్రి ఆవిష్కరించనున్నారు.
ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో -
‘‘దేశం నేతాజీ సుభాష్ చంద్ర బోస్ 125వ జయంతి ని జరుపుకొంటున్న కాలం లో, ఆయన కు చెందిన ఒక భవ్యమైనటువంటి, గ్రానైట్ తో రూపొందించేటటువంటి విగ్రహాన్ని ఇండియా గేట్ ప్రాంతం లో స్థాపించడం జరుగుతుందని తెలియ జేయడాని కి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇది ఆ మహానుభావుడి కి భారతదేశం రుణ పడి ఉండనే భావన కు సంకేతం గా ఉండబోతోంది.
నేతాజీ బోస్ యొక్క ఘనమైన విగ్రహాన్ని అమర్చే పని పూర్తి అయ్యేటంత వరకు, ఆయన కు చెందిన ఒక హోలోగ్రామ్ స్టాట్యూ అదే ప్రదేశం లో ఉంటుంది. ఆ హోలోగ్రామ్ స్టాట్యూ ను జనవరి 23న నేతాజీ జయంతి సందర్భం లో నేను ఆవిష్కరిస్తాను’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1791515)
आगंतुक पटल : 250
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam